వీఈ డే సందర్భంగా లండన్‌లో రెడ్ యారోస్ ఫ్లైపాస్ట్
యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 75వ వార్షికోత్సవం సందర్భంగా.. బ్రిటన్ వైమానిక దళం రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెడ్ యారోస్ విమానాలు సెంట్రల్ లండన్ మీదుగా దూసుకెళ్లాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ బేషరతుగా మిత్రరాజ్యాలకు లొంగిపోయిన మే 8వ తేదీని ప్రతి ఏటా ‘వీఈ డే’ (విక్టరీ ఇన్ యూరప్ డే)గా జరుపుకుంటారు.
ఈ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా.. యుద్ధ కాలపు తరం వారి సేవలు, త్యాగాలకు గౌరవ సూచకంగా బ్రిటన్‌లో రెండు నిమిషాల పాటు మనం పాటిస్తారు.
లండన్‌లో ఫ్లైపాస్ట్ దృశ్యాలు కొన్ని...