కరోనావైరస్: భారత్‌లో మొత్తం కేసులు 42,836.. మృతులు 1,389 మంది; ఏపీలో 1,650.. తెలంగాణలో 1,085 మంది బాధితులు

భారతదేశంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య 42,836కు, మృతుల సంఖ్య 1389కు పెరిగింది. ప్రస్తుతం 29,685 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ 11,761 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 67 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈరోజు 3 కొత్త కేసులు నమోదయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. దేశంలో 1,389.. తెలంగాణలో 29.. ఏపీలో 33 మంది మృతి

    • ప్రపంచవ్యాప్తంగా 35,34,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 2,48,164 మంది మృతి చెందారు.
    • అమెరికాలో 11,61,804 పాజిటివ్ కేసులు నమోదు కాగా 67,795 మంది మరణించారు.
    • స్పెయిన్‌లో 2,17,466 పాజిటివ్ కేసులుండగా 25,264 మంది ప్రాణాలు కోల్పోయారు.
    • ఇటలీలో 2,10,717 పాజిటివ్ కేసులు నమోదు కాగా 28,884 మంది చనిపోయారు.
    • బ్రిటన్‌లో 1,87,842 మంది కరోనాబారిన పడగా 28,520 మంది మరణించారు.
    • ఫ్రాన్స్‌లో 1,68,925 మందికి కరోనావైరస్ సోకగా 24,900 మంది ప్రాణాలు కోల్పోయారు.
    • భారత్‌లో 42,836 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,389 మంది మరణించారు.
    • తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1085కి పెరగ్గా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 1,650 కాగా, ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు.

    అంతర్జాతీయ సమాచారానికి జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ వెబ్‌సైట్ ఆధారం.

    కరోనావైరస్ అప్‌డేట్
  2. ‘భౌతిక దూరం పాటిస్తూనే మద్యం విక్రయాలు జరిగాయి. కొన్ని చోట్లలోనే ఆ పరిస్థితి’, - ఏపీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి

    ఆంధ్రప్రదేశ్‌లో భౌతిక దూరం పాటిస్తూనే మద్యం విక్రయాలు జరిగాయని, జనాల రద్దీని చూపిస్తూ మీడియాలో ప్రసారమైన దృశ్యాలు కొన్ని చోట్లకు సంబంధించినవేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.

    సోమవారం మద్యం అమ్మకాలు సాగిన పరిస్థితి, ప్రతిపక్షం చేస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

    గ్రీన్‌జోన్లలో మాత్రమే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయన్న విషయాన్ని మీడియా గుర్తించాలని నారాయణ స్వామి అన్నారు.

    ‘‘నిత్యావసరాలకు, ప్రతినెలా ఇస్తున్న రేషన్‌కు కూడా భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని ప్రభుత్వం పదేపదే చెప్తోంది: అలాగే మద్య విక్రయాల సమయంలో కూడా భౌతిక దూరం పాటించాలని చెప్పాం, ఆ మేరకు చర్యలు తీసుకున్నాం: నిబంధనలు పట్టించుకోకపోవడంతో కొన్ని దుకాణాలను ఈ ఉదయం మూసివేశాం కూడా: ఎక్కడైనా భౌతిక దూరం పాటించకపోతే వాటిని మూసివేయమని కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు స్పష్టంగా చెప్పాం. వారు చర్యలు కూడా తీసుకుంటున్నారు’’ అని ఆయన వివరించారు.

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్యం ధరల పెంపుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని నారాయాణ స్వామి అన్నారు.

  3. ఏయే జోన్లలో ఏమేం చేయవచ్చంటే...

    లాక్‌డౌన్

    ఫొటో సోర్స్, Getty Images

    లాక్‌డౌన్ మరోసారి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో కూడిన సడలింపులను ఇచ్చింది.

    ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి, ఆ జోన్లలో ఎలాంటి చర్యలు చేపట్టాలో, ఏయే దుకాణాలు, కార్యకలాపాలకు అనుమతి ఉంటుందో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.

    ఇంతకూ మీరున్నది ఏ జోన్? అక్కడ ఏమేం చేయొచ్చు?

  4. తెలంగాణలో కొత్తగా 3 కేసులు, 40 మంది డిశ్చార్జ్

    తెలంగాణలో సోమవారం కొత్తగా మూడు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 40 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

    ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొత్త కేసులు మూడూ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.

    ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,085 మందికి కరోనావైరస్ సోకింది. వారిలో 585 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 29 మంది మరణించారు.

    471 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

    వరంగల్ (గ్రామీణం), యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరీంనగర్, సిరిసిల్ల, నల్గొండ సహా మరో 17 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు రాలేదు.

    ఇది సోమవారం రాత్రి 8 గంటల వరకూ ఉన్న సమాచారమని ప్రభుత్వం తెలిపింది.

  5. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కితీసుకురానున్న ప్రభుత్వం

    విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ మే 7న మొదలవుతుందని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇది దశలవారీగా సాగుతుందని తెలిపారు.

    ఈ సేవను ఉపయోగించుకునేవారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. విమానాలు, నౌకల ద్వారా వారిని తరలించనున్నట్లు పేర్కొంది.

    ఇలా తీసుకురావాల్సిన వ్యక్తుల జాబితాలను భారత హైకమిషన్లు, దౌత్య కార్యాలయాలు రూపొందిస్తున్నాయని వివరించింది.

    ముందుగానే పరీక్షలు నిర్వహించి కరోనావైరస్ లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తామని, భారత్‌కు వచ్చిన తర్వాత వారంతా 14 రోజుల పాటు వారు క్వారంటీన్‌లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది.

    క్వారంటీన్ ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహించి, కరోనావైరస్ లేదని నిర్ధారణైతే వారిని ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తామని వివరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ‘హిమాచల్‌లో ఒకే ఒక్క యాక్టివ్ కేసు’

    షిమ్లా

    ఫొటో సోర్స్, Ashwini Sharma

    హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకూ కరోనావైరస్ సోకిన 40 మందిలో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా కోలుకున్నారని ఆ రాష్ట్రంలో ఉన్న అశ్వినీ శర్మ అనే జర్నలిస్ట్ బీబీసీతో చెప్పారు.

    కేసులు తగ్గినా, హిమాచల్‌లో లాక్‌డౌన్ కొనసాగుతోంది.

    రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఏడు జిల్లాలు గ్రీన్ జోన్లుగా మారాయి.

    త్వరలోనే హిమాచల్ కరోనావైరస్ విముక్త రాష్ట్రంగా మారవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి జయ రామ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    కానీ, ఇతర రాష్ట్రాల నుంచి హిమాచల్‌కు తిరిగివస్తున్నవారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనగా ఉంది.

    బయటి ప్రాంతాల్లో చిక్కుకుపోయి, గత కొన్ని రోజుల్లో హిమాచల్‌కు తిరిగివచ్చినవాళ్లు 75 వేలకుపైనే ఉన్నారని అశ్వినీ శర్మ అన్నారు. ఇలా వచ్చేందుకు సుమారు 1.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పాస్‌లు ఇచ్చిందని చెప్పారు.

  7. అమెరికా సుప్రీం కోర్టులో ఫోన్‌లో వాదనలు

    అమెరికా సుప్రీం కోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు ఫోన్‌లో వాదనలు వినాలని అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.

    రాబోయే రెండు వారాలు ఇలా ఫోన్ ద్వారానే ఈ కోర్టు విచారణలు జరగనున్నాయి.

    తమ ఇళ్ల నుంచే న్యాయవాదులు వాదనలు వినిపించవచ్చు. ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం స్థానికంగా ఉండే ఓ కార్యాలయం నుంచి వాదిస్తారు.

    ఇలా ఫోన్‌లో వాదనలు వినాలని అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి.

    వాదనల ఆడియోను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు.

    అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆర్థిక రికార్డుల అంశంతోపాటు కొన్ని ప్రధాన అంశాలపై సుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.

  8. నిబంధనలకు నీళ్లు వదిలిన మందుబాబులు

    లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు అనంతరం ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు వాటి ఎదుట బారులు తీరారు.

    భౌతిక దూరం నిబంధనను చాలా చోట్ల గాలికి వదిలేశారు..

  9. తమిళనాడులో ఒకే రోజు 527 కేసులు

    తమిళనాడులో కొత్తగా ఒకే రోజ 527 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

    మొత్తంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ 3,550 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,409 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. పశ్చిమ గోదావరిలో వలస కార్మికుల ఆందోళన

    పశ్చిమ గోదావరిలోని కొవ్వూరులో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆందోళనకు దిగారు.

    వీరంతా బీహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు. పోలీసులతో వీరు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

    ఆందోళనకారులను నియంత్రించేందుకు లాఠీచార్జి చేశామని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

    తణుకు సీఐ చైతన్య కృష్ణ సహా పలువురు పోలీసులు, కార్మికులు ఈ ఘర్షణలో గాయపడ్డారు.

  11. ‘కేరళలో కొత్త కేసుల్లేవ్’ : విజయన్

    కేరళలో సోమవారం కొత్తగా కరోనావైరస్ పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ చెప్పారు.

    తమ రాష్ట్రంలో ఇప్పటివరకూ 499 కేసులు నమోదయ్యాయని, వాటిలో 34 ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నాయని ఆయన వివరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష తేదీ తేలేది 20న...

    ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష నిర్వహించే తేదీని యూపీఎస్‌సీ ఈ నెల 20న ప్రకటించనుంది.

    మే 31న ఈ పరీక్ష జరపాలని ఇదివరకు నిర్ణయించారు. కానీ, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దాన్ని వాయిదా వేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. రష్యాలో వరుసగా రెండో రోజూ పది వేల కేసులు

    రష్యా

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యాలో వరుసగా రెండో రోజూ పది వేలకుపైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    దేశంలో కొత్తగా ఒకే రోజు 10,581 కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 1,45,268కి పెరిగిందని రష్యా అధికారులు ప్రకటించారు.

    ఈ లెక్క ప్రకారం కేసుల సంఖ్యలో చైనా, టర్కీ, ఇరాన్‌‌లను రష్యా దాటేసింది.

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్యలాయాలు, పరిశ్రమలను మే 11 వరకూ మూసే ఉంచాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు ఇచ్చారు. రాజధాని మాస్కో‌లో లాక్‌డౌన్ అమలవుతోంది.

    రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్‌కు కూడా కరోనావైరస్ సోకినట్లు గత వారం వెల్లడైంది.

  14. గుజరాత్‌లో వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ

    గుజరాత్‌లోని సూరత్‌లో వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపించాలంటూ నిరసనకు దిగారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ రేగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?

    నిరుద్యోగం

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి భారత్‌లో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఫలితంగా నిత్యావసర సేవలు మినహా ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి.

    అసంఘటిత రంగాలకు చెందిన లక్షలాది మంది వలస శ్రామికులు.. స్వస్థలాలకు కాలినడకన పయనమైన సామూహిక వలస దృశ్యాలను మనం చూశాం.

    వ్యవసాయం, బ్యాంకింగ్, ప్రజా పనుల మీద ప్రభుత్వం ఆంక్షలను సడలించినప్పటికీ.. రవాణా సేవలు, వ్యాపారాలు అత్యధికంగా మూతబడే ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో దేశంలో తదుపరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?

  16. యూరప్‌లో సడలుతున్న ఆంక్షలు

    యూరప్ వ్యాప్తంగా వివిధ దేశాలు నెమ్మదిగా లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి.

    • ‌ఎనిమిది వారాల లాక్‌డౌన్ తర్వాత ఇటలీ కొన్ని మినహాయింపులను ఇచ్చింది. తమ బంధువులు, సన్నిహితులను కలిసేందుకు ప్రజలను అనుమతిస్తోంది. పార్కులు తెరుచుకుంటున్నాయి. బార్లు, రెస్టారెంట్లు పార్సిల్ సేవలను మాత్రమే అందిస్తాయి. దాదాపు 40 లక్షల మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్లొచ్చు. అయితే, ఆఫీసుల్లో, ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్క్లులు ధరించడం తప్పనిసరి.
    • స్పెయిన్‌లో చిన్న చిన్న వ్యాపారాలు కొన్ని షరతుల మధ్య తెరుచుకుంటున్నాయి. కరోనావైరస్ ప్రభావం పెద్దగా లేని కొన్ని ద్వీపాల్లో ఎక్కువ సడలింపులు ఇవ్వనున్నారు.
    • జర్మనీలో జూలు, మ్యూజియంలు, హెయిర్‌డ్రెస్సింగ్ పార్లర్లు, కొన్ని పాఠశాలలు కూడా తెరుచుకుంటున్నాయి. చిన్న తరగతులకు మొదట క్లాసులు ప్రారంభమవుతున్నాయి.
    • ఆస్ట్రియాలోనూ పాఠశాలలు తెరుచుకుంటున్నాయి.
    • హంగేరీలో కొన్ని తరగతులకు పరీక్షలు మొదలవుతున్నాయి.
    • పోలెండ్‌లో హోటళ్లు, లైబ్రెరీలు, మ్యూజియంలు, షాపులు తెరుచుకుంటున్నాయి. హెయిర్ డ్రెస్సింగ్ పార్లర్లు, రెస్టారెంట్లు, మైదానాలను మూసే ఉంచుతున్నారు.
    ఇటలీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఇటలీ

    ఫొటో సోర్స్, Getty Images

  17. చిత్తూరు జిల్లాలో ముగ్గురు డిశ్చార్జ్

    శ్రీకాళహస్తి

    ఫొటో సోర్స్, ap I&pr

    ఈరోజు తిరుపతి పాత మెటర్నిటీ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా రోగుల డిశ్చార్జ్ అయ్యారు.

    వీరిలో ఇద్దరు శ్రీకాళహస్తికి, ఒకరు బి.ఎన్.కండ్రిగకు చెందినవారు.

    అనంతపురంలో 4 యక్టివ్ కేసులు

    అనంతపురం జిల్లాలోని హందూపురంలో బయటపడ్డ పాజిటివ్ కేసుల్లో గురజాత్ వారివే ఎక్కువ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.

    ఇక్కడ మొత్తం 45 కేసులు నమోదవగా, వారిలో 24 మంది గుజరాత్ వారే ఉన్నారని తెలిపారు.

    హిందూపురంలో నమోదైన కరోనా కేసుల్లో ఇప్పటివరకూ 12 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఐదుగురు చనిపోయారు.

    హిందూపురంలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారికి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు.

  18. అమెరికాలో మృతుల సంఖ్య లక్షకు చేరవచ్చు:ట్రంప్ హెచ్చరిక

    ట్రంప్

    ఫొటో సోర్స్, EPA

    అమెరికాలో కరోనా వల్ల లక్ష మంది వరకూ చనిపోవచ్చని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

    టౌన్‌హాల్ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ తమ ప్రభుత్వం చాలా నెమ్మదిగా స్పందిస్తోందనే ఆరోపణలను ఖండించారు.

    అమెరికాలో కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ 67 వేల మందికి పైగా మృతి చెందారు.

    కాన ట్రంప్ మాత్రం తాము టీకా తయారు చేయగలమనే ఆశిస్తున్నారు. దేశంలోని వైద్య నిపుణులు దానికి 12 నుంచి 18 నెలలు పడుతుందని చెబుతుంటే, ఆయన మాత్రం ఈ ఏడాది చివరికల్లా టీకా తయార చేస్తామని చెబుతున్నారు.

  19. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షలు దాటిన కరోనా కేసులు

    ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్నాయి. కొన్ని దేశాలు కొన్ని సడలించడం ప్రారంభించాయి.

    2020 మే 4న ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 35,05,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలామంది కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటికీ 24 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలు

    • అమెరికా (11,57,945 కేసులు, 67,680 మృతులు)
    • స్పెయిన్ (2,17,466 మొత్తం కేసులు, 25,264 మృతులు)
    • ఇటలీ (2,10,717 మొత్తం కేసులు, 28,884 మృతులు)
    • బ్రిటన్ (1,87,842 మొత్తం కేసులు, 28,520 మంది మృతి)
    • ఫ్రాన్స్ (1,68,925 మొత్తం కేసులు, 24,900 మృతి)
    • జర్మనీ (1,65,664 మొత్తం మృతులు 6,866 మృతి)

    ఈ గణాంకాలు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి తీసుకున్నవి