బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి స్వాగతం
ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు
- ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనావైరస్ బారినపడ్డవారి సంఖ్య 26 లక్షలు దాటింది.
- అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతించే గ్రీన్ కార్డుల జారీని 60 రోజుల పాటు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులను పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు.
- భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 21 వేలు దాటింది. ఇప్పటి వరకూ 681 మంది చనిపోయారు.
- కరోనావైరస్ మరణాలను అధికారికంగా ప్రకటించడాన్ని చైనా నిలిపివేసింది. గత వారం రోజుల అధికారిక గణాంకాలను పరిశీలిస్తే చైనాలో ఈ వైరస్ బారిన పడినవారు ఒక్కరూ చనిపోలేదు.
- ఫేస్ మాస్కులను ఉపయోగించడాన్ని జర్మనీ తప్పనిసరి చేసింది.
