కరోనావైరస్: ఇటలీలో 30,201, బ్రిటన్‌లో 31,315, అమెరికాలో 76,101 కోవిడ్ మృతులు...

బ్రిటన్ తరువాత కోవిడ్ మృతుల్లో 30 వేల మార్క్‌ను ఇటలీ దాటింది. అమెరికాలో కరోనావైరస్ సంక్రమణ వేగం తగ్గడం లేదు. ఈ దేశంలో ఇప్పటికే 12,63 లక్షల కేసులు నమోదయ్యాయి. 75 వేలకు పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 38.89 లక్షల కోవిడ్ కేసుల్లో ఇప్పటివరకు 2.70 లక్షల మరణాలు నమోదయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. వీఈ డే సందర్భంగా లండన్‌లో రెడ్ యారోస్ ఫ్లైపాస్ట్

    రెడ్ యారోస్

    ఫొటో సోర్స్, Getty Images

    యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 75వ వార్షికోత్సవం సందర్భంగా.. బ్రిటన్ వైమానిక దళం రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెడ్ యారోస్ విమానాలు సెంట్రల్ లండన్ మీదుగా దూసుకెళ్లాయి.

    రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ బేషరతుగా మిత్రరాజ్యాలకు లొంగిపోయిన మే 8వ తేదీని ప్రతి ఏటా ‘వీఈ డే’ (విక్టరీ ఇన్ యూరప్ డే)గా జరుపుకుంటారు.

    ఈ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా.. యుద్ధ కాలపు తరం వారి సేవలు, త్యాగాలకు గౌరవ సూచకంగా బ్రిటన్‌లో రెండు నిమిషాల పాటు మనం పాటిస్తారు.

    లండన్‌లో ఫ్లైపాస్ట్ దృశ్యాలు కొన్ని...

    రెడ్ యారోస్

    ఫొటో సోర్స్, PA Media

    రెడ్ యారోస్

    ఫొటో సోర్స్, Getty Images

  2. రోబో డాగ్‌ను పార్కులో మోహరించిన సింగపూర్

    రోబో డాగ్

    ఫొటో సోర్స్, GovTech

    ఇదేదో రోబో హారర్ సినిమాలో భాగం కాదు. ఇది నిజంగా రోబో డాగ్. సింగపూర్‌లోని ఒక పార్కులో సంచరిస్తోంది.

    స్పాట్ ఈ రోబోను బోస్టన్ డైనమిక్స్ అభివృద్ధి చేసింది. సురక్షిత దూరం పాటించేలా చేయటానికి ఈ రోబో సాయపడుతుందని సింగపూర్ ప్రభుత్వ సంస్థ గవ్‌టెక్ పేర్కొంది.

    కానీ దీనిని చూసిన జనం ఇప్పటికే భయపడిపోతున్నారు.

    ‘‘రోబోలు మన మీద పెత్తనం చేసే రోజు ఎంతో దూరం లేదు. ఇది మనుషుల వెంటపడుతున్న దృశ్యాన్ని ఊహించుకుంటే వెన్నులో వణుకుపుడుతోంది’’ అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

    అయితే ఈ స్పాట్ ఇప్పుడప్పుడే ఎవరి వెంటా పడబోదు. కాకపోతే.. జనం దూరదూరంగా ఉండాలంటూ రికార్డు చేసిన సందేశాన్ని వినిపిస్తూ పార్కులో తిరుగుతుంటుంది.

    పార్కులో సందర్శకుల సంఖ్యను అంచనా వేయటానికి వీలుగా ఈ రోబోకు కెమెరాలు అమర్చుతారు.

    బిషన్-ఆంగ్ మో కియో పార్కులో శుక్రవారం నుంచి స్పాట్‌ను ప్రయోగాత్మకంగా విధుల్లోకి పంపి పరీక్షిస్తున్నారు. అది సరిగ్గా పనిచేసేలా చూసుకోవటానికి ఆరంభంలో ఒక అధికారిని కూడా దీనితో పాటు ఉంచుతారు.

    ముందుముందు ఈ రోబో ఒంటరిగానే ఇతర పార్కుల్లో సంచరిస్తూ సందేశం వినిపించాలన్నది ప్రణాళిక. కాబట్టి సింగపూర్‌ పార్కుల్లో వాహ్యాళికి వెళ్లినపుడు రోబో డాగ్ కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు.

    వెట్ టాన్

    సింగపూర్

  3. మద్యం దుకాణాలు తెరవటం పట్ల మహిళల నిరసన.. మదురైలో పోలీసులతో ఘర్షణ

    తమిళనాడులోని మదురైలో.. మద్యం దుకాణాలను తెరవాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మహిళలు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు.

    సీపీఎం కార్యకర్తలతో కూడిన నిరసనకారులకు - పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. మద్యం అమ్మకాలపై ఆదేశాలు జారీ చేయలేం-సుప్రీంకోర్టు

    లాక్‌డౌన్ సమయంలో, మద్యం అమ్మకాలపై స్పష్టత ఇవ్వాలని, మద్యం అమ్మకాల సమయంలో సామాజిక దూరం పాటించేలా చూడాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు ఏఎన్ఐ చెప్పింది.

    తాము దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.

    సామాజికదూరం నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా పరోక్ష అమ్మకాలు/హోం డెలివరీని రాష్ట్ర ప్రభుత్వాలే పరిగణనలోకి తీసుకోవాలని సూచించిందని పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. కరోనా వల్ల అంతటా 'విద్వేష సునామీ' వ్యాపిస్తోంది-ఐరాస చీఫ్

    ఐరాస చీఫ్

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా వల్ల ప్రపంచమంతటా 'విద్వేష సునామీ' వ్యాపిస్తోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.

    కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సామాజిక పరిస్థితులపై ఆయన ఒక గట్టి సందేశం ఇచ్చారు.

    ఈ మహమ్మారి అన్ని చోట్లా విద్వేష సునామీ వ్యాపించేలా చేసింది అని ఆయన అన్నారు.

    ఏ దేశం పేరు ప్రస్తావించని ఆయన "ఈ విద్వేషాలకు అంతం పలికేందుకు అన్ని దేశాలు అన్ని రకాల ప్రయత్నాలూ చేయాలని' పిలుపునిచ్చారు.

    "ప్రపంచవ్యాప్తంగా వలసదారులు, శరణార్థులు దీనికి తీవ్రంగా ప్రభావితం అయ్యారు. వీరివల్లే వైరస్ వ్యాపించి ఉంటుందని భావిస్తున్న వారికి, చాలా ప్రాంతాల్లో చికిత్స కూడా అందించడం లేదు" అన్నారు.

    జర్నలిస్టులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు వారి పని చేసినందుకు లక్ష్యంగా మారుతున్నారు అన్నారు.

    మీడియా, ముఖ్యంగా ఆన్‌లైన్ మీడియా సంస్థలు "జాత్యహంకారంతో, ద్వేషపూరితంగా, హానికారకంగా ఉండే కథనాలను తొలగించాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

    అంతే కాదు, ప్రజలు నకిలీ వార్తలను గుర్తించడం నేర్చుకోగలిగేలా విద్యా సంస్థలు ప్రస్తుత సమయంలో డిజిటల్ అక్షరాస్యతపై దృష్టి పెట్టాలని ఆంటోనియో చెప్పారు.

  6. మాస్కులు లేకుండానే పనిచేస్తున్న రష్యా డాక్టర్లు

    రష్యా డాక్టర్లు

    రష్యాలో కరోనా కేసుల సంఖ్య పెరిగేకొద్దీ దేశంలోని పురాతన, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారుతున్నాయి.

    కరోనాకు గురి అవుతున్న, చనిపోతున్న డాక్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

    దేశంలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, మిగతా రక్షణ పరికరాల కొరత ఉంది అని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దేశంలో వాటి ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు.

    అయితే, రష్యాలోని డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది బహిరంగంగా తమ సమస్యల గురించి చెప్పుకోడానికి భయపడుతున్నారు.

    రష్యా డాక్టర్ల చాలా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. వాటిలో మాస్కులు, ఇతర అత్యవసర వైద్య పరికరాల కొరత గురించి వారు చెబుతున్నారు.

  7. కర్ణాటకలో కొత్తగా 45 కేసులు నమోదు

    కర్ణాటకలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ 45 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏఎన్ఐ చెప్పింది.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 750కి పెరిగింది. కర్ణాటకలో ఇప్పటివరకూ 30 మంది చనిపోగా, 371 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. ఏపీలో కొత్తగా 54 కేసులు, 41కి చేరిన మొత్తం మృతులు

    గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు చేరింది.

    ఇప్పటివరకూ 842 మంది డిశ్చార్జ్ కాగా, ఆస్పత్రుల్లో 1004 మంది చికిత్స పొందుతున్నారు.

    గత 24 గంటల్లో ముగ్గురు చనిపోవడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.

    కొత్తగా కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు చనిపోయారు.

    గత 24 గంటల్లో అనంతపురంలో అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి.

    విశాఖపట్టణంలో 11, పశ్చిమ గోదావరిలో 9, కర్నూలులో 7, కృష్ణాలో 6, చిత్తూరులో 3, గుంటూరు, విజయనగరంలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

    ఏపీ కరోనా

    ఫొటో సోర్స్, AP i&PR

  9. ఆరోగ్యసేతు యాప్‌‌‌ వాడకంపై కేరళలో పిటిషన్

    దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్ వాడకం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కేరళలో పిటిషన్ దాఖలైంది.

    కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేసిన ఒక పిటిషనర్ కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు అని ఏఎన్ఐ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. కరోనా లాక్‌డౌన్‌పై కేంద్రానికి రాహుల్ గాంధీ ప్రశ్నలు

    కరోనా లాక్‌డౌన్ ఎత్తివేత, కరోనా జోన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి కొన్ని ప్రశ్నలు వేశారు.

    “కేంద్రం తమ చర్యల్లో కాస్త పారదర్శకత చూపించాలి. దేశంలో కరోనా లాక్‌డౌన్ ఎత్తివేసేటపుడు, ఏ ప్రమాణాల ప్రకారం అలా చేస్తారో మేం తెలుసుకోవాలని అనుకుంటున్నాం” అన్నారు.

    “ఇది విమర్శలకు సమయం కాదు. లాక్‌డౌన్ ఎత్తేయడానికి మనకు ఒక వ్యూహం అవసరం. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు, ఆర్థిక సరఫరా చెయిన్ మధ్య సంఘర్షణ ఉందని మీకు ఏ ఆర్థికవేత్త అయినా చెబుతాడు. దానిని పరిష్కరించాలి”.

    “రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను జాతీయ స్థాయిలో గుర్తించారు. ఈ జోన్లను రాష్ట్ర స్థాయిలో, ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రమేయంతో ఏర్పాటు చేయాలి. జాతీయ స్థాయిలో రెడ్ జోన్లుగా ఉన్నవి నిజానికి గ్రీన్ జోన్లుగా, గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా ఉన్నాయని మా ముఖ్యమంత్రులు చెబుతున్నారు” అని రాహుల్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. కరోనాతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

    భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

    • మహారాష్ట్రలో మొత్తం 17,974 కేసులు నమోదయ్యాయి, మృతుల సంఖ్య 694
    • గుజరాత్‌లో 712 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 425
    • దిల్లీలో 5980 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 66
    • తమిళనాడులో 5409 తే,సు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 37కు చేరింది.
    • రాజస్థాన్‌లో 3427 కేసులు నమోదయ్యాయి. 97 మంది చనిపోయారు.

    గత 24 గంటల్లో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విధుల్లో ఉన్న 55 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాను, బీఎస్ఎఫ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు కోవిడ్-19 వైరస్ వల్ల చనిపోయారని అధికారులు చెప్పారు.

    41 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని బీఎస్ఎఫ్ చెప్పింది. వీరితో కలిపి కరోనాకు గురైన మొత్తం బీఎస్ఎఫ్ జవాన్ల సంఖ్య 193కు చేరింది.

  12. 'వర్క్ ఫ్రం హోం'ను ఏడాది చివరి వరకూ పొడిగించిన ఫేస్‌బుక్, గూగుల్

    గూగుల్, ఫేస్ బుక్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇంటి నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగులకు ఈ ఏడాది చివరి వరకూ దానిని కొనసాగించవచ్చని ఫేస్‌బుక్, గూగుల్ చెప్పాయి.

    త్వరలో కార్యాలయాలను తెరుస్తామని చెప్పిన, ఈ రెండు సంస్థలు, 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పాయి.

    గూగుల్ మొదట జూన్ 1 వరకూ వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తామని చెప్పింది. కానీ, ఇప్పుడు దానిని మరో ఏడు నెలలు పొడిగించింది.

    కరోనా లాక్‌డౌన్ క్రమంగా ఎత్తివేసిన తర్వాత జులై 6 నుంచి తమ కార్యాలయాలు తెరుస్తామని ఫేస్‌బుక్ చెప్పింది.

    "ఆఫీసుకు తిరిగి రావాల్సిన ఉద్యోగులు జులై నుంచి మెరుగైన భద్రతా చర్యలతో విధులకు వస్తారని, కానీ ఎక్కువ మంది ఉద్యోగులు ఏడాది చివరి వరకూ ఇళ్లనుంచే పనిచేస్తారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు.

    ఫేస్‌బుక్ కూడా ఎవరైనా ఇళ్ల నుంచి పనిచేయాలనుకుంటే, ఈ ఏడాది చివరి వరకూ దానిని కొనసాగించవచ్చని ప్రకటించినట్లు తెలిపింది.

  13. ఐఎన్ఎస్ జలాశ్వలో అధికారుల ఏర్పాట్లు

    మాల్దీవుల నుంచి స్వదేశానికి తీసుకొస్తున్న వారిని, ఐఎన్ఎస్ జలాశ్వలో ఎక్కించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని ఏఎన్ఐ తెలిపింది.

    సముద్రసేతు ఆపరేషన్‌లో భాగంగా వీరిని మాలి నుంచి భారత్ తీసుకురానున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. బంగ్లాదేశ్‌లో లాక్‌డౌన్ సడలింపు, తెరుచుకున్న మసీదులు

    బంగ్లాదేస్ కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    బంగ్లాదేశ్‌లోని మసీదుల్లో సామూహిక రంజాన్ ప్రార్థనలకు అనుమతిస్తున్నారు. దేశంలో 12 వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా, ఇప్పటివరకూ 200 మంది చనిపోయారు.

    కానీ నెల తర్వాత గురువారం నుంచి తెరుచుకున్న ఢాకాలోని చాలా మసీదుల్లో ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలు పాటించలేదని ట్రిబ్యూన్ పత్రిక గుర్తించింది.

    చాలా మసీదుల్లో లోపలికి వచ్చే ముందు చేతులు శుభ్రం చేసుకోడానికి హాండ్ శానిటైజింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయలేదని. చాలామంది మాస్కులు ధరించడం లేదని పత్రిక చెప్పింది.

    “మొదటి రోజు కావడంతో ఏర్పాట్లలో చాలా కొరత ఉంది. మేం వాటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం” అని నగరంలోని ఒక మసీదు నిర్వాహకుడు ఫజివుల్ హక్ చెప్పారు.

  15. దక్షిణకొరియాలో 'గే క్లబ్'‌కు వెళ్లిన వ్యక్తికి కరోనా

    సియోల్

    ఫొటో సోర్స్, Getty Images

    దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి కోవిడ్-19 పాజిటివ్ అని తేలినప్పుడు, మిగతా వారిని హెచ్చరించేందుకు అతడు ఇటీవల ఎక్కడెక్కడ తిరిగారో బయటపెడతారు. కాంటాక్ట్ ట్రేసింగ్ అనే ఈ విధానంలో రోగి పేరును బయటపెట్టరు.

    కానీ గత శుక్రవారం సియోల్‌లో ఐదు నైట్ క్లబ్‌లకు వెళ్లిన ఒక 29 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ రావడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. అతడు వెళ్లిన క్లబ్‌లలో గే బార్ కూడా ఉండడమే దీనికి కారణం.

    దక్షిణ కొరియాలో స్వలింగ సంపర్కుల పట్ల ఆదరణ ఉండదు. అందుకే అలాంటి వారికి కరోనా వచ్చినా, వారు పరీక్షలు చేయించుకోడానికి ముందుకు రాకపోవచ్చని, తాము ఉన్న ప్రాంతం గురించి బయటకు తెలీడం వారికి ఇష్టం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన స్వలింగ సంపర్కులు పరీక్షలు చేయించుకోడానికి బయటకు రాకపోవడం వల్ల దేశంలో ఈ కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

    తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడితో పనిచేసే మరొకరిలో కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో వైరస్ వ్యాపించకుండా వారు పనిచేసే సంస్థను మూసివేసినట్లు అధికారులు చెప్పారు.

  16. డబ్ల్యుహెచ్ఓ దర్యాప్తునకు చైనా మద్దతు

    కరోనావైరస్ ఎక్కడ పుట్టిందనే అంశంపై జరిగే దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సాయం అందిస్తామని చైనా చెప్పింది.

    కరోనా విషయంలో చైనా పారదర్శకంగా లేదని అమెరికా పదే పదే ఆరోపణలు చేస్తోంది. కరోనా బయటకు వ్యాపించకుండా ఆ దేశం అడ్డుకోలేకపోయిందని విమర్శిస్తోంది.

    అయితే, చైనా ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. కరోనావైరస్ చైనా బయటే పుట్టిందని ఆరోపిస్తోంది. అమెరికా ఒక అబద్ధాన్ని దాచేందుకు మరో అబద్ధం చెబుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.

  17. గత 24 గంటల్లో భారత్‌లో 103 మృతులు, 3,390 కొత్త కేసులు

    భారత ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,342కు పెరిగింది.

    మొత్తం మృతుల సంఖ్య 1886కు చేరింది.

    మొత్తం పాజిటివ్ కేసుల్లో 37,916 యాక్టివ్ కేసులు కాగా, 16,539 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 17,974 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 694 మంది మృతిచెందారు.

    గత 24 గంటల్లో దేశంలో 3390 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 103 మంది చనిపోయారు.

    భారత్ కరోనా

    ఫొటో సోర్స్, MoHFW

  18. మాల్దీవుల్లో ఆపరేషన్ 'సముద్ర సేతు'

    మాల్దీవుల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభమైంది.

    ఇందులో భాగంగా మాలీ రేవులో భారత్ వచ్చేవారికి అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నారని ఏఎన్ఐ చెప్పింది.

    వీరందరినీ ఇండియన్ నావీ యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వలో భారత్‌కు తీసుకొస్తారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. ట్రంప్ సాయానికి అంగీకరించిన పుతిన్

    రష్యా కరోనా

    ఫొటో సోర్స్, Alexi Rosenfeld/Getty Images

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా నుంచి వైద్య సహాయం అందుకునేందుకు అంగీకరించారని గురువారం అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

    రాయిటర్స్ వివరాల ప్రకారం కోవిడ్-19 వల్ల రష్యా అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కుంటోంది. గురువారం కొత్త కేసులు భారీగా నమోదవడంతో రష్యా ఫ్రాన్స్, జర్మనీలను దాటేసింది.

    రష్యాలో మొత్తం 1,77,160 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇక్కడ మరణాల సంఖ్య ఇప్పటివరకూ తక్కువగానే ఉంది. ఇప్పటివరకూ రష్యాలో 1625 మంది చనిపోయారు.

    దీంతో కరోనావైరస్‌కు అత్యంత ప్రభావితమైన దేశాల్లో రష్యా ఐదో స్థానంలోకి చేరింది. ట్రంప్,పుతిన్ గురువారం ఫోన్లో మాట్లాడుకున్నారు.

    కరోనా అంశంతోపాటు ఆయుధాల నియంత్రణ గురించి కూడా ఇరు దేశాధినేతలు చర్చించారని వైట్‌హౌస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 2.69 లక్షల మంది చనిపోయారు.

  20. వలస కార్మికుల పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు

    మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో 14 మంది వలస కార్మికులు చనిపోయారని ఏఎన్ఐ చెప్పింది.

    ఔరంగాబాద్, జాల్నా మధ్య వెళ్తున్న వలస కార్మికులపై నుంచి ఒక గూడ్సు రైలు దూసుకెళ్లిందని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ చెప్పింది.

    ఈ ప్రమాదం ఔరంగాబాద్ సమీపంలోని కర్మాడ్ దగ్గర జరిగింది.

    ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఔరంగాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    వేకువ జామున రైలు పట్టాలపై వెళ్తున్న వలస కార్మికులను చూసిన లోకో పైలెట్ దానిని ఆపడానికి ప్రయత్నించాడని, కానీ అది బద్నాపూర్, కర్మాడ్ స్టేషన్ల మధ్య పర్భని-మన్మాడ్ సెక్షన్లో వారిని ఢీకొట్టిందని రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది.

    రైల్వే శాఖ దీనిపై విచారణకు ఆదేశించిందని ఏఎన్ఐ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఔరంగాబాద్‌లో వలస కార్మికుల మృతికి ప్రధాని సంతాపం తెలిపారు.

    రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడానని, అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని చెప్పారని ఏఎన్ఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3