కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 2,29,447 మంది.. భారత్‌లో 1075, ఏపీలో 31, తెలంగాణలో 28 మంది మృతి
మొత్తం కోవిడ్ కేసుల్లో 8,324 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 23,651 యాక్టివ్ కేసులకు చికిత్స కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 71 కొత్త కేసులతో కలిపి వైరస్ సోకిన వారి సంఖ్య 1.403కుచేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 9,915, గుజరాత్‌లో 4,082, దిల్లీలో 3,439 కేసులు నమోదయ్యాయి.
లైవ్ కవరేజీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 32,24,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 2,29,447 మంది మృతిచెందారు.
- అమెరికాలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 10,43,595కు పెరిగింది. మొత్తం 58,529 మంది చనిపోయారు.
- స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,39,639కు చేరింది. దేశవ్యాప్తంగా 24,543 మంది మృతిచెందారు.
- ఇటలీలో ధ్రువీకరించిన కరోనా కేసులు 2,05,463కు చేరింది. దేశంలో మొత్తం 27,967 మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,628. ఇక్కడ 24,087 మంది మృతిచెందారు.
- బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 1,66,443కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 26,097 మంది మరణించారు.
- భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,610కు పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 1,075కి చేరింది.
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 1,403కు పెరిగాయి.రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 31.
- తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1,038కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 568. మృతుల సంఖ్య 28కి పెరిగింది.

లాస్ ఏంజెలెస్‌లో అందరికీ ఉచిత పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ దేశంలోని పెద్ద నగరాల్లో అందరికీ ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన తొలి నగరం లాస్ ఏంజెలెసే.
ఇదివరకు ఇక్కడి పరీక్ష కేంద్రాల్లో కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించినవారికి, చికిత్సలో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు.
ఇప్పుడు పరీక్షల సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో ఎవరూ వచ్చినా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు నగర మేయర్ ఎరిక్ గార్సెటీ తెలిపారు. అయితే, కోవిడ్ అనుమానిత లక్షణాలున్నవారికి ఇందులో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
ఈ పరీక్షలకు అపాయింట్‌మెంట్లను నగరవాసులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేయాలన్నది ఎలా నిర్ణయిస్తారంటే...

ఫొటో సోర్స్, GETTY IMAGES
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పుడు చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. దీన్ని ఎత్తివేసే దిశగా కొన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి.
లాక్‌డౌన్‌ను ఎప్పుడు ఎత్తివేయాలో నిర్ణయించడంలో ‘ఆర్ నాట్’ (RO) అని పిలిచే ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య ప్రభుత్వాలకి మార్గదర్శకంగా నిలుస్తోంది.
ప్రజల ప్రాణాలని కాపాడే చర్యల కోసం, లాక్ డౌన్‌ను ఎంతమేరకు సడలించవచ్చనే నిర్ణయాలను తీసుకోవడానికి ప్రభుత్వాలు దీని మీద ఆధారపడుతున్నాయి.
ఏపీలో గ్రీన్‌జోన్లలో పరిశ్రమలు తెరవడానికి అనుమతులు, ఏపీ కార్మికులు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుంటే ఫోన్ చేయాల్సిన నంబర్ 0866 2424680
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌జోన్‌లో అన్ని పరిశ్రమలు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చినట్లు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు.
మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిశ్రమలు నడిచేందుకు కార్మికులు అవసరమైతే ఇతర గ్రీన్‌జోన్ల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెచ్చుకోవచ్చని సూచించారు.
ఏపీలో ఉండిపోయిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులను పరీక్షలు చేసిన తరువాత వారివారి రాష్ట్రాలకు పంపిస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1500 మంది పొగాకు కార్మికులు చిక్కుకుపోయారని.. వారంతా కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందినవారని, వారిని ఆయా జిల్లాలకు పంపిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల్లో సుమారు 6 వేల మంది సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామని చెప్పడంతో వారు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కార్మికులు 12 వేల మంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారని.. వారి బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు.
1902 కాల్ సెంటర్ ద్వారా ఏపీలో చిక్కుకున్న వారు తమ వివరాలు తెలియజేయొచ్చని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కార్మికులు ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయినట్లయితే అలాంటివారు 0866 2424680 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించొచ్చని చెప్పారు.

ఫొటో సోర్స్, i and pr AP
రఘురామ్ రాజన్‌తో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ
భారత ఆర్థికవ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావాలు , కోవిడ్ -19 విసిరిన సవాళ్లపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఆర్ధిక నిపుణుడు రఘురామ్ రాజన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లైవ్ చాట్‌లో మాట్లాడారు.
''కోవిడ్-19 సంక్షోభం కారణంగా రాబోయే రోజుల్లో భారత్‌కు ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ప్రపంచంలో వస్తున్న రాజకీయ మార్పుల వల్ల భారత్‌కు లాభం జరుగుతుందా?'' అని రాహుల్ ప్రశ్న వేశారు. కోవిడ్-19 లాంటి వాటి వల్ల ఏ దేశానికీ పెద్దగా సానుకూలమైన విషయాలు ఉండవని రఘురామ్ బదులిచ్చారు. కానీ, కొన్ని విధానాలు పాటిస్తే, భారత్ ప్రయోజనం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. ''అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో ఇప్పుడు ప్రతి అంశంపైనా పునరాలోచన జరుగుతుంది. దీని రూపకల్పనకు నేతృత్వం వహించే అవకాశం భారత్‌కు ఉంటుంది. ఈ క్రమంలో భారత్ తన పరిశ్రమలు, సప్లయ్ చైన్‌కు కొన్ని అవకాశాలను రాబట్టుకోవచ్చు'' అని రాజన్ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గత 24 గంటల్లో దేశంలో 1,718 కొత్త కేసులు

ఫొటో సోర్స్, ANI
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 1,718 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగ్రవాల్ వెల్లడించారు.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కు పెరిగినట్లు వివరించారు.
ఇంకా ఆయన ఏం చెప్పారంటే..
- ప్రస్తుతం దేశంలో 23,651 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- గడిచిన 24 గంటల్లో 630 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ 8,325 మంది కరోనావైరస్ నుంచి కోలుకున్నారు.
- దేశంలో కరోనావైరస్ కేసుల్లో రికవరీ రేటు 25.19 శాతంగా ఉంది.
- కేసులు రెట్టింపయ్యే సమయం 11 రోజులకు పెరిగింది.
కేంద్ర మార్గదర్శకాలు సరిగ్గా లేవు : తెలంగాణ మంత్రి తలసాని
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
లాక్‌డౌన్‌లో చిక్కుకున్నవారిని స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు సరిగ్గా లేవని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు.
వివిధ రాష్ట్రాల్లో 2 కోట్లకుపైగా మంది చిక్కుకుపోయి ఉన్నారని, వీరందరూ ఈ వేసవి వేడిలో మూణ్నాలుగు రోజుల పాటు బస్సుల్లో ఎలా ప్రయాణం చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు.
జనాల తరలింపుకు బస్సుల కన్నా రైళ్ల వినియోగం ఉత్తమమని తలసాని అన్నారు.
క్యూబా సాయం తీసుకోవడంపై దక్షిణాఫ్రికాను తప్పుపట్టిన అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ సంక్షోభం విషయంలో క్యూబా సాయం తీసుకుంటున్నందుకు దక్షిణాఫ్రికాను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తప్పుపట్టారు.
క్యూబా నుంచి దాదాపు 200 మంది నిపుణులతో కూడిన బృందం ఇటీవల దక్షిణాఫ్రికాకు వచ్చింది. ఆ బృందంలో అంటువ్యాధుల నిపుణులు, ఫిజీషియన్లు, బయో టెక్నాలజీ నిపుణులు, వైద్యానికి సంబంధించి ఇతర నిపుణులు ఉన్నారు.
అయితే, క్యూబా ఈ మహమ్మారి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటోందని పాంపియో ఆరోపించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
‘‘క్యూబా కపటాన్ని తెలుసుకుని, వారి మద్దతును నిరాకరించిన బ్రెజిల్, బొలీవియా లాంటి దేశాలను అభినందిస్తున్నాం. అన్ని దేశాలూ ఇలాగే వ్యవహరించాలని మేం కోరుతున్నాం. దక్షిణాఫ్రికా, కతార్‌లను కూడా ఇదే కోరుతున్నాం’’ అని పాంపియో అన్నారు.
ఈ వ్యాఖ్యలపై క్యూబా అధ్యక్షుడు మిగుల్ దియాజ్ కానెల్ ట్విటర్‌లో స్పందించారు. క్యూబా అంతర్జాతీయంగా ఎప్పుడు వైద్య సహకారం అందించినా.. అమెరికా అబద్ధాలు, అసత్య ఆరోపణలతో దాడి చేస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.
రోడ్డు మీద 3డీ ‘వైరస్’
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కరోనావైరస్ వ్యాప్తి గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కర్ణాటకలో బాదల్ నంజున్‌దాస్ స్వామి అనే కళాకారుడు ఇలా రోడ్డుపై 3డీలో కరోనావైరస్ బొమ్మలను వేశారు.
దక్షిణకొరియా కరోనావైరస్‌ను ఎలా గెలిచింది?, ఒకదశలో వ్యాధి వ్యాప్తికి బెంబేలెత్తిన దక్షిణకొరియా, కరోనాపై యుద్దంలో ఎలా విజయం సాధించింది? హాట్‌స్పాట్ నుంచి జీరో కేస్‌కు ఎలా రాగలిగింది?
కరోనావైరస్ వ్యాపించడం మొదలుపెట్టిన 75 రోజుల తర్వాత దక్షిణ కొరియాలో లోకల్ కేసులు తొలిసారి జీరో అయ్యాయి.
జనవరి 20: దక్షిణకొరియాలో చైనాకు చెందిన ఓ మహిళకు కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
ఫిబ్రవరి 04: కొవిడ్-19కు కేంద్రస్థానమైన చైనాలోని హుబే ప్రావిన్స్ నుంచి చైనీయులు, విదేశీయులు తమ దేశంలోని ప్రవేశించకుండా కట్టడిచేసింది దక్షిణకొరియా.
ఫిబ్రవరి 18: దక్షిణకొరియాలో 31వ కేసు నమోదైంది. ఆదేశంలో పనిచేస్తున్న షించేంజీ అనే మతసంస్థ తరచూ వివిధ చర్చిల్లో నిర్వహించే కార్యక్రమాల కారణంగా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఫిబ్రవరి 24:15దేశాలు దక్షిణకొరియాకు రాకపోకలను నిషేధించాయి.
ఫిబ్రవరి 29: దేశంలో ఒకేరోజు అత్యధికంగా 909 కేసులు నమోదయ్యాయి.
మార్చి 2: దేశవ్యాప్తంగా ఈతేదీనాటికి 4200 కేసులు నమోదయ్యాయి. వీరిలో 60శాతంమంది చర్చి కార్యక్రమానికి వెళ్లినవారేనని తేలింది.
మార్చి: ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా అడుగులు పడుతున్న సమయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించడం మొదలుపెట్టింది.
ఏప్రిల్ 15: ఒకపక్క మహమ్మారి ముసురుతుండగా ఏ దేశమూ చేయలేని పని చేసింది ద.కొరియా. దేశంలో ఎన్నికలు నిర్వహించింది.
ఏప్రిల్ 22: దేశంలో రోజువారీ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో నిబంధనలను సరళతరం చేయడం మొదలుపెట్టింది దక్షిణ కొరియా
ఏప్రిల్ 30: ఈ రోజు ఒక్క లోకల్ కేసు కూడా నమోదు కాలేదని దక్షిణ కొరియా ప్రకటించింది. దేశంలో మొత్తం నమోదైన కేసులు 10,765 కాగా, ఆంక్షలు సడలించిన అధికారుల, మహమ్మారి రెండోదశ ప్రభావానికి అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఫొటో సోర్స్, European Photopress Agency
దక్షిణాసియాలో కరోనా అప్‌డేట్స్
ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో చిక్కుకుపోయిన 7వేలమంది తమ పౌరులను మే మొదటివారంకల్లా దేశానికి తీసుకోస్తామని పాకిస్తాన్ ప్రకటించింది.
ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో 15000 కేసులు నమోదుకాగా 355మంది మరణించారు. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే తిరిగి దేశానికి రావాల్సిన అవసరంలేదని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న తమ పౌరులకు సూచించింది
వివిధదేశాలలో ఉన్న తమ పౌరుల కోసం టెలీమెడిసిన్ సర్వీసును అందిస్తోంది బంగ్లాదేశ్. ఇప్పటి వరకు 7000మంది బంగ్లాదేశీయులు కరోనాబారిన పడ్డారు.
57 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపాల్ ఈవారంలోనే మూడోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. అయినా వ్యాలీలో ప్రజలు నిబంధనలను పట్టించుకోవడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా శ్రీలంక పర్యాటకరంగం 70శాతం మార్కెట్‌ను నష్టపోయినట్లు ఇయాన్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. బుధవారంనాటికి 600 పాజిటివ్ కేసులు నమోదుకావడం పట్ల శ్రీలంక ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 71 కొత్త కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 71 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దాంతో, రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 1,403కుచేరింది.
అయితే, తాజాగా మరణాలేవీ నమోదు కాలేదు. ఇప్పటివరకు 31 మంది కోవిడ్ వ్యాధితో మరణించారు. 321 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,051 మంది కోవిడ్ బాధితులకు చికిత్స కొనసాగుతోంది.

భారత్‌లో 33 వేలు దాటిన కోవిడ్ కేసులు, 24 గంటల్లో 67 మరణాలు
గత 24 గంటల్లో భారతదేశంలో 1,718 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో, దేశంలో మొత్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 33,050కి చేరిందని భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్త కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంతో పాటు గత 24 గంటల్లో 67 మంది చనిపోయారు.
మొత్తం కోవిడ్ కేసుల్లో 8,324 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 23,651 యాక్టివ్ కేసులకు చికిత్స కొనసాగుతోంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 9,915 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 4,082, దిల్లీలో 3,439 కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, get
కేరళలో సామాజిక దూరం నిబంధనల ఉల్లంఘన
కేరళలోని ఎర్నాకుళం ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున జనం క్యూలలో కనిపించారు.
కోవిడ్-19 భయం ఉన్నప్పటికీ వారంతా నిబంధనలు మర్చిపోయి క్యూలో దగ్గరదగ్గర నిలబడ్డారని ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
కేరళలో ఇప్పటి వరకు 495 పాజిటివ్ కేసులు రాగా...ఇప్పుడు 123 యాక్టివ్ కేసులున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'నేను మళ్లీ అధ్యక్షుడిని కాకుండా చైనా కుట్ర' - డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చైనా తాను చేయగలిగనంతా చేస్తోందని రాయిటర్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
కరోనా వైరస్‌ను చైనా హ్యాండిల్ చేస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని ట్రంప్ అన్నారు. కరోనావైరస్ విషయంలో చైనా పాత్రను నిరూపించడానికి తాను అనేక అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనాయేనని గత కొద్దికాలంగా ట్రంప్ వాదిస్తున్నారు.
దిల్లీ కూరగాయల మార్కెట్‌లో మరో నాలుగు కోవిడ్ కేసులు
దిల్లీ ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో మరో నలుగురు వ్యాపారులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. దీంతో ఈ మార్కెట్ కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 15కు చేరింది. అయితే ఈ నలుగురు వ్యాధి సోకిన తర్వాత మార్కెట్‌కు వచ్చిపోలేదని ఆజాద్‌పూర్ మార్కెట్ అధికారులు వెల్లడించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కరోనావైరస్: 'ఎబోలా వైరస్ మందు కోవిడ్ రోగులపై పని చేస్తోంది'

ఫొటో సోర్స్, Getty Images
ఎబోలా చికిత్సలో ఉపయోగించే ఒక ఔషధం కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి సహకరిస్తోందని "స్పష్టంగా" తెలుస్తోందని అమెరికా అధికారులు తెలిపారు.
అంటువ్యాధుల నిపుణుడు, అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంథొనీ ఫౌచీ, కరోనావైరస్ చికిత్సలో ఎబోలా ఔషధంతో జరుగుతున్న ప్రయోగాలు ఫలించవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రెమిడిస్వియర్‌గా పిలిచే ఈ మందును ప్రాథమికంగా ఎబోలా వైరస్‌కు చికిత్స చేయడానికి అభివృద్ధి చేశారు.
"గణాంకాలు బట్టి చూస్తే రెమిడిస్వియర్ మందు తీసుకున్న కోవిడ్ రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. రోగిలో వ్యాధి లక్షణాలు కొనసాగే వ్యవధిని ఈ మందు 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గించిందని ప్రాథమిక వివరాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు ఏదో అద్భుతంలా కనిపించకపోవచ్చు. కానీ, ఎబోలా మందు కరోనావైరస్‌ను నిరోధించగలదని నిరూపణ అయింది" అని డాక్టర్ ఫౌచీ అన్నారు.
ఎన్ఐఏఐడి ఈ చికిత్సలను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అయితే, ఫలితాలను ఇంకా వెల్లడి చేయలేదు.
చైనాలో రెమిడిస్వయర్ మందుతో కరోనావైరస్ రోగులకు చికిత్స చేసినప్పుడు ఫలితాలు కనిపించలేదని, ఆ దేశంలోని ప్రయోగాల గురించి లాన్సెట్ అనే మెడికల ్ జర్నల్ పూర్తి వివరాలను ప్రచురించిన అనంతరం డాక్టర్ ఫౌచీ ప్రకటన వెలువడింది. అయితే, చైనాలో ఈ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి.
బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVEఅప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం
కరోనావైరస్ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంది బీబీసీ తెలుగు LIVE పేజి.
ఇప్పటివరకు ముఖ్యాంశాలు:
- భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 31,787కు చేరుకుంది. ఇప్పటివరకు 7,797 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో మృతుల సంఖ్య వేయి దాటింది.
- మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రంలో 9,318 మందికి వైరస్ సోకింది. 400 మంది చనిపోయారు.
- ఆంధ్రప్రదేశ్‌లో 1,332 మందికి వైరస్ సోకింది. 31 మంది చనిపోయారు. తెలంగాణలో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. మొత్తంగా 1,016 మంది కోవిడ్ బాధితుల్లో 25 మంది చనిపోయారు.
- ప్రపంచవ్యాప్తంగా 31,91,827 మందికి కరోనావైరస్ సోకింది. వీరిలో 2,27,535 మంది చనిపోయారు. అమెరికాలో కోవిడ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. 60 వేలకు పైగా ప్రజలు కోవిడ్ వ్యాధితో చనిపోయారు.
