కరోనావైరస్: ఇటలీలో 30,201, బ్రిటన్‌లో 31,315, అమెరికాలో 76,101 కోవిడ్ మృతులు...
బ్రిటన్ తరువాత కోవిడ్ మృతుల్లో 30 వేల మార్క్‌ను ఇటలీ దాటింది. అమెరికాలో కరోనావైరస్ సంక్రమణ వేగం తగ్గడం లేదు. ఈ దేశంలో ఇప్పటికే 12,63 లక్షల కేసులు నమోదయ్యాయి. 75 వేలకు పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 38.89 లక్షల కోవిడ్ కేసుల్లో ఇప్పటివరకు 2.70 లక్షల మరణాలు నమోదయ్యాయి.
లైవ్ కవరేజీ
కరోనావైరస్ నేటి ముఖ్యాంశాలు...
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. ప్లాస్మా థెరపీ సమర్థత, సురక్షతలను అంచనా వేయటానికి ఐసీఎంఆర్ 21 ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించటానికి ఎథిక్స్ కమిటీ ఆమోదించింది.
- భారతదేశంలో 216 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులేవీ గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇప్పటివరకూ మొత్తం 16,540 మంది కోలుకున్నారు. మరో 37,916 మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.
- ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు చేరింది. ఇప్పటివరకూ 842 మంది డిశ్చార్జ్ కాగా, ఆస్పత్రుల్లో 1004 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో ముగ్గురు చనిపోవడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.
- తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 10 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132కు పెరిగింది. వీరిలో 727 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- దేశంలో లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను జూలై 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రకటించారు.
- ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తమ కార్యాలయాలను తిరిగి తెరవటానికి ప్రణాళికలను ప్రకటించాయి. అయితే.. తమ ఉద్యోగులు ఈ ఏడాది అంతా ఇంటి నుంచే పని చేయటానికి అనుమతిస్తామని చెప్పాయి.
- అమెరికాలో ఏప్రిల్‌లో ఏకంగా 2.05 కోట్ల ఉద్యోగాలు పోయాయి. ఏప్రిల్ నెలలో 4.4 శాతంగా ఉన్న ఈ నిరుద్యోగిత రేటు ఇప్పుడు ఏకంగా 14.7 శాతానికి పెరిగిపోయింది.
- బ్రిటన్‌లో కరోనావైరస్ మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 31,241కి పెరిగిందని పర్యావరణ శాఖ మంత్రి జార్జ్ యూస్టీస్ తెలిపారు. గురువారం నుంచి 626 మంది చనిపోయినట్లు చెప్పారు.
- ఇప్పటివరకూ కరోనావైరస్ మృతుల సంఖ్య 30,000 దాటిన దేశాల్లో అమెరికా, బ్రిటన్‌లు మాత్రమే ఉండగా.. తాజాగా ఇటలీలో కూడా మరణాలు ఆ సంఖ్యను దాటాయి.
- కరోనావైరస్ మూలాలను నిర్ధారించటానికి కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ కొత్త కరోనావైరస్‌కు గబ్బిలాల నుంచి వచ్చిందని, అది మనుషులకు సోకే ముందు మరో జంతువులో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోందని వివరించింది. ఆ జంతువు ఏమిటనేది ఇంకా తెలియలేదు.
- కరోనా వల్ల ప్రపంచమంతటా 'విద్వేష సునామీ' వ్యాపిస్తోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. ఈ విద్వేషాలకు అంతం పలికేందుకు అన్ని దేశాలు అన్ని రకాల ప్రయత్నాలూ చేయాలనిపిలుపునిచ్చారు.
ఇటలీలో 30,000 దాటిన కరోనా మృతుల సంఖ్య
ఇటలీలో మృతుల సంఖ్య 30,201 కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకూ కరోనావైరస్ మృతుల సంఖ్య 30,000 దాటిన దేశాల్లో అమెరికా, బ్రిటన్‌లు మాత్రమే ఉండగా.. తాజాగా ఇటలీలో కూడా మరణాలు ఆ సంఖ్యను దాటాయి.
యూరోపియన్ యూనియన్ వరకూ చూస్తే ఇటలీలోనే అత్యధిక మరణాలు సంభవించాయి.
దేశంలో శుక్రవారం నాడు 243 మంది చనిపోయారు. ఆ ముందు రోజు మరణాల సంఖ్య 274తో పోలిస్తే తగ్గాయి.
అలాగే.. రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో 1,327 కొత్త కేసులు వచ్చాయి.
దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,17,185కు పెరిగింది.
బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య 31,241 - ఒక్క రోజులో 626 మంది మృతి

ఫొటో సోర్స్, PA
బ్రిటన్‌లో కరోనావైరస్ మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 31,241కి పెరిగిందని పర్యావరణ శాఖ మంత్రి జార్జ్ యూస్టీస్ తెలిపారు. గురువారం నుంచి 626 మంది చనిపోయినట్లు చెప్పారు.
దేశంలో రోజుకు 97,000 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ మొత్తం 16,31,561 పరీక్షలు చేశామన్నారు.
గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,639 పెరిగిందని.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,11,364 కు చేరిందని వివరించారు.
అయితే.. ప్రస్తుతం 11,7888 మంది కరోనావైరస్‌తో ఆస్పత్రుల్లో ఉన్నారని.. నిన్న 12,688 గా ఉన్న ఈ సంఖ్య తగ్గిందని చెప్పారు.
వందే భారత్ మిషన్: రియాద్ నుంచి కోజికోడ్ చేరుకున్న విమానం
వందే భారత్ మిషన్‌లో భాగంగా రియాద్ నుంచి భారత పౌరులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం రాత్రి కేరళలోని కోజికోడ్‌లో దిగింది.
విదేశాల నుంచి వస్తున్న వారికి వైరస్ స్క్రీనింగ్ నిర్వహించటానికి దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘నిరుపేద దేశాలకు సాయం చేయండి’ – పుతిన్‌ను కోరిన బోరిస్ జాన్సన్

కరోనావైరస్ మీద పోరాడటానికి ఉద్దేశించిన శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు.
బ్రిటన్ వచ్చే నెలలో ప్రపంచ దేశాధినేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనుంది.
బోరిస్ జాన్సన్ తాజాగా పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారని.. ప్రపంచంలోని పలు నిరుపేద దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసి కరోనావైరస్‌ను నియంత్రించటానికి సాయం చేసే పనిలో కలిసిరావాలని పుతిన్‌ను కోరారాని ప్రధాని కార్యాలయం తెలిపింది.
వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రపంచ సంస్థ ‘గవీ’కి మద్దతు ఇవ్వటానికి.. ప్రపంచ దేశాల అధినేతలు, దాతలు, వ్యాక్సిన్ తయారీదారులతో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు బ్రిటన్ గత నెలలో ప్రకటించింది.
ఇరువురు నేతలూ ‘‘కరోనావైరస్‌ను ఓడించటానికి ఉమ్మడిగానూ, ఇతర దేశాలతోనూ కలిసి పనిచేయటం కొనసాగించాల్సిన ప్రాధాన్యత మీద ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు’’ అని 10 డౌనింగ్ స్ట్రీట్ పేర్కొంది.
విక్టరీ ఇన్ యూరప్ 75వ వార్షికోత్సవం సందర్భంగా బోరిస్, పుతిన్‌లు ఫోన్‌లో సంభాషించారు.
పడవకు బదులుగా పంది పిల్లలు - ఫిజీలో విస్తరిస్తున్న వస్తుమార్పిడి
పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ దీవి నివాసులు.. ఆదిమ కాలపు వస్తుమార్పిడి (బార్టర్) విధానానికి తిరిగి అలవాటు పడుతున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా డబ్బులు కరవవుతండటమే దీనికి కారణం.
‘బార్టర్ ఫర్ ఎ బెటర్ ఫిజీ’ పేరుతో ఏర్పాటైన ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఇప్పుడు 1.20 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. మొత్తం దేశంలో 10 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారంటే.. ఈ గ్రూప్ ఎంత పాపులర్ అయిందో తెలుస్తోంది.
ఒక డీల్‌లో ఒక కయాక్ (చిన్న పడవ) కోసం రెండు పంది పిల్లలు మార్పిడి చేసుకున్నారు. మరొక డీల్‌లో జడలు వేసినందుకు బొమ్మలు మార్పిడి చేశారు.
కరోనావైరస్ వ్యాప్తి ప్రభావం ఫిజీ మీద పెద్దగా లేకపోయినా.. దేశానికి కీలకమైన పర్యాటక రంగానికి గట్టి దెబ్బ తగిలింది.

ఫొటో సోర్స్, Facebook
తెలంగాణలో 14 ఆరెంజ్ జోన్ జిల్లాలను గ్రీన్ జోన్లుగా మార్చాలని కేంద్రాన్ని కోరాం: ఈటల
తెలంగాణ రాష్ట్రంలో 14 ‘ఆరెంజ్ జోన్’ జిల్లాల్లో గత 20 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
ఈ 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
అలాగే.. కొత్త కేసులు నమోదు కాని మూడు ‘రెడ్ జోన్’ జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించాలని సిఫారసు చేశామన్నారు.
ఇదిలావుంటే.. తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 10 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదే రోజు 34 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు చెప్పింది.
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132కు పెరిగింది. వీరిలో 727 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకూ తెలంగాణలో కోవిడ్-19 కారణంగా 29 మంది చనిపోయారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికాలో నెల రోజుల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఆవిరి: ‘‘ఆశ్చర్యం లేదు.. వాటిని నేను వెనక్కు తేగలను’’ - ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో నిరుద్యోగం అత్యధిక స్థాయికి చేరుకుందని తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. ఏప్రిల్‌లో ఏకంగా 2.05 కోట్ల ఉద్యోగాలు పోయాయి.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఇప్పుడు ఆందోళనకరమైన వేగంతో నిరుద్యోగం పెరిగిపోతోంది. 1930ల నాటి మహా మాంద్యం అనంతరం ఇంతటి తీవ్ర పరిస్థితులు ఎన్నడూ లేవు.
2008-09 ఆర్థిక సంక్షోభం సమయంలో అమెరికాలో నిరుద్యోగం రేటు 10 శాతానికి పెరిగిపోయింది. కానీ నాటికన్నా.. ఈ ఏప్రిల్ నెలలో కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య చాలా ఎక్కువ.
దేశంలో రెండు నెలల కిందట నెల వారీ నిరుద్యోగం రేటు 3.5 శాతంగా ఉంది. ఇది 50 ఏళ్ల కనిష్ట స్థాయి.
ఏప్రిల్ నెలలో 4.4 శాతంగా ఉన్న ఈ నిరుద్యోగిత రేటు ఇప్పుడు ఏకంగా 14.7 శాతానికి పెరిగిపోయింది. కరోనావైరస్ మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవటంతో ఏకంగా 2.05 కోట్లఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయి.
అన్ని రంగాల్లోనూ ఉపాధి కుప్పకూలింది. ముఖ్యంగా వినోదం, హోటల్ రంగాల్లో అత్యధికంగా ఉంది. ఈ రంగాల్లో 77 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
అయితే.. ఇందులో ఆశ్చర్యం లేదని, ఇలా జరుగుతుందని తెలిసిందేనని దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తేలికగా కొట్టేశారు.
ఆయన ఫాక్స్ న్యూస్ చానల్‌లో మాట్లాడుతూ.. ‘‘డెమోక్రాట్లు కూడా అందుకు నన్ను నిందించటం లేదు. నేను ఆ ఉద్యోగాలను వెనక్కు తీసుకు రాగలను’’ అని పేర్కొన్నారు. భవిష్యత్ అవకాశాల పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థను పున:ప్రారంభించాలని ట్రంప్ కాంక్షిస్తున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలను సడలిస్తున్నారు. మరికొన్ని చోట్ల లాక్‌డౌన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తాయి.

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ నెలలో 2.05 కోట్ల ఉద్యోగాలు పోయాయి యూరప్‌లో తెరుచుకుంటున్న సాంస్కృతిక పర్యాటక కేంద్రాలు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఏథెన్స్‌లోని ఆక్రోపోలిస్‌ను మే 18 నుంచి మళ్లీ తెరుస్తున్నారు డెన్మార్క్‌లో థియేటర్లు, మ్యూజియంలు, సినిమాలు, జూలను జూన్ 8వ తేదీ నుంచి తెరవటానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.
అలాగే 10 మందికి మించి ఎక్కువ మంది ఒక చోట కలవకూడదని ఉన్న ప్రస్తుత నిబంధనలను.. సడలించి ఆ పరిమితిని 30 నుంచి 50 మందికి పెంచనున్నట్లు తెలిపింది.
గ్రీస్‌లో కూడా ఆక్రోపోలిస్, డేల్ఫీ, ఏన్షియంట్ ఒలింపియా వంటి ప్రాచీన పర్యాటక కేంద్రాలను మే 18వ తేదీ నుంచి తెరవటానికి అనుమతించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానిది చాలా కీలక భాగం.
ఇక జర్మనీలో బుధవారం నాడే కొన్ని మ్యూజియంలను పున:ప్రారంభించారు.
జూలై 1 నుంచి 15 వరకూ సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు
దేశంలో లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను జూలై 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రకటించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మద్యం దుకాణాలు మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం
తమిళనాడులో మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతించింది.
రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరవటంతో మధురై వంటి పలు ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయి.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో శుక్రవారం నాడు కొత్తగా 600 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 399 కేసులు ఒక్క చెన్నై నగరంలోనే ఉన్నాయి.
దీంతో రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 6,009కి పెరిగింది. వీరిలో 1,605 మంది కోలుకోగా, 40 మంది చనిపోయారు.
ప్రస్తుతం 4,361 కేసులు కొనసాగుతున్నాయని తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పారా మిలటరీ బలగాల్లో 514 మందికి వైరస్ నిర్ధారణ, ఐదుగురు మృతి
దేశంలో కరోనావైరస్ మీద పోరాటంలో ముందు వరుసలో ఉన్న పారామిలటరీ బలగాలకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఇప్పటివరకూ సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ తదితర సాయుధ బలగాలకు చెందిన 514 మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. వీరిలో ఐదుగురు చనిపోయారు.
ఇందులో 450కి పైగా కేసులు రాజధాని నగరమైన దిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మోహరించిన సాయుధ సిబ్బందిలోనే ఉన్నాయి. చనిపోయిన ఐదుగురిలో ఒకరు దిల్లీలో వైరస్‌కు బలయ్యారు.
బీఎస్ఎఫ్‌లో దాదాపు 200 మందికి వైరస్ సోకగా, ఇద్దరు చనిపోయారు.
సీఆర్‌పీఎఫ్‌లో మొత్తం 162 కేసులు నమోదవగా ఒకరు చనిపోయారు. ఇందులో 156 కేసులు దిల్లీ లోనే ఉన్నాయి.
ఇక విదేశాల నుంచి భారత్ తిరిగి వచ్చే వారికి మొట్టమొదటిగా క్వారంటైన్ సెంటర్లను ప్రారంభించిన ఐటీబీపీలో 85 మందికి వైరస్ సోకింది.
ఇక ఎయిర్‌పోర్ట్, దిల్లీ మెట్రో భద్రత కోసం మోహరించిన సీఐఎస్ఎఫ్ జవాన్లలో 35 మందికి వైరస్ సోకగా, ఇద్దరు చనిపోయారు.
సాధారణంగా ఇండియా – నేపాల్ సరిహద్దులో విధులు నిర్వర్తించే ఎస్ఎస్‌బీలో 17 మంది వైరిస్ బారిన పడ్డారు. వారందరూ దిల్లీలో విధుల్లో నిర్వహిస్తున్న వారే.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫేస్‌బుక్, గూగుల్ ఉద్యోగులు ఈ ఏడాదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు

ఫొటో సోర్స్, Getty Images
ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తమ కార్యాలయాలను తిరిగి తెరవటానికి ప్రణాళికలను ప్రకటించాయి. అయితే.. తమ ఉద్యోగులు ఈ ఏడాది అంతా ఇంటి నుంచే పని చేయటానికి అనుమతిస్తామని చెప్పాయి.
గూగుల్ తొలుత.. జూన్ ఒకటో తేదీ వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని కొనసాగిస్తామని చెప్పింది. తాజాగా మరో ఏడు నెలలు ఈ విధానాన్ని పొడిగిస్తోంది.
ఫేస్‌బుక్ మాత్రం.. లాక్‌డౌన్లను క్రమంగా తొలగిస్తుండటంతో జూలై ఆరో తేదీ నుంచి తన కార్యాలయాలను తిరిగి తెరవాలని భావిస్తోంది.
ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిన అవసరమున్న ఉద్యోగులు జూలై నుంచి రావచ్చునని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ చెప్పారు. వారి కోసం మరింత మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే ఇళ్ల దగ్గరి నుంచే తమ ఉద్యోగాలు చేయగలిగే వారు ఈ ఏడాది చివరి వరకూ అలాగే చేయవచ్చునని చెప్పారు.
ఫేస్‌బుక్ కూడా ఇటువంటి ప్రకటనే చేసింది. ‘‘ఆఫీసుకు దూరంగా ఉండి తమ విధులు నిర్వర్తించగలిగిన వారు అందరూ ఈ ఏడాది చివరి వరకూ ఇంటి నుంచే పని చేసుకోవచ్చు’’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ప్లాస్మా థెరపీ ప్రయోగాత్మక పరీక్షలకు ఎథిక్స్ కమిటీ ఆమోదం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రాజెక్ట్ ప్లాసిడ్ – ఫేజ్ 2 ఓపెన్ లేబుల్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్’కు కోవిడ్-19 నేషనల్ ఎథిక్స్ కమిటీ ఆమోదం లభించిందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
ఇందులో భాగంగా.. ప్లాస్మా థెరపీ సమర్థత, సురక్షతలను అంచనా వేయటానికి ఐసీఎంఆర్ 21 ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించవచ్చునని చెప్పారు.
కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నేపాల్‌లో చిక్కుకుపోయిన బ్రిటిష్ పౌరులను కాపాడిన గూర్ఖాలు
కరోనావైరస్ విజృంభించటంతో నేపాల్‌లో మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 100 మందికి పైగా బ్రిటన్ ప్రజలను గూర్ఖాలు రక్షించారు.
రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉన్న నేపాల్ ఆర్మీకి చెందిన సైనికులు.. స్థానిక పరిస్థితుల మీద తమకున్న అవగాహనను ఉపయోగించి ఈ ఆపరేషన్ నిర్వహించారు.
పర్వతాల మీద గల పట్టణాలు, గ్రామాలు, పార్కుల్లో చిక్కుకుపోయి ఉన్న 109 మంది బ్రిటిష్ పౌరులు, మరో 28 మంది విదేశీయులను నేపాల్ సైన్యం కాపాడిందని బ్రిటన్ విదేశాంగ శాఖ తెలిపింది.
నేపాల్ సైనికులు, బ్రిటన్ రాయబార కార్యాలయ సిబ్బంది, స్థానిక డ్రైవర్లు మూడు వారాల పాటు హిమాలయాల్లో 6,400 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆపరేషన్ పూర్తిచేసినట్లు వివరించింది.
ఒక చోట చిక్కుకుపోయిన ఒక ప్రయాణికుడి కోసం సైన్యంలో పోస్టల్ వర్కర్‌గా పనిచేస్తున్న సార్జంట్ ప్రకాష్ గురుంగ్.. ఇరుకైన దారుల గుండా, విరిగిపడిన కొండచరియలను దాటుకుని వెళ్లారు.
‘‘ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి సాయం చేయటం నాకు సంతృప్తినిస్తుంది’’ అని యన చెప్పారు.

ఫొటో సోర్స్, UK Foreign Office
216 జిల్లాల్లో కరోనా కేసులేమీ లేవు: కేంద్రం
భారతదేశంలో 216 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులేవీ గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మరో 42 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదన్నారు.
గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇదే సమయంలో 1,273 మంది రోగులుకోలుకున్నట్లు తెలిపారు.
‘‘ప్రస్తుతం రికవరీ రేటు 29.36 శాతంగా ఉంది. ఇప్పటివరకూ మొత్తం 16,540 మంది కోలుకున్నారు. మరో 37,916 మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు’’ అని వివరించారు.
‘‘మనం (కరోనా వైరస్‌కు సంబంధించి) అవసరమైన విధినిషేధాలను పాటిస్తే దేశంలో కేసుల సంఖ్య తారా స్థాయికి పెరగకపోవచ్చు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఎప్పుడూ ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కశ్మీర్‌లో జీతాల కోసం కార్మికుల ఆందోళన హింసాత్మకం
జమ్మూకశ్మీర్‌లోని కతువాలో చినాబ్ టెక్స్‌టైల్ మిల్స్ కార్మికులు తమకు పూర్తి వేతనాలు చెల్లించాలంటూ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.
‘‘వాళ్లకు చెల్లించిన జీతాలు సరిపోలేదని వారు భావిస్తున్నారు. తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని కూడా వారు కోరుకుంటున్నారు’’ అని ఎస్ఎస్‌పీ శైలేంద్ర మిశ్రా చెప్పారు.
ఈ ఘటనలో గాయపడిన వారని ఆస్పత్రికి తరలిస్తామన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘వైరస్ మూలాలను కనుక్కోవటానికి సంవత్సరం పడుతుంది’

కరోనావైరస్ మూలాలను నిర్ధారించటానికి కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
జంతువుల నుంచి పుట్టుకొచ్చే వైరస్‌ల మీద డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడొకరు తాజాగా జెనీవాలో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఉన్న ఆధారాలు ఈ కొత్త కరోనావైరస్‌కు గబ్బిలాలు అసలు మూలంగా సూచిస్తున్నాయని, అది మనుషులకు సోకే ముందు మధ్యలో మరో జంతువులో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోందని వివరించారు.
అయితే ఆ జంతువు ఏమిటనేది ఇంకా తెలియలేదు.
ఈ వైరస్ చైనా ప్రయోగశాల నుంచి పుట్టుకొచ్చిందంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేస్తున్న వాదనలకు సంబంధించిన ఆధారాలేవీ తాము చూడలేదని డబ్ల్యూహెచ్‌ఓ పునరుద్ఘాటించింది.
ఈ మహమ్మారి ఖచ్చితంగా ఎక్కడ మొదలైందో శాస్త్రవేత్తలు నిర్ధారించలేకపోతున్నారు. ఉన్న ఆధారాలు వుహాన్ లోని ఒక మార్కెట్ దిశగా చూపుతున్నాయి. కానీ.. తొలి 41 కరోనా కేసుల్లో కేవలం 27 కేసులకు మాత్రమే ఆ మార్కెట్‌తో నేరుగా సంబంధం ఉందని బీబీసీ జెనీవా ప్రతినిధి ఇమోజెన్ ఫోక్స్ పేర్కొన్నారు.
2012లో మిడిల్ ఈస్ట్రన్ రెస్పిరేటరీ సిండ్రోమ్ – మెర్స్ – వ్యాపించటం మొదలైనపుడు అది ఒంటెల నుంచి పుట్టుకొచ్చిందని కనుగొనటానికి ఒక సంవత్సరం పట్టింది.
బీబీసీ స్పోర్ట్స్‌లో ఫుట్‌బాల్ పోటీలు ప్రత్యక్ష ప్రసారం షురూ

ఫొటో సోర్స్, Power Sport Images
ఆటలు, పోటీలు లేకుండా రోజులు డల్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ అభిమానులకు శుక్రవారం కనువిందు దొరికింది. సీజన్ ప్రారంభ మ్యాచ్ బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కావటమే దీనికి కారణం.
ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన దక్షిణ కొరియా కె-లీగ్ ఫుట్‌బాల్ పోటీలు.. కరోనావైరస్ కారణంగా వాయిదాపడ్డాయి. ఆ పోటీలు శుక్రవారం మొదలయ్యాయి.
బ్రిటన్ ప్రేక్షకులు బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్, ఐప్లేయర్‌లో ఈ మ్యాచ్‌లు వీక్షించవచ్చు.
బ్రిటన్ బయట ఉన్న వారు లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడవచ్చు.
