యూరప్‌లో ప్రతిరోజూ మరణాలు, కానీ తగ్గిన సంఖ్య
ఫ్రాన్స్ లో బుధవారం 278 మంది చనిపోగా, గురువారం మృతుల సంఖ్య 178కి తగ్గింది. ఫ్రాన్స్ ప్రధాని లాక్‌డౌన్‌ను కొంత సడలిస్తామని చెప్పారు. కానీ పారిస్, ఆగ్నేయ ప్రాంతాల్లో ఇది కొనసాగనుంది.
ఇటలీలో కూడా కోవిడ్-19 మృతుల సంఖ్య తగ్గుతోంది. బుధవారం దేశంలో 274 మంది చనిపోగా, గురువారం ఆ సంఖ్య దానికంటే తగ్గింది.
స్పెయిన్‌లో బుధవారం కరోనాతో 244 మంది చనిపోగా, గురువారం ఆ సంఖ్య 213కు తగ్గింది. దేశంలో రాకపోకలు నియంత్రించేందుకు అత్యవసరస్థితిని మరో రెండు వారాలు పెంచాలని స్పెయిన్ నిర్ణయించింది.
యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన పోలెండ్‌లో మరణాల రేటు మిగతా దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంది. ఇక్కడ గత 24 గంటలుగా 324 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 22 మంది చనిపోయారు.