యుక్రెయిన్ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలని భారత్‌పై ఒత్తిడి
వికాస్ పాండే
బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలని భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
భారత్, మాస్కోకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వోటు వేసేందుకు నిరాకరించింది. అయితే, యుక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్యపరమైన చర్చలు జరగాలని కోరింది.
భారతదేశం రక్షణ దిగుమతుల్లో 50 శాతం రష్యా నుంచే వస్తాయి. అంతే కాకుండా, ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి.
అయితే, గత రెండు దశాబ్దాలుగా అమెరికాతో కూడా భారత్ సంబంధాలు బలపడుతున్నాయి.
ఈ పరిస్థితిలో యుక్రెయిన్ సంక్షోభంపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం భారత్‌కు పెను సవాలే.
భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ శనివారం భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని స్వాగతించారు.
మరోవైపు, యుక్రెయిన్‌పై భారతదేశం స్పష్టమైన వైఖరిని తీసుకునేలా వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త డొనాల్డ్ లూ అన్నారు.