సీడబ్ల్యుసీ భేటీ: నాయకత్వ మార్పుల్లేవ్.. 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకూ సిద్ధం – కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం దిల్లీలో జరిగింది. ఏఐసీసీ మధ్యంతర అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యుసీ సభ్యులు హాజరయ్యారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, అరుణ్ శాండిల్య

బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

యుక్రెయిన్‌, రష్యా సంక్షోభం 18వ రోజుకు చేరుకుంది.

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ సమీపంలో భీకర పోరాటం జరుగుతోంది.

రష్యాతో పోరాటంలో ఇప్పటి వరకు 1300 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారని ఆ దేశ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్స్కోల్జ్‌లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మరోసారి టెలిఫోన్‌లో చర్చలు జరిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.