కరోనావైరస్: భారత్‌లో 40,000 దాటిన కోవిడ్ కేసులు... ప్రపంచవ్యాప్తంగా 34.62 లక్షల బాధితులు, 2.44 లక్షల మృతులు

గత 24 గంటల్లో భారతదేశంలో 2,487 కరోనావైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 40,263కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 10,887 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. దేశంలో 1,306.. తెలంగాణలో 29.. ఏపీలో 33 మంది మృతి

    కరోనా మ్యాప్

    ఫొటో సోర్స్, JHu

    ప్రపంచవ్యాప్తంగా 34,52,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 2,44,320 మంది మృతి చెందారు.

    * అమెరికాలో 11,32,673 పాజిటివ్ కేసులు నమోదు కాగా 67,067 మంది మరణించారు.

    * స్పెయిన్‌లో 2,16,582 పాజిటివ్ కేసులుండగా 25,100 మంది ప్రాణాలు కోల్పోయారు.

    * ఇటలీలో 2,09,328 పాజిటివ్ కేసులు నమోదు కాగా 28,710 మంది చనిపోయారు.

    * యూకేలో 1,83,501 మంది కరోనాబారిన పడగా 28,131 మంది మరణించారు.

    * ఫ్రాన్స్‌లో 1,65,086 మందికి కరోనావైరస్ సోకగా 24,729 మంది ప్రాణాలు కోల్పోయారు.

    * భారత్‌లో 40,263 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 1306 మంది మరణించారు. * తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1082కి పెరగ్గా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

    * ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 1583 కాగా ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు.

  2. విశాఖ తీరంలో తళుకులీనుతున్న నౌకలు

    విశాఖ తీరంలో ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చెందిన నౌకలను విద్యుద్దీపాలతో అలంకరించారు. కోవిడ్ వారియర్స్‌కు సంఘీభావంగా నేవీ ఈ కార్యక్రమం తలపెట్టింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వలస కార్మికుల ఆందోళన

    హైదరాబాద్‌లో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులు కొందరు నగరంలోని టోలీచౌకీ వంతెన వద్ద చేరి తమను తమ సొంత రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. 'కరోనావైరస్ చైనాలోనే పుట్టింది' - ట్రంప్ నోట ఇప్పటికీ అదే మాట

    ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనావైరస్ చైనాలోని ప్రయోగశాలలోనే పుట్టిందనడానికి తగిన ఆధారాలను తను చూశానంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత నిఘా సంస్థలనే తక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

    ఇంతకు ముందు అమెరికా జాతీయ నిఘా ఏజెన్సీ డైరెక్టర్ కార్యాలయం "ఈ వైరస్ ఎలా పుట్టిందో తెలుసుకోవడం గురించి ఇంకా పరిశోధన చేస్తున్నాం" అని చెప్పింది.

    కానీ కోవిడ్-19 మానవ నిర్మితం గానీ, జన్యుపరంగా పరివర్తనం చెందిన వైరస్ గానీ కాదని అది నిర్ధారించింది.

    కోవిడ్-19 ప్రయోగశాల నుంచే పుట్టింది అనే సిద్ధాంతాలను చైనా కొట్టిపారేసింది. అమెరికా స్పందనను విమర్శించింది.

    గత ఏడాది చైనాలో ఈ వైరస్ ఆవిర్భవించినప్పటి నుంచి అది ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మందికి పైగా పొట్టనపెట్టుకుంది. ఈ వైరస్ వల్ల ఒక్క అమెరికాలోనే 63 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

    వుహాన్‌లో వైరస్ బయటపడినప్పటి నుంచి ఈ మహమ్మారి 32 లక్షల మందికి వ్యాపించింది. వారిలో పది లక్షలమందికి పైగా అమెరికన్లు ఉన్నారు.

  5. రేపటి నుంచి ఏపీలో మద్యం విక్రయాలు.. రద్దీ పెరిగితే దుకాణాల మూతే

    మద్యం

    ఫొటో సోర్స్, Getty Images

    కంటెయిన్మెంట్ జోన్లు, మాల్స్‌లో ఉన్న దుకాణాలు మినహా అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు మే 4 నుంచి తెరవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ సందర్భంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

    ఇవీ నిబంధనలు

    * దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరిచి సాయంత్రం 7 గంటలకు మూసివేయాలి.

    * దుకాణాల వద్ద ఒకసారి అయిదుగురు కంటే ఎక్కువ మందిని అనుమతించరు. ఇందుకోసం అయిదు వృత్తాలు గీయాలి.. వృత్తానికి వృత్తానికి మధ్య ఆరేసి అడుగుల దూరం ఉండాలి.

    * సోషల్ డిస్టెన్సింగ్‌కు సంబంధించిన నిబంధనలు దుకాణాల వద్ద విధిగా ప్రదర్శించాలి. కొనుగోలుదారులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలి.

    * వీటన్నిటికోసం అదనంగా సెక్యూరిటీ గార్డులన ఏర్పాటుచేసుకోవాలి.. స్థానిక పోలీసుల సహకారం తీసుకోవచ్చు.

    * ఒకవేళ ఎక్కువ మంది చేరితే స్థానిక పోలీసులకు సమాచారం అందించి దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయాలి. రద్దీ తగ్గిన తరువాతే తెరవాలి.

    * మద్యం దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్సింగ్ అమలుకు వలంటీర్లను వినియోగించుకోవచ్చు.

    * బార్లు, క్లబ్‌లు, ఏపీటీడీసీ లిక్కర్ లైసెన్సీలకు అనుమతి లేదు.

  6. విద్యుత్ వెలుగులలో యుద్ధ నౌకలు

    చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద సముద్రంలో ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కమోర్తాలు విద్యుత్ వెలుగులతో ధగధగలాడుతున్నాయి.

    కోవిడ్‌పై పోరు సల్పుతున్న వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి సంఘీభావంగా భారత నావికాదళం ఈ యుద్ధ నౌకలను విద్యుదీపాలతో అలంకరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. లాక్‌డౌన్ లేకుంటే పరిస్థితి ఘోరంగా ఉండేది.. కానీ, ఆర్థికంగా మాత్రం ఇబ్బందుల్లో ఉన్నా: దిల్లీ సీఎం కేజ్రీవాల్

    లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వానికి రూ.3,500 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.300 కోట్ల ఆదాయమే వచ్చిందని.. ఇలా అయితే ప్రభుత్వం ఎలా పనిచేయగలదని ఆయన అన్నారు.

    అయితే, మార్చి 24న కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించడం కూడా కీలకమేనని.. అప్పుడు కనుక లాక్‌డౌన్ ప్రకటించకపోయుంటే దేశంలో పరిస్థితి భయానకంగా ఉండేదన్నారు.

    అప్పటికి దేశం కోవిడ్-19తో పోరాటానికి సిద్ధంగా లేదని.. సోషల్ డిస్టెన్సింగ్‌పై అందరికీ అవగాహన లేదని.. పౌరులు, ఆసుపత్రులు కూడా దీనికి సిద్ధం కాలేదని కేజ్రీవాల్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. భారత్‌లో 40 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

    భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది.

    గత 24 గంటల్లో కొత్తగా 2,487 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 40,263కి పెరిగింది.

    గత 24 గంటల్లో 83 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1306కి పెరిగింది.

    ఇప్పటివరకు 10,887 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 28,070 యాక్టివ్ కేసులున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. రేపటి నుంచి ఏపీలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగిలిన చోట్ల ఆంక్షల సడలింపు

    ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి కంటైన్మెంట్ జోన్‌లు మినహా మిగతా ప్రాంతాల్లో ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

    ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు తెరిచి ఉంటాయి.

    విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, పార్కులకు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలకు అనుమతి లేదు.

    రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి వీలు లేదు.

    నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

    ప్రైవేట్ సంస్థలు కూడా 33 శాతం సిబ్బందితో నిర్వహించేలా అనుమతులు ఇస్తారు.

    కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు మునుపటిలాగే కొనసాగుతాయి. అక్కడ ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలి.

  10. పొరుగు రాష్ట్రాల నుంచి రావొద్దు: ఏపీ సీఎం జగన్

    జగన్ సమీక్ష సమావేశం

    ఫొటో సోర్స్, ysrcp

    కోవిడ్-19 నివారణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

    ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని.. డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరైన ఈ సమావేశంలో.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీలోకి రావడం కోసం పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు ప్రస్తావించారు.

    పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

    సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని.. వలస కూలీలనే రాష్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.

    ఇప్పటికే వేల సంఖ్యలో వలస కూలీలు వస్తున్నారని.. వారందరినీ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచి టెస్టులు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

    సదుపాయాలు కల్పించలేకపోతున్నాం

    ఇప్పటికే వచ్చినవారికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది కాబట్టి మిగతావారు రాష్ట్రంలోకి రాకుండా సహకరించాలని కోరారు.

    విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులకోసం క్వారంటైన్‌ సదుపాయాల కల్పన ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

    రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కూలీలను ప్రత్యేక రైళ్లలో పంపించాలని.. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను పంపేటప్పుడు వారికి పండ్లుతో కూడిన ఒక కిట్‌ కూడా ఇవ్వాలని సీఎం ధికారులను ఆదేశించారు.

    కూలీల అంతర్జిల్లా రవాణాకు బస్సులు ఉపయోగించాలని సూచించారు. టెస్టుల్లో ఫస్ట్.. ఏపీలో ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 2152 గా ఉందని.. ఇది దేశంలో అత్యధిక సగటని అధికారులు చెప్పారు.

    రాష్ట్రంలో మరణాల శాతం 2.08గా నమోదైందని, దేశంలో 3.32 శాతంగా నమోదైందని వెల్లడించారు.

    మద్యం విషయంలో..

    మద్యం దుకాణాలు తెరవొచ్చంటూ కేంద్ర హోంశాఖ తన మార్గదర్శకాల్లో చెప్పిందని, ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో దుకాణాలు తెరుస్తున్నారని అధికారులు సమావేశంలో పేర్కొన్నారు.

    మద్యం నియంత్రణ మన విధానమని ఆదిశగా అనేక చర్యలు తీసుకున్నామని, మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

    దుకాణాల వద్ద రద్దీ లేకుండా, భౌతిక దూరం పాటించాల్సిన అవసరంపైనా సమావేశంలో చర్చ జరిగింది. దీనికోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం ధరలను 25శాతం శాతం పెంచాలని నిర్ణయించారు.

    అంతేకాక రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్యను మరింతగా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

    మద్యం అమ్మకాల వేళలను కూడా నియంత్రించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు విధివిధానాలను ఖరారుచేయనున్నారు.

  11. రష్యాలో ఒక్క రోజులోనే 10,000 కొత్త కేసులు

    రష్యాలో..

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనావైరస్ ఉద్ధృతి తగ్గనారంభిస్తుంటే మరికొన్ని దేశాల్లో పెరగడం మొదలైంది.

    రష్యాలో తాజాగా ఒకే రోజున ఏకంగా 10 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తాత్కాలిక ఆసుపత్రులు ప్రారంభించారు.

    అయితే.. రష్యా ప్రభుత్వ లెక్కల ప్రకారం కేసుల సంఖ్యతో పోల్చితే మృతుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పటివరకు ఆ దేశంలో 1,280 మంది మరణించారు.

    రష్యా ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషూస్టిన్ కూడా కరోనావైరస్ బారినపడ్డారు. రష్యాలో పెద్ద ఎత్తున టెస్టులు చేస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

    ఒక్క మాస్కోలోనే రోజుకు 40 వేల మందిని పరీక్షిస్తున్నారు.

    మరోవైపు కొత్తగా నిర్ధరణ అవుతున్న కేసుల్లో సగానికిపైగా ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

    కాగా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం రష్యాలో కేసుల సంఖ్య 1,34,687కి పెరిగింది.

    ప్రస్తుతం మృతుల సంఖ్య 1280 వద్ద ఉన్నప్పటికీ మరణాల రేటు వేగంగా పెరుగుతోంది. గత 10 రోజుల్లోనే రష్యాలో కరోనా వైరస్ మరణాలు రెట్టింపయ్యాయి.

  12. నేతన్నలు పస్తులుంటున్నారు.. కుటుంబానికి రూ.10 వేలు సాయం చేయండి: ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ డిమాండ్

    పవన్ కల్యాణ్

    ఫొటో సోర్స్, janasena

    ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలు లాక్‌డౌన్ కారణంగా పూట గడవక ఇబ్బందులు పడుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

    రాష్ట్రంలోని 2.5 లక్షల చేనేత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆయన కోరారు.

    లాక్‌డౌన్ అనంతరం వారికి జీవనోపాధి మార్గాలు చూపడంతో పాటు వారికి అవసరమైన ముడిసరకును అందించే బాధ్యత రాష్ట్ర జౌళి శాఖ చేపట్టాలని కోరారు.

  13. ‘నన్ను బతికించటానికి లీటర్ల కొద్దీ ఆక్సిజన్ అందించారు‘ - బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, తాను కరోనావైరస్ సోకి విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్నపుడు ‘ప్రత్యామ్నాయ ప్రణాళికల’ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

    లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనను సజీవంగా ఉంచటానికి తనకు ‘‘లీటర్ల కొద్దీ ఆక్సిజన్’’ అందించారని ఆయన ఆదివారం ‘సన్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

    వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నపుడు, ఇతరుల బాధలను నివారించాలన్న తపన, బ్రిటన్‌ను ‘మళ్లీ తన కాళ్లపై నిలబెట్టి ముందుకు నడిపించాల’న్న తాపత్రయం తనను ముందుకు నడిపించాయని అన్నారు.

    అంతకుముందు, ప్రధాని బోరిస్ కాబోయే భార్య క్యారీ సిమండ్స్.. బుధవారం నాడు జన్మించిన తమ కుమారుడికి విల్ఫెడ్ లారీ నికొలస్ జాన్సన్ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.

    బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Getty Images

  14. కోవిడ్-19పై ముందువరుసలో నిల్చుని పోరాడుతున్న అందరికీ నా శాల్యూట్: ప్రధాని మోదీ

    ‘కోవిడ్-19పై పోరులో ముందువరుసలో ఉండి ధైర్యంగా కదులుతున్న అందరినీ నా శాల్యూట్’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

    కోవిడ్ వారియర్స్‌కు సంఘీభావంగా, గౌరవంగా భారత సాయుధ దళాలు చేపట్టిన ప్రదర్శనలు.. ఆకాశం నుంచి విరుల జల్లు కురిపించడానికి సంబంధించిన వీడియోలు ఆ ట్వీట్‌లో పోస్ట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. భారత్‌లో కరోనా మరణాల రేటు 3.2.. ప్రపంచంలోనే అతి తక్కువ: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్

    హర్షవర్థన్

    ఫొటో సోర్స్, ani

    ప్రపంచంలో కరోనా వైరస్ మరణాల రేటు తక్కువగా ఉన్నది భారత్‌లోనేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

    భారత్‌లో కోవిడ్-19 మరణాల రేటు 3.2 శాతంగా ఉందని.. అలాగే, 10 వేల మంది కరోనా రోగులు ఇప్పటికే కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారని చెప్పారు.

    ‘‘ఇప్పటికే 10 వేల మందికిపైగా డిశ్చార్జయ్యారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలోనూ అనేకమంది కోలుకుంటున్నారు, నయం కాగానే డిశ్చార్జవుతారు.

    గత 14 రోజుల్లో కేసుల రెట్టింపు రేటు 10.5 రోజులు కాగా ఇప్పుడు 12 రోజులని హర్షవర్థన్ చెప్పారు.

    గత 24 గంటల్లో 2,644 కొత్త కేసులు నమోదయ్యాయని.. 83 మంది మరణించారని.. మొత్తం కేసు సంఖ్య 39,980కి.. మరణాలు 1301కి పెరిగాయని తెలిపారు.

    ప్రస్తుతం డిశ్చార్జయిన 10,633 మందిని మినహాయించగా 28,046 యాక్టివ్ కేసులున్నట్లుచెప్పారు.

  16. ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలకు చేరువలో మృతుల సంఖ్య

    కరోనా టెస్టులు

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచవ్యాప్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35 లక్షలకు చేరుకుంది.

    మృతుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువైంది.

    జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 3,428,422కు చేరుకుంది.

    వీరిలో 2,43,831 ప్రాణాలు కోల్పోయారు.

    కరోనాకు అత్యంత ప్రభావితమైన అమెరికాలో 13 లక్షల కేసులు వెలుగులోకి రాగా, 66,385 మంది మృతిచెందారు.

  17. జర్మనీలో తెరుచుకోనున్న చర్చిలు

    జర్మనీలో చర్చిలు తెరవనున్నారు.

    అధికారులు, మతపెద్దల మధ్య కొన్ని వారాల పాటు చర్చలు నడిచిన తర్వాత కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా కఠిన షరతులకు లోబడి చర్చిలు తెరవాలని నిర్ణయించారు.

    చర్చిల్లో ప్రార్థనలు చేసేందుకు జనాలను పరిమితంగా అనుమతిస్తారు.

    లోపల ఉండే వారి మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండాలి.

    చర్చిలో పాటలు పాడడంపై నిషేధం ఉంటుంది.

    ఫాదర్లు మాస్క్ ధరించి ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది.

    యూదులు, ముస్లింలు కూడా తమ తమ ప్రార్థనా స్థలాల్లో శుభ్రతపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

    మతపెద్దలందరూ మార్చిలో ప్రభుత్వ లాక్‌డౌన్ నిర్ణయాన్ని సమర్థించారు.

    కానీ లాక్‌డౌన్ సడలింపులు జరిగేకొద్దీ షాపులు తెరుచుకున్నాయి.

    దాంతో వార ప్రార్థనా స్థలాలను కూడా తెరిచేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

    షాపులు తెరిచినప్పుడు, ప్రార్థనా స్థలాలు ఎందుకు తెరవకూడదని ప్రశ్నించారు.

    వారంతా ఇప్పుడు ప్రభుత్వం చర్యలను స్వాగతించారు.

    ప్రస్తుత సమయంలో ప్రజలకు తోడుగా ఉండి వారిలో విశ్వాసం కల్పించడం చాలా అవసరం అని ఒక యూదు మతపెద్ద అన్నారు.

    చర్చి

    ఫొటో సోర్స్, Getty Images

  18. వైరస్ తిరగబెట్టడం కాదది... కోలుకున్నవారికి మళ్లీ పాజిటివ్ రావడానికి కారణం మృతకణాలే: డబ్ల్యూహెచ్‌వో

    మారియా వేన్ కెర్ఖోవ్

    ఫొటో సోర్స్, bbc

    కరోనావైరస్ బారినపడి కోలుకున్నవారిని మళ్లీ పరీక్షించగా పాజిటివ్ వచ్చిన ఉదంతాలు అనేక దేశాల్లో కనిపిస్తున్నాయి.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 టెక్నికల్ హెడ్ మారియా వేన్ కెర్ఖోవ్ దీనికి గల కారణాలు చెప్పారు.

    కరోనావైరస్ సోకిన వారు కోలుకున్నప్పటికీ వారి ఊపిరితిత్తుల్లో కొన్ని మృత కణాలు ఉండిపోవడం వల్ల ఇలా టెస్టుల్లో పాజిటివ్ వస్తోందని.. అంతేకానీ, వారిలో మళ్లీ వైరస్ తిరగబెట్టినట్టు కాదని చెప్పారు.

    అయినప్పటికీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేస్తున్నారని.. ఒకసారి కరోనా సోకిన తరువాత రోగనిరోధక శక్తి ఎంత సమర్థంగా ఉంటున్నది అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు.

    ఇక వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంలోనూ ఆమె మాట్లాడుతూ.. ఇది సహజ సిద్ధంగా వచ్చిన వైరస్సేనని.. గబ్బిలాల నుంచి ఈ వైరస్ వచ్చిందని.. అయితే.. గబ్బిలాలలో ఉండే ఈ వైరస్ మనుషులకు ఎలా వచ్చింది.. వాహకమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదని చెప్పారు.

  19. కరోనావైరస్: దిల్లీలోని సీఆర్‌పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత

    దిల్లీలోని సీఆర్‌పీఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌ను తాత్కాలికంగా మూసివేశారు. సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరి వద్ద పనిచేసే సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధరణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ శానిటైజ్ చేశాక మళ్లీ కార్యకలాపాలు మొదలవుతాయి.

    స్పెషల్ డైరెక్టర్ జనరల్ ర్యాంకు అధికారి సహా 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు.