గాయపడి ఇళ్లు, వీధుల్లో పడి ఉన్నవారిని కాపాడే అవకాశం కూడా లేదు
రష్యా దాడుల్లో గాయపడిన వారిని కాపాడే అవకాశం కూడా లేనంతగా షెల్లింగ్ జరుగుతోందని మరియుపోల్ మేయర్ తెలిపారు.
నల్ల సముద్రం తీరంలో ఉన్న ఈ రేవు పట్టణంపై నిన్నటి నుంచి పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతున్నాయి.
బాంబుల వర్షం ఆగకపోవడంతో గాయాలతో ఎక్కడికక్కడ పడి ఉన్న వారిని రక్షించే అవకాశం ఏమాత్రం లేకుండా పోయిందని నగర మేయర్ ఒక వీడియో సందేశంలో తెలిపారు.
మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రజలు సురక్షితంగా అక్కడి నుంచి బయట పడేందుకు తమ సైన్యం అవకాశం కల్పిస్తోందని చెబుతోంది.
అయితే యుక్రెయిన్ సైన్యం లొంగిపోకపోతే దాడులు మరింత తీవ్రం చేస్తామని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి ప్రకటించారు.