యుక్రెయిన్‌పై రష్యా దాడులు: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సమీపంలో భీకర పోరాటం జరుగుతోంది. రష్యా సైన్యం కీయెవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉందన్న రిపోర్టులు వస్తున్నాయి.
కీయెవ్‌లోని సైనిక ఎయిర్‌ఫీల్డ్‌పై రష్యా క్షిపణి దాడులు చేసింది. అంతకుముందు ఆహార గోదాంపైనా దాడులు చేసింది.
రష్యాతో పోరాటంలో ఇప్పటి వరకు 1300 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారని ఆ దేశ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.
శుక్రవారం 500 నుంచి 600 మంది రష్యా సైనికులు యుక్రెయిన్ బలగాల ముందు లొంగిపోయారని ఆయన వెల్లడించారు. అయితే, ఈ వివరాలను బీబీసీ వెరిఫై చేయలేదు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్స్కోల్జ్‌లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మరోసారి టెలిఫోన్‌లో చర్చలు జరిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రష్యాతో తాము ప్రత్యక్ష యుద్ధం చేయబోమని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు.
యుక్రెయిన్ మద్దతుగా తమ బలగాలను పంపించబోమని ఆయన అన్నారు. నాటో, రష్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ అంటూ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధమేనని బైడెన్ అన్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

















