రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఇండోనేషియాలోని ఆసే నగరంలో ఉన్న అతి పెద్ద మసీదుకు ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు.
గురువారం రాత్రి జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో
జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రార్ధలనకు కోసం మసీదుకు వచ్చిన వారిలో చాలామంది మాస్కులు ధరించారు.
కానీ, దగ్గర దగ్గరగా ఉండే ప్రార్ధనలు చేశారు. భౌతిక దూరంపై ఇండోనేషియా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను వారు ఏమాత్రం పట్టించుకోలేదు.‘‘కరోనా వైరస్ తో చచ్చిపోతానేమోనన్న భయం నాకు ఉంది. కానీ ఆ భయం నన్ను ప్రార్ధన చేయకుండా ఆపలేదు. చేతులు కడుక్కుంటూ, మాస్కులు ధరిస్తూ వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండటం ఇక్కడ ముఖ్యం’’ అని పుత్రి సారా బీబీసీతో అన్నారు .
అయితే, ఇంకో భక్తుడు వాహ్యుక మాత్రం తాను బలవంతంగా ప్రార్ధనలకు వచ్చినట్లు వెల్లడించాడు. తన పిల్లలు ప్రార్ధనలకకు వెళ్లాల్సిందిగా తనను బలవంతపెట్టారని అన్నాడు.
‘‘ఇలా సామూహికంగా ప్రార్ధన చేయాలంటే భయపడ్డాను. అందుకే, మిగతా వారికి కాస్త దూరంగా ఉండి ప్రార్ధన చేశాను’’ అని చెప్పారు వాహ్యుక.
‘‘ప్రభుత్వ హెచ్చరికలకన్నా ఫత్వాలకు, మత పెద్దల సూచనలకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ’’ అని ఆసే నగరంలోని సియా కౌలా యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్ మారిని క్రిస్టియాని వ్యాఖ్యానించారు.
ఇండోనేషియాలో ఇస్లామిక్ షరియా చట్టం అమలులో ఉన్న ఒకే ఒక్క నగరం ఆసే. ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ నగరంలో తరచూ కొరడా దెబ్బల శిక్షలు అమలవుతుంటాయి. గత మంగళవారం ఆరుగురికి ఈ శిక్ష అమలు చేయగా...అందులో ఒకే ఒక్క వ్యక్తి మాస్క్ ధరించాడు.