ఈ ఫొటోను సిరియాలో తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ప్రాంతంలో తీశారు.
ఇక్కడ ఇళ్లన్నీ
పూర్తిగా ధ్వంసమవడంతో, పరిశుభ్రత పాటించడం
చాలా కష్టం. ఇప్పుడు కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడం వారికి పెను సవాలుగా
మారింది.
ఈ ఫొటోల్లో పిల్లలు, పెద్దలు ఇఫ్తార్ విందులో వరుసగా కూర్చుని ఉండడం మనం చూడచ్చు.
ప్రతి ఏటా రంజాన్ మాసంలో లక్షలమంది
ముస్లింలు 30 రోజులు రోజా ఉండి, సాయంత్రం ఇఫ్తార్ చేస్తారు.
సిరియాలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం
ఏప్రిల్ నెలలో కొన్ని నిబంధనలు అమలు
చేశారు.
కానీ యుద్ధం వల్ల చాలా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జనం సామాజిక దూరం పాటించడం కూడా ఒక పెద్ద సవాలుగా
మారింది.
ఈ ఫొటో అలెప్పో పశ్చిమ ప్రాంతం అతరేబ్‌లో
తీసింది. ఇక్కడ కొంతమంది ఇఫ్తార్ కోసం కూచుని ఉన్నారు.
వీరంతా కూచోడానికి ముందు ఆ ప్రాంతాన్ని సివిల్ డిఫెన్స్
కార్మికులు క్రిమిరహితం చేశారని, శుభ్రం చేశారని
ఈ విందు ఏర్పాటు చేసిన సంస్థ చెప్పింది.
శుక్రవారం ప్రభుత్వం అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రెండు కొత్త
కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 64కు చేరిందని రాయిటర్స్
తెలిపింది.
తిరుగుబాటుదారుల ఆక్రమణలో ఉన్న నైరుతి
సిరియాలో ఇప్పటివరకూ కరోనా కేసులు ఏవీ ధ్రువీకరించలేదు. అక్కడ ఉన్న 40 లక్షల మందిలో
కొన్ని వందల మందికి మాత్రమే టెస్టులు చేయడం దానికి కారణం కావచ్చని చెబుతున్నారు.