‘ఇప్పటివరకూ దేశంలో పది వేల మంది డిశ్చార్జ్’
దేశవ్యాప్తంగా ఆదివారం వరకూ కోవిడ్-19 రోగుల్లో పది వేలకుపైగా మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
ఇంకా చాలా మంది ఈ రోగం నుంచి కోలుకుంటున్నారని ఆయన చెప్పారు.
కేసులు రెట్టింపు అయ్యే వ్యవధి ఇదివరకు 10.5 రోజులుగా ఉండేదని, ఇప్పుడది 12 రోజులకు పెరిగిందని ఆయన అన్నారు.
కరోనావైరస్ సోకినవారిలో మరణిస్తున్నవారి శాతం భారత్‌లో 3.2గా ఉందని, ప్రపంచంలోనే మరణాల రేటు అత్యల్పం ఉన్న దేశాల్లోభారత్ కూడా ఒకటని చెప్పారు.
ప్రస్తుతం భారత్‌లో 28వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది














