ఈ LIVE పేజీ ఇక్కడితో ముగిసిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దాదాపు 32 లక్షల కరోనావైరస్ బాధితుల్లో 2.27 లక్షల మంది చనిపోయారు.
అమెరికాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. మృతుల సంఖ్య 60 వేలు దాటింది. పది లక్షల మందికి వైరస్ సోకింది.
భారత్‌లో 31,787 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 8 వేల మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
తాజా సమాచారం ప్రకారం ఎబోలా వైరస్ బాధితుల చికిత్సకు ఉపయోగించిన రెమిడిస్వియర్ మందు కోవిడ్ రోగులపై పని చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని అమెరికా తెలిపింది.














