టోక్యో ఒలంపిక్స్ 2020... 2021... 2022?
కరోనావైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే వచ్చే ఏడాది ఒలంపిక్స్ పోటీలను నిర్వహించడం ఇబ్బందేనని జపాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యొషిటకె యొకొకుర అన్నారు.
‘‘ఒలంపిక్స్ పోటీలకు జపాన్ ఆతిథ్యం ఇవ్వాలా? ఇవ్వకూడదా? అని నేను చెప్పట్లేదు, కానీ అలా చేయడం ఇబ్బందికరం’’ అని యెషిటకె చెప్పారు.
ఈ ఏడాది జరగాల్సిన క్రీడలను 2021కి వాయిదా వేశారు. అయితే, వచ్చే ఏడాదైనా ఈ పోటీలు జరుగుతాయా? అన్న దానిపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది క్రీడలు జరుగుతాయన్న హామీని తాను ఇవ్వలేనని టోక్యో గేమ్స్ ఛీఫ్ ఈ నెల మొదట్లో అన్నారు.

ఫొటో సోర్స్, AFP



