రష్యా మీద తీవ్ర ఆంక్షలు విధిస్తాం: బైడెన్
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. రష్యా సైనిక చర్యను ఖండించేలా అంతర్జాతీయ సమాజాన్ని కదిలించేందుకు తాను చేపట్టిన చర్యలను బైడెన్ ఆయనకు వివరించారు.
ఈ దాడిని నిష్కారణమైన, అన్యాయమైన దాడిగా తాను ఖండిస్తున్నట్లు బైడెన్ ఒక ప్రకటనలో చెప్పారు.
పుతిన్ ‘‘దుష్ట దురాక్రమణకు వ్యతిరేకంగా విస్పష్టంగా మాట్లాడేలా, యుక్రెయిన్ ప్రజల పక్షాన నిలబడేలా ప్రపంచ నేతలకు పిలుపునివ్వాలని ఆయన నన్ను కోరారు’’ అని బైడెన్ పేర్కొన్నారు.
తాను గురువారం నాడు జీ7 నేతలతో సమావేశమవుతానని.. రష్యా మీద తీవ్ర ఆంక్షలు విధిస్తామని చెప్పారు.
యుక్రెయిన్‌కు, యుక్రెయిన్ ప్రజలకు మద్దతు, సాయం అందించటాన్ని తాము కొనసాగిస్తామన్నారు.