స్కై న్యూస్ చీఫ్ కరస్పాండెంట్ స్టువార్ట్ రామ్‌సే, తన నలుగురు సహచరులతో కలిసి సోమవారం యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు తిరిగి వెళుతుండగా, రష్యా దళాలు మెరుపుదాడి చేశాయి.
ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న రామ్‌సే మాటల్లో దాడి ఎలా జరిగిందంటే..
నా చావు ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఉండగా నడుం మీద తుపాకీ గుండు దిగింది.
"నన్ను తుపాకీతో కాల్చారు" అని గట్టిగా అరిచాను. కానీ, అంత నొప్పేం కలగలేదు. నడుం మీద గట్టిగా పిడికిలితో గుద్దినట్టు అనిపించిందంతే.
అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయతించాను. ఎలాగోలా నా ఇయర్ ఫోన్లు, ప్రెస్ కార్డు చేజిక్కుంచుకున్నా.
కారు దిగి లేచి నిలబడ్డానని, ఒడ్డు నుంచీ జాగింగ్ చేస్తూ, మెల్లగా పరుగు అందుకున్నానని నా సహోద్యోగి చెప్పారు.
పరిగెడుతూ అదుపు తప్పి, కింద పడిపోయాను. ముఖానికి దెబ్బ తగిలింది. హెల్మెట్ నన్ను కాపాడింది.
మేం చాలా అదృష్టవంతులం. కానీ, వేల కొద్దీ యుక్రెయినియన్లు చనిపోతున్నారు. వాళ్ల కుటుంబాలను లక్ష్యాలుగా చేసుకుని రష్యా దాడి చేస్తోంది.
ఈ యుద్ధం రోజు రోజుకూ ఘోరంగా తయరవుతోంది.