పెరూలో కోవిడ్-19 మృతుల గురించి అల్లర్లు, 9 మంది మృతి
పెరూలోని ఒక జైల్లో జరిగిన గొడవల్లో 9 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.
లిమాలోని కాస్ట్రో కాస్ట్రో జైలులో ఇద్దరు ఖైదీలు కోవిడ్-19తో చనిపోవడంతో ఈ గొడవ మొదలైంది.
ఈ గొడవల్లో ఇద్దరు ఖైదీలు, ఐదుగురు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.
లాటిన్ అమెరికాల్లోని చాలా జైళ్లలో ఖైదీల సంఖ్య విపరీతంగా ఉండడం, సరైన వైద్య సేవలు లేకపోవడంతో తమకు కరోనా వస్తుందేమే అని ఖైదీల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. అది చివరకు గొడవలకు దారితీస్తోంది.
గత నెలలో కొలంబియాలోని ఒక జైలులో గొడవలు జరగడంతో 23 మందికి పైగా చనిపోయారు.
ఖైదీలకు మరింత రక్షణ కల్పించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. జైల్లో రద్దీని తగ్గించడానికి బలహీనంగా ఉన్న వారిని తాత్కాలికంగా విడుదల చేయాలని సూచించింది.