కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 2.08 లక్షల మరణాలు; భారత్‌లో 28,380 బాధితులు, 886 మృతులు

ప్రపంచదేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. భారతదేశంలో మొదటిసారి 24 గంటల వ్యవధిలో 60 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం 28,380 మంది కోవిడ్ బాధితులలో 6,362 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్

    జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 29, 95,486 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,07,583 మంది మృతిచెందారు.

    • అమెరికాలో కోవిడ్-19 కేసుల సంఖ్య 968203కు పెరిగింది. మృతుల సంఖ్య 54938కు పెరిగింది.
    • స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2,29,422కు చేరాయి. మొత్తం మృతుల సంఖ్య 23,521.
    • ఇటలీలో కోవిడ్-19 కేసులు 1,97,675కు చేరాయి. ఇక్కడ మృతుల సంఖ్య26,644కు పెరిగింది.
    • ఫ్రాన్స్‌ లో కరోనా పాజిటివ్ కేసులు1,62,220కు చేరుకుంది. మృతుల సంఖ్య 22,890కు పెరిగింది.
    • బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 1,54,038కు పెరిగింది. మొత్తం 20,797 మంది చనిపోయారు.
    • భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరింది. దేశంలో కోవిడ్‌తో మొత్తం 886 మంది చనిపోయారు.
    • తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1003కి చేరింది. మృతుల సంఖ్య25 దగ్గరే ఉంది.
    • ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు 1177కు చేరాయి. మృతుల సంఖ్య 31 దగ్గరే ఉంది.
    కరోనా కేసులు
  2. CARTOON OF THE DAY: నీక్కూడా తాళం వేస్తాంలే

    తాళం వేస్తాం
  3. జర్మనీలో లాక్‌డౌన్ సడలింపు, బయట మాస్క్ తప్పనిసరి

    జర్మనీ మాస్క్

    ఫొటో సోర్స్, Reuters

    సోమవారం నుంచి జర్మనీలో బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, షాపుల్లో అందరూ మాస్కులు ధరించాలి.

    అయితే జర్మనీ 16 రాష్ట్రాల్లో వేరు వేరు చట్టాలు ఉన్నాయి. ఇవి బవేరియాలో అత్యంత కఠినంగా ఉన్నాయి. బెర్లిన్‌లో మాత్రం షాపుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదు.

    లాక్‌డౌన్‌ సడలించేందుకు అధికారుల జాగ్రత్తగా సన్నాహాలు చేస్తున్నారు.

    స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కానీ సామాజిక దూరం కఠినంగా పాటిస్తున్నారు.

  4. తప్పుడు సమాచారం ఆరోపణలను ఖండించిన చైనా

    చైనా ఖండన

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనావైరస్ గురించి చైనా తప్పుడు సమాచారం ఇచ్చిందనే ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ ఖండించింది.

    చైనా రహస్య ఆపరేషన్ చేస్తోంది అనడానికి కీలక ఆధారాలు ఉన్నాయని గత వారం యూరోపియన్ యూనియన్ ఒక నివేదికలో చెప్పింది.

    చైనా తమ దేశంలో కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి సంఖ్యను ఎప్పుడూ తగ్గించి చెబుతోందని బ్రిటన్, అమెరికా రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

    సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గాంగ్ షువాంగ్ తమను సమర్థించుకున్నారు. “ఏ వ్యక్తి, లేదా సంస్థ ద్వారా తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా వ్యాపింపజేయడానికి చైనా వ్యతిరేకం అన్నారు. చైనా తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం కాదు, దానికి మేమే బలయ్యాం” అని చెప్పారు.

  5. బ్రిటన్‌లో కరోనాతో చనిపోయిన వైద్య సిబ్బంది కోసం రేపు మౌనం

    మౌన నివాళి

    బ్రిటన్‌లో కరోనాతో మృతిచెందిన వైద్య సిబ్బందికి నిమిషం మౌనం

    బ్రిటన్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తూ చనిపోయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలను స్మరించుకుంటూ మంగళవారం దేశమంతటా ఒక్క నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఇందులో పాల్గొంటారు.

    మంగళవారం ఉదయం 11 గంటలకు ఒక్క నిమిషం పాటు మౌనం పాటిస్తామని, అందులో అన్ని ప్రభుత్వ విభాగాలు ఉంటాయని బ్రిటన్ ప్రధాని కార్యాలయం చెప్పింది.

    స్కాట్‌లాండ్‌కు చెందిన ఒక మంత్రి కూడా ఇందులో పాల్గొంటారు.

  6. తెలంగాణలో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదు

    తెలంగాణలో ఈరోజు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బయటపడ్డాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1003కు చేరింది.

    రాష్ట్రంలో మృతుల సంఖ్య 25. రెండు రోజులుగా కొత్తగా మరణాలు నమోదు కాలేదు.

    తెలంగాణలో ఈరోజు 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న కరోనా రోగుల సంఖ్య 332కు చేరింది.

    ప్రస్తుతం రాష్ట్రంలో 646 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి.

    తెలంగాణలో కేసులు

    ఫొటో సోర్స్, TS I&PR

  7. గుజరాత్‌లో కొత్తగా 247 పాజిటివ్ కేసులు నమోదు

    గత 24 గంటల్లో గుజరాత్‌లో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3548కి పెరిగింది.

    ఇప్పటివరకూ రాష్ట్రంలో 162 మంది చనిపోగా, 394 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. కేరళలో 13 కొత్త పాజిటివ్ కేసులు నమోదు

    కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 481కి చేరింది. 123 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఏఎన్ఐ చెప్పింది.

    రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. వీరిలో తమిళనాడు నుంచి తిరిగి వచ్చిన ఐదుగురు ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    తమిళనాడులో 52 కొత్త కేసులు

    తమిళనాడులో ఈరోజు కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1937కు చేరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  9. క్వారంటైన్ నుంచి విడుదలైన 11 మంది తబ్లీగీ సభ్యుల అరెస్ట్

    క్వారంటైన్ పూర్తి కావడంతో ఇండోనేషియాకు చెందిన 11 మంది తబ్లీగీ జమాత్ సభ్యులను ముంబై పోలీసులు ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారని ఏఎన్ఐ చెప్పింది.

    మొదట పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి, మరో పది మందిని క్వారంటైన్ చేశామని, క్వారంటైన్లో ఉన్న తర్వాత అతడికి కూడా నెగటివ్ వచ్చిందని పోలీసులు చెప్పారు.

    తబ్లీగీ జమాత్ సభ్యులు అందరినీ ఏప్రిల్ 28 వరకూ రిమాండుకు పంపుతున్నట్లు జోన్ 9 డీసీపీ ఏఎన్ఐకి చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ధారావిలో కొత్తగా 13 కరోనా కేసులు నమోదు

    ముంబయి ధారావి ప్రాంతంలో 13 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    దీంతో ఆ ప్రాంతంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 288కి పెరిగిందని ఏఎన్ఐ చెప్పింది.

    ధారావిలో ఇప్పటివరకూ 14 మంది చనిపోయారని బీఎంసీ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. భారత్‌లో గత 24 గంటల్లో 1,463 కొత్త కేసులు, 60 మరణాలు

    భారతదేశంలో గత 24 గంటల్లో 1,463 కొత్త కేసులు నమోదయ్యాయని, 60 మంది కోవిడ్ వ్యాధితో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఒకే రోజులో 60 మంది చనిపోవడమన్నది దేశంలో ఇదే మొదటిసారి.

    కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 28,380కి చేరుకుంది. వీరిలో 6,362 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

    మొత్తంగా మృతుల సంఖ్య 886కు పెరిగింది.

    ప్రస్తుతం 21,132 యాక్టివ్ కేసులకు చికిత్స అందుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. 'కరోనావైరస్ మన జీవితాల్లో భాగమైపోతుంది' - ఏపీ సీఎం జగన్

    జగన్

    ఫొటో సోర్స్, APCM/FACEBOOK

    ఏపీలో టెస్టింగ్ సామర్థ్యం పెంచామని, దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ అన్నారు.

    రాష్ట్ర ప్రజలన ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ ఆయన ఇంకా ఇలా అన్నారు:

    - ఏపీలో సగటున 1396 టెస్టులు చేస్తున్నాం ఏపీలో 9 వైరాలజీ ల్యాబ్స్ లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ 74551 పరీక్షలు చేశాం రాష్ట్రంలో 80 శాతం గ్రీన్ జోన్లోనే ఉంది.

    - ఈ నెలలో టెస్టింగ్ కెపాసిటీ పెంచుతున్నాం సామాన్యులకు కష్టం రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఎంత చేసినా వైరస్ ను పూర్తిగా కట్టడి చేయలేం.

    - కరోనా పూర్తిగా కనుమరుగయ్యే స్థితి ఎప్పటికీ ఉండదు. ప్రజలు కరోనా వచ్చినపుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, కాస్త మందులు తీసుకుంటే, అది నయం అయిపోతుంది.

    - కానీ, చాలామందికి అది వచ్చినట్టు కూడా తెలీని పరిస్థితి ఉంది. అలాంటి వారు 80 శాతం మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అంటే వాళ్లకు కరోనా లక్షణాలు కనిపించవు, అది ఉందని వారికే తెలీదు. మన ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 81 శాతం ఇళ్లలోనే ఉంటే నయమైపోయిన కరోనా కేసులు ఉన్నాయి, వాటిలో ఐసీయూ వరకూ వెళ్లేవి 4 శాతం. చనిపోయేవారు ప్రపంచంలో కేవలం 9.4 శాతం మాత్రమే ఉంది అని లెక్కలు చెబుతున్నాయి.

    - కరోనా వచ్చినంత మాత్రాన అదేదో అంటరాని జబ్బులా అనుకోకండి. ఆ భావన వదిలేయాలని కోరుతున్నాను.

    - కరోనా నాకు, మీకు వేరే ఎవరికైనా రావచ్చు. అది జ్వరం లాంటిదే. వచ్చినపుడు జాగ్రత్తలు తీసుకుని మందులు వేసుకోవాలి. 104కు ఫోన్ చేస్తే, డాక్టర్లు మీ ఇంటికే వచ్చి మందులు ఇస్తారు. చాలావరకూ ఇంట్లోనే నయం అయిపోయే పరిస్థితి ఉంటుంది.

    - ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. షుగర్, బీపీ, ఆస్తమా ఉన్నవారు, వృద్ధులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇతరులపై పెద్దగా ప్రభావం చూపడం లేదు అని తెలుస్తోంది. మీకు వచ్చినపుడు మీరే ముందుకొచ్చి చెప్పాలి. అలా చెబితే మిగతవారికి అది సోకకుండా ఉంటుంది.

  12. ఏపీలో కోవిడ్ బాధితుల్లో 61 శాతం 16-45 ఏళ్లవారే

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ బారిన పడుతున్నవారిలో 60 శాతం మందికి పైగా 16 నుంచి 45 ఏళ్ల వారే.

    బాధితుల్లో 15 ఏళ్లలోపు వారు 6.54 శాతం... అరవై ఏళ్లు పైబడినవారు 11.12 శాతం.. 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు 21.48 శాతం ఉన్నారు.

    వృద్ధులు ఎక్కువగా కోవిడ్-19 బారినపడే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నప్పటికీ ఏపీలో ఎక్కువగా పనిచేసే వయసులోని(16 నుంచి 45) వారే దీని బారిన పడుతున్నారు.

    దీంతో వయసుతో సంబంధం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని.. ఇళ్లలోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. కరోనా పాజిటివ్ వస్తే ఆ ఒక్కరినే హోం క్వారంటైన్ చేస్తాం.. ఇంకెవరినీ క్వారంటైన్ చేయం: మమతా బెనర్జీ

    పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కరోనావైరస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

    ఎవరికైనా కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధరణయితే ఆ వ్యక్తి ఇంట్లోనే క్వారంటైన్ కావొచ్చని చెప్పారు. ఒక్కరికి పాజిటివ్ నిర్ధరణయిందని లక్షలు లక్షల మందిని క్వారంటైన్ చేయబోమని.. ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయని ఆమె చెప్పారు.

    కేంద్రం అప్పటికప్పుడు ఉత్తర్వులిచ్చేస్తోందని.. రాష్ట్రాలతో సంప్రదించడం లేదని మమత ఆరోపించారు. రాష్ట్రాల పరిస్థితిని అడిగి తెలుసుకుంటే బాగుండేదన్నారామె.

    ‘‘లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని చెబుతున్న కేంద్రమే మరోవైపు అన్ని దుకాణాలూ తెరుచుకోవచ్చని చెబుతోంది. కేంద్రం చెబుతున్నదానికి, వారి ఆదేశాలకు పొంతన ఉండడం లేదు. మేమేం చేస్తాం?’’ అన్నారామె.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. కోవిడ్-19 టీకా తయారుచేసే పనిలో 6 భారతీయ కంపెనీలు

    టీకా

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌లో సుమారు ఆరు కంపెనీలు కోవిడ్-19 టీకాను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి.

    అందులో ఒకటి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అత్యధిక డోసుల టీకాల ఉత్పత్తి, అమ్మకాల ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఇది గుర్తింపు పొందింది.

    53 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ పుణెలోని రెండు ప్రధాన కేంద్రాల నుంచి సుమారు 150 కోట్ల డోసుల టీకాలను తయారు చేస్తోంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్‌‌లోనూ, అలాగే చెక్ రిపబ్లిక్‌లోనూ మరో రెండు చిన్న ప్లాంట్లు ఉన్నాయి. సుమారు 7 వేల మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు.

    165 దేశాలకు దాదాపు 20 రకాల వ్యాక్సీన్లను ఈ సంస్థ సరఫరా చేస్తోంది. సుమారు 80 శాతం వ్యాక్సీన్లను అతి తక్కువ ధరల్లోనే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది.

  15. అవసరమైన అందరికీ ఆహారం, ఆశ్రయం కల్పించాలని.. కనీస అవసరాలు తీర్చాలని కేంద్రానికి సూచించాం: సీజేఐ

    లాక్‌డౌన్ వేళ అవసరమైనవారికి ఆహారం, ఆశ్రయం కల్పించాలని.. సైకలాజికల్ కౌన్సెలింగ్ అందించాలని, ఇతర కనీస అవసరాలూ తీర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే తెలిపారు.

    ఈ సంక్షోభ సమయంలో న్యాయవ్యవస్థ తాను చేయగలిగినంత చేస్తోందని చెప్పారు.

    కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవస్థలూ సామరస్యంగా పనిచేస్తూ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నారు.

    కోర్టులపై ఒత్తిడి తగ్గిందని.. వ్యాజ్యాలు తగ్గాయని చెప్పిన ఆయన కేసులు మాత్రం పెరిగాయన్నారు.

    2020 జనవరిలో సుప్రీంకోర్టులో రోజుకు 205 కేసులు దాఖలైతే ఏప్రిల్ నెలలో ఈఫైలింగ్ ద్వారా సగటున రోజుకు 305 కేసులు దాఖలు చేస్తున్నారన్నారు.

    లాక్‌డౌన్ సమయంలో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. నేరాల రేటు తగ్గిందని.. దొంగలు నేరాలు చేయడం లేదని.. అలాగే ఉల్లంఘనలపై పోలీసు చర్యలూ తగ్గాయని సీజేఐ చెప్పారు.

    మానవ జీవితాలు అమూల్యమైనవని చెప్పిన ఆయన దానికి ముప్పు ఏర్పడితే కార్యనిర్వాహక వ్యవస్థ అంగీకరించదని..

    ఒకవేళ అలా జరిగితే కోర్టు జోక్యం చేసుకుని ప్రజల హక్కులను కాపాడుతుందని చెప్పారు. తాము విశ్రాంతి తీసుకోవడం లేదని.. పనిచేస్తున్నామని, ఎన్నో కేసులు పరిష్కరిస్తున్నామని చెప్పారు. న్యాయ కాలెండర్ ప్రకారం ఏడాదిలో 210 రోజులు పనిచేస్తామన్నారు.

    జస్టిస్ బాబ్డే

    ఫొటో సోర్స్, Getty Images

  16. ఆ రెండు సంస్థల నుంచి కొనుగోలు చేసి కిట్లతో టెస్టులు చేయొద్దు: ఐసీఎంఆర్

    గుయాంగ్‌ఝో వాండ్ఫో బయోటెక్, జుహాయి లివ్జాన్ డయాగ్నిస్టిక్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన కరోనా పరీక్షల కిట్లను వాడడం తక్షణం ఆపేయాలని ఐసీఎంఆర్ సూచించింది.

    ఆ కిట్లను సరఫరాదారులకు తిప్పిపంపించాలని చెప్పింది.

    ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ ఐసీఎంఆర్ లేఖ రాసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. దేశంలోని కోవిడ్ బాధితుల్లో 22.17 శాతం మంది కోలుకున్నారు: కేంద్రం

    లవ్ అగర్వాల్

    ఫొటో సోర్స్, ANI

    దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 27,892కి పెరిగాయని.. ఇందులో గత 24 గంటల్లో 1,396 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

    గత 24 గంటల్లో 381 మంది కోలుకున్నారని, దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,184కి పెరిగిందని.. ప్రస్తుతం 20,835 యాక్టివ్ కేసులు ఉన్నాయని అగర్వాల్ చెప్పారు.

    మొత్తం బాధితుల్లో 22.17 శాతం కోలుకున్నారని చెప్పారు.

    గతంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులున్న జిల్లాల్లోని 16 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదన్నారు.

    85 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని చెప్పారు.

    కోలుకున్న రోగుల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని తెలుసుకోవాలని.. నిజానికి వారు ప్లాస్మాథెరపీలో దాతలుగా ఉపయోగపడుతూ మరికొందరు రోగులు కోలుకునేందుకు కారణమవుతారని చెప్పారు.

    ఎంపవర్‌మెంట్ గ్రూప్ 5 కన్వీనర్ పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ.. ఆహారం, మందుల రవాణా మరింత పెరిగిందని చెప్పారు.

    మార్చి 30 నాటికి 67 శాతంగా ఉన్న రైలు రవాణా ఏప్రిల్ 25కి 76 శాతానికి పెరిగిందన్నారు.

  18. హాస్పిటల్ నుంచి దూకి కోవిడ్ పేషెంట్ ఆత్మహత్య

    కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌ నుంచి కోవిడ్ రోగి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

    సోమవారం ఉదయం 8.30 ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని. హాస్పిటల్ నాలుగు లేదా అయిదో అంతస్తు నుంచి రోగి దూకారని బెంగళూరు సౌత్ డీసీపీ రోహిణి తెలిపారు.

    ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. జూన్, జులైలో కోవిడ్-19 కేసులు భారీగా పెరగొచ్చు: ప్రధాని మోదీ

    జూన్, జులై నెలల్లో కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల ఉండే అవకాశం ఉందని ప్రధాని మోదీ చెప్పారని.. అందుకు తగ్గట్లుగా సిద్ధం కావాలని చెప్పారని చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ వెల్లడించారు.

    రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో కలిసి సింగ్ దేవ్‌ కూడా పాల్గొన్నారు.