కరోనావైరస్: భారత్‌లో మొత్తం కేసులు 42,836.. మృతులు 1,389 మంది; ఏపీలో 1,650.. తెలంగాణలో 1,085 మంది బాధితులు

భారతదేశంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య 42,836కు, మృతుల సంఖ్య 1389కు పెరిగింది. ప్రస్తుతం 29,685 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ 11,761 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 67 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈరోజు 3 కొత్త కేసులు నమోదయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. ఏపీలో మద్యం ధరల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి-యనమల

    మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోడమేనని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

    "కరోనా సమయంలో ప్రజలపై పన్నులు వేసిన ప్రభుత్వం ప్రపంచంలో లేదు. ఇది పన్నులు వేసే సందర్భం కాదు, ధరలు పెంచే సందర్భం అంతకన్నా కాదు" అని అన్నారు.

    మద్యం ధరలు 25% పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్న యనమల, మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ధరల పెంచారని ఆరోపించారు.

    "దశలవారీ మద్య నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాలు పెద్దఎత్తున తెరిచింది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను దారుణంగా మోసం చేసింది" అని ఆయన విమర్శించారు.

    మద్యం ధరల పంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  2. ఏపీలో 67 కొత్త కేసులు నమోదు

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 67 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య1650కు పెరిగింది.

    ప్రస్తుతం రాష్ట్రంలో 1093 యాక్టివ్ కేసులు ఉండగా, 524 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    గత 24 గంటలుగా రాష్ట్రంలో కరోనా వల్ల ఎవరూ చనిపోలేదు. దీంతో మృతుల సంఖ్య 33గా ఉంది.

    ఈరోజు అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 25 కేసులు, గుంటూరులో 19, కృష్ణా జిల్లాలో 12, కడపలో 4, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

    కొత్త కేసులతో కలిపి కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 491కి చేరింది.

    ఏపీ కేసులు

    ఫొటో సోర్స్, ap i&pr

  3. ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు

    మాస్కులతో దేవుళ్లు

    ఫొటో సోర్స్, Image copyrightDASTKAR

    కరోనావైరస్ వ్యాప్తిని నివారించటం కోసం సామాజిక దూరం, పరిశుభ్రత ఆవశ్యతలను చాటిచెప్పటానికి భారతదేశపు ప్రముఖ చిత్రకారులు పలు వర్ణచిత్రాలు గీసి విడుదల చేశారని సుధా జి తిలక్ రాస్తున్నారు.

    నెల రోజులకు పైగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద చిత్రకళాకారుల బృందం ఒకటి ఈ రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలను సంప్రదాయ పద్ధతుల్లో రూపొందించింది.

    ‘‘ఈ కోవిడ్-19 హస్తకళాకారులకు చరమగీతం పాడుతుందని చాలా మంది భయపడుతున్నప్పటికీ.. వారి సృజనాత్మకత, పోరాట పటిమలు వారిని కాపాడుతున్నాయి’’ అని ‘దస్తకర్’ చైర్‌పర్సన్ లైలా త్యాబ్జీ బీబీసీతో పేర్కొన్నారు.

    దేశంలో హస్తకళలు, హస్తకళాకారులతో కూడిన ప్రముఖ సంఘం ‘దస్తకర్’.

    దస్తకర్‌తో పనిచేసే జానపద చిత్రకళాకారులు.. భౌతిక దూరం పాటించటం, ఫేస్ మాస్కులు ధరించటం, చేతులను సోపుతో శుభ్రంగా కడుక్కోవటం, గుంపులుగా ప్రయాణించకుండా ఉండటం ఎంత ముఖ్యమో చెప్తూ మార్చి నెల నుంచి కళాఖండాలను తయారుచేశారు.

  4. దిల్లీలో మద్యం కోసం కిలోమీటర్ క్యూ

    దిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్‌లో ఒక మద్యం దుకాణం దగ్గర జనం కిలోమీటరుకు పైగా క్యూ కట్టారని ఏఎన్ఐ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. రాహుల్‌కు సంబిత్ పత్రా సమాధానం

    వలస కార్మికులకు రైలు టికెట్ల గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా సమాధానం ఇచ్చారు.

    "రాహుల్ జీ హోంమంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ చూడండి. ఇందులో ఏ స్టేషన్‌లోనూ టికెట్ విక్రయాలు ఉండవని స్పష్టంగా చెప్పారు. టికెట్లపై 85 శాతం సబ్సిడీ ఇచ్చారు. టికెట్ ధరలో 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఆ డబ్బు ఇస్తోంది. అలా చేసేలా మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కూడా చెప్పండి" అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    రైలు టికెట్

    ఫొటో సోర్స్, SM viral

    మరో ట్వీట్‌లో రైలు టికెట్ ఫొటో పెట్టిన పాత్రా "కొంతమంది రైల్వే టికెట్ ఫొటో పోస్ట్ చేసి, టికెట్ల అమ్మకం లేకపోతే ఇదేంటి? అని అడుగుతున్నారు. ప్రతి శ్రామిక్ ఎక్స్ ప్రెస్‌కు సంబంధించిన దాదాపు 1200 టికెట్లను రైల్వే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ డబ్బులు చెల్లించాలి. అవసరమైన కార్మికులకు టికెట్ అందించాలి" అన్నారు.

  6. లాక్‌డౌన్ నుంచి బయటపడుతున్న ఇటలీ

    కరోనా వ్యాపించడంతో ఇటలీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన మొదటి దేశంగా నిలిచింది.

    ఇప్పుడు రెండు నెలలకు పైగా దానిని కొనసాగించిన తర్వాత, ఇప్పుడు ఆ దేశం లాక్‌డౌన్ సడలించే దిశగా అడుగులు వేస్తోంది.

    కొన్ని పనులకు ప్రజలను అనుమతిస్తోంది.

    తమ ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇవ్వడంతోపాటు, బంధువులను కలవడానికి, తెరిచిన పార్కులకు వెళ్లడానికి, రెస్టారెంట్ల నుంచి పార్శిళ్లు తీసుకోడానికి ప్రభుత్వం అనుమతించింది.

    ఈ సడలింపుల వల్ల దాదాపు 40 లక్షల మంది తిరిగి తమ విధుల్లోకి వెళ్తారని అంచనా వేస్తున్నారు.

    ఇటలీలో మొత్తం 2,10,717 కరోనా కేసులు నమోదయ్యాయి. 28,884 మంది చనిపోయారు. ఇది ఒకప్పుడు యూరప్‌లోనే అత్యంత ప్రభావితమైన దేశంగా నిలిచింది.

    ఇటలీ

    ఫొటో సోర్స్, Getty Images

  7. లాక్‌డౌన్ సడలింపు, మద్యం షాపుల దగ్గర క్యూ

    వైన్ షాపుల ముందు క్యూ

    లాక్‌డౌన్ సడలించడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో మద్యం షాపులు తెరిచారు.

    దీంతో వైన్ షాపుల ముందు జనం క్యూ కడుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో మద్యం షాపులు తెరుచుకోవడంతో జనం సామాజిక దూరం పాటించకుండా క్యూ కట్టారు.

    వైన్ షాపులు

    విశాఖ నగరంలో తెరిచిన ఒక మద్యం షాపు దగ్గర జనం దాదాపు అర కిలోమీటర్ పొడవున క్యూలో నిలుచున్నారు.

    జనం భారీగా రావడంతో ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా మనుషులను పెట్టించి, సామాజిక దూరం పాటించాలని జాగ్రత్తలు చెబుతోంది.

    వైన్ షాపులు
  8. వలస కార్మికుల కోసం రైల్వే 'శ్రామిక్' స్పెషల్ రైళ్లు

    వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు భారత రైల్వే 34 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపనుందని ఏఎన్ఐ చెప్పింది.

    పేదలకు సురక్షితమైన ప్రయాణం అందించే తమ బాధ్యతను నెరవేర్చామని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయని తెలిపింది.

    ఈ రైళ్లు నడపడానికి అయ్యే మొత్తం ఖర్చులో 15 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ చెప్పింది.

    కార్మికులకు టికెట్లు ఏవీ విక్రయించడం లేదని, రాష్ట్రాలు ఇచ్చిన జాబితా ప్రకారం ప్రయాణికులను రైళ్లలోకి అనుమతిస్తామని చెప్పింది.

    శ్రామిక్ స్పెషల్ రైళ్లలో సామాజిక దూరం పాటించేలా ప్రతి కోచ్‌లో బెర్తులను ఖాళీగా వదిలేస్తామని, గమ్య స్థానాల నుంచి రైళ్లు తిరిగి ఖాళీగా వస్తాయని చెప్పింది. రైళ్లలో కార్మికులకు ఉచితంగా ఆహారం, నీళ్లు అందిస్తామని రైల్వే శాఖ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ఆన్‌లైన్‌లో టెన్నిస్ ఆడిన టాప్ క్రీడాకారులు

    ఆన్ లైన్ టెన్నిస్

    ఫొటో సోర్స్, facebook.com/IMGTennis

    కరోనా వల్ల చాలా క్రీడలకు ప్రస్తుతం పరిమితులు ఉండడంతో కొంతమంది ప్రపంచ టాప్ క్రీడాకారులు తమ నైపుణ్యాలను విర్చువల్‌లో మెరుగులు దిద్దుకుంటున్నారు.

    ప్రపంచ టాప్ టెన్నిస్ ఆటగాళ్లలో కొందరు పరస్పరం, ‘నిన్‌టెండో ఏసెస్’ గేమ్‌లో డబుల్స్ ఆడారు.

    ఇళ్లలోనే ఉంటున్న టాప్ ఆటగాళ్లు ఆన్‌లైన్లో టెన్నిస్ ఆడుతుంటే, బ్రిటిష్ ఆటగాడు జాన్ మెకన్రో వాటికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

    ఆన్‌లైన్లో టెన్నిస్ ఆడిన ఆటగాళ్లలో విలియమ్స్ సోదరీమణులు, జపాన్ ఆటగాళ్లు నయోమీ ఒసాకా, కీ నిషికోరి, ఇటీవల టెన్నిస్ నుంచి రిటైరైన రష్యా బ్యూటీ మరియా షరపోవా ఉన్నారు.

    ఈ టోర్నీలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ అతడి డబుల్స్ భాగస్వామి గెలిచారు.

    ఈ టోర్నీని టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఐఎంజీ, ఫేస్‌బుక్ గేమింగ్ నిర్వహించింది. ఈ టోర్నీ ద్వారా గెలిచిన మొత్తాన్ని కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటం కోసం విరాళంగా అందించారు.

  10. రాజస్థాన్‌లో ఈరోజు కొత్తగా 123 కరోనా కేసులు నమోదయ్యాయని ఏఎన్ఐ చెప్పింది.

    ఈరోజు కొత్తగా నలుగురు మృతిచెందినట్లు రాజస్థాన్ ఆరోగ్య శాఖ తెలిపిందని పేర్కొంది .

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3009కి చేరింది. ఇప్పటివరకూ 75 మంది చనిపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో సందడి

    ఆస్ట్రేలియా తీరాలు

    ఫొటో సోర్స్, EPA

    ఆస్ట్రేలియాలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలించారు.

    సిడ్నీలో బంధువులను, సన్నిహితులను కలిసేందుకు అనుమతించారు. క్వీన్స్ లాండ్, ఉత్తర సరిహద్దుల్లోని తీరాలు, పార్కులు తెరిచారు.

    దేశంలో కరోనాకు అత్యంత ప్రభావితమైన రెండో రాష్ట్రం విక్టోరియాలోని ఒక మాంసం పరిశ్రమలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా ఇవి అత్యధికం

    ఆస్ట్రేలియా ప్రజలు ట్రేసింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

    న్యూజీలాండ్ ప్రధాన జడిండా ఆర్డర్న్, రేపు ఆస్ట్రేలియా అధికారులతో సమావేశం కానున్నారు. రెండు దేశాలు త్వరలో తమ సరిహద్దులను తెరవనున్నాయి.

  12. మూవీ సూపర్ స్టార్ల కోవిడ్-19 కాన్సెర్ట్

    షారూఖ్

    ఫొటో సోర్స్, I For India/Facebook

    భారత్‌లో కోవిడ్-19తో పోరాటం కోసం విరాళాలు సేకరించేందుకు దేశంలోని 70 మందికి పైగా అగ్ర సినీతారలు ఒక కాన్సెర్ట్ చేశారు.

    ఆదివారం ఈ తారలు తమ ఇళ్ల నుంచే నాలుగు గంటలపాటు ప్రదర్శనలు ఇచ్చారు.

    ఈ తారల్లో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఒక పాట పాడారు. పాట పాడేముందు పాటలకు పనికిరాని తన గొంతుపై జోక్స్ వినిపించారు. నేను కచ్చితంగా సాయ చేయగలను అని అభిమానులకు చెప్పారు.

    ఐ ఫర్ ఇండియా కాన్సెర్ట్ ను 50 లక్షల మందికి పైగా వీక్షించారు. దానిని ఆదివారం ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇందులో పాల్గొన్న మిగతా తారల్లో అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా ఉన్నారు. దీని ద్వారా వచ్చిన నిధులను గివ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు అందిస్తారు.

    ఈ కార్యక్రమంలో నిక్ జోనస్ గిటార్ వాయిస్తూ పాటపాడి అందరినీ అలరించారు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఈ కార్యక్రమం చివర్లో మెరిశారు. విరాళాలు అందించాలని, మీ వంతు సాయం అందించాలని తన అభిమానులన కోరారు.

  13. జీసస్ విగ్రహానికి మాస్క్

    రియో డిజినీరో

    ఫొటో సోర్స్, Getty Images

    బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'క్రైస్ట్ ది రిడీమర్' విగ్రహానికి కొత్త లుక్ తెచ్చారు.

    జీసస్ ఫేస్ మాస్క్ వేసుకున్నట్లు లైట్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు, విగ్రహంపై 'మాస్కులు ప్రాణాలు కాపాడతాయి' అనే సందేశం కూడా కనిపించేలా చేశారు.

    ప్రపంచవ్యాప్తంగా కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా వారం క్రితం కూడా ఇదే విగ్రహంపై ఒక లైట్ షో ఏర్పాటు చేశారు.

  14. రైల్వేకు రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

    వలస కార్మికుల నుంచి రైల్వే చార్జీలు వసూలు చేయడంపై కాంగ్రెస్ నేత ట్విటర్‌లో సూటి ప్రశ్నలు వేశారు.

    “ఒక వైపు రైల్వే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల నుంచి టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది. మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ పీఎం కేర్ ఫండ్ కోసం 151 కోట్ల రూపాయల విరాళం ఇస్తోంది” కాస్త దీనిని కూడా పరిష్కరించండి అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. కాకినాడ, రాజమండ్రిలో లాక్‌డౌన్ సడలింపు

    కాకినాడ

    ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలు సడలించారు.

    తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రిలో లాక్‌డౌన్ సడలించడంతో జనం రోడ్లపైకి వచ్చారు.

    కాకినాడ

    మాల్స్, రెస్టారెంట్ల మినహా చిన్న చిన్న షాపులు తెరుచుకుంటున్నాయి.

    నిత్యావసరాలు, ఇతర సరుకుల కోసం వస్తున్న వారితో రోడ్లపై వాహనాలు కూడా కనిపిస్తున్నాయి.

    కాకినాడ
  16. భారత్‌లో గత 24 గంటల్లో 2553 కేసులు నమోదు, 72 మంది మృతి

    భారత్‌లో గత 24 గంటల్లో 2553 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.72 మంది చనిపోయారు.

    కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య 42,533కు చేరింది, మొత్తం మృతుల సంఖ్య 1373కు పెరిగింది.

    దేశంలో మొత్తం 29,453 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ 11,707 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. అత్యధిక కరోనా కేసులు ఉన్న జిల్లాలు, నగరాలకు కేంద్ర బృందాలు

    దేశంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న జిల్లాలు, నగరాల్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తమ బృందాలను మోహరించనుంది.

    ఈ శాఖకు చెందిన 20కి పైగా కేంద్ర ప్రజారోగ్య బృందాలు దేశంలో అత్యధిక కేసులు నమోదైన 20 జిల్లాలు, నగరాలకు చేరుకుంటాయి.

    కేంద్ర బృందాలు వెళ్లే జిల్లాలు, నగరాల్లో ఆగ్నేయ, మధ్య దిల్లీ, మహారాష్ట్రలోని ముంబై, థానే, పుణె.. గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్‌, వడోదర, తమిళనాడులో చెన్నై ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు,గుంటూరు, కృష్ణా జిల్లాలకు కేంద్ర బృందాలు వెళ్తాయి.

    ఆయా జిల్లాలు, నగరాల్లో కోవిడ్-19 కంటైన్మెంట్ జాగ్రత్తలు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందాలు సహకరించనున్నాయి.

  18. కర్ణాటకలో మద్యం షాపుల ముందు క్యూలు

    కర్ణాటకలో మద్యం షాపులను ఉదయం 9 నుంచి 7 గంటల వరకూ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచడంతో హుబ్లీలో జనం ఉదయం నుంచే షాపుల ముందు క్యూ కట్టినట్లు ఏఎన్ఐ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు భరిస్తాం: కాంగ్రెస్

    సోనియా

    ఫొటో సోర్స్, Getty Images

    సొంత రాష్ట్రాలకు చేరుకోవాలనే ప్రతి వలస కార్మికుడి రైలు ప్రయాణాలకు అయ్యే ఖర్చును ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు భరించాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుందని ఏఎన్ఐ తెలిపింది.

    దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు సూచించారని చెప్పింది..

    కష్ట సమయంలో భుజం భుజం కలిపి దేశ ప్రజలకు అండగా నిలుస్తామని సంఘీభావం ప్రకటించడానికి ఇది కాంగ్రెస్ వినయపూర్వక సహకారం అని సోనియాగాంధీ చెప్పారు.

    దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో...

    మన కార్మికులు, కూలీలు ఆర్థికవ్యవస్థకు వెన్నెముక లాంటి వారు. దేశ పునాదుల కోసం వారు శ్రమిస్తున్నారు.

    కేంద్రం లాక్‌డౌన్ అమలుచేసిన తర్వాత, వలస కార్మికులకు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చేందుకు నిరాకరించింది.

    1947లో దేశ విభజన తర్వాత వేలాది వలస కార్మికులు, కూలీలు తిండి, నీళ్లు, మందులు, రవాణా సౌకర్యాలు లేకుండా వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన విషాధాన్ని ఇప్పుడే చూస్తున్నాం.

    లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు తిరిగి తమ సొంత రాష్ట్రాలకు చేరుకోడానికి ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని కాంగ్రెస్ కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖ మా డిమాండును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

    అందుకే ప్రతి వలస కార్మికుడి ప్రయాణ ఖర్చులను ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు భరించాలనే నిర్ణయం తీసుకున్నాం. దానికి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. అని సోనియా ప్రకటనలో చెప్పారు.

    వలస కార్మికుల దగ్గర చార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్రంగా విమర్శించారు.

    "గుజరాత్‌లో ఒక కార్యక్రమం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినపుడు, రైల్వే మంత్రిత్వ శాఖ 151 కోట్లు పీఎం కేర్ ఫండ్‌కు ఇచ్చినపుడు ఈ కూలీలను ఉచితంగా వారి సొంత రాష్ట్రాలకు ఎందుకు చేర్చరు" అని ప్రశ్నించారు.

    విదేశాల్లో ఉన్నవారిని ఉచితంగా దేశానికి తీసుకొస్తున్నప్పుడు, వలస కార్మికుల దగ్గర మాత్రం రైలు చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు అన్నారు.

  20. చైనాలో మూడు కొత్త కేసులు

    చైనా కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    మే 3న దేశంలో మొత్తం మూడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయటపడినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం చెప్పింది.

    ఒక రోజు క్రితం అంటే మే 2న కరోనా కొత్త కేసులు 2 నమోదయ్యాయి.

    కొత్త కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవే అని కమిషన్ చెప్పింది.

    మే 3న ఎలాంటి లక్షణాలూ లేని 13 కేసులు నమోదయ్యాయని, అంతకు ముందు అలాంటి 12 కేసులు వచ్చాయని కమిషన్ చెప్పింది.

    ఈ కొత్త కేసులతో కలిపి చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,880కి చేరింది. ఇక్కడ కోవిడ్-19 వల్ల మొత్తం 4633 మంది చనిపోయారు.