కరోనావైరస్: భారత్‌లో 20 వేలు దాటిన మొత్తం కేసులు, 652 మంది మృతి; ఏపీలో 819, తెలంగాణలో 943 మందికి పాజిటివ్

భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471కి చేరింది. కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి సంఖ్య 652కు చేరింది. వీరిలో 3959 మంది ఇప్పటివరకూ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో 24 మంది, తెలంగాణలో 24 మంది మరణించారు.

లైవ్ కవరేజీ

  1. కరోనావైరస్‌ LIVE అప్‌డేట్స్

    బీబీసీ తెలుగు ప్రతిరోజూ కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీని నిర్వహిస్తోంది.

    ఏప్రిల్ 22వ తేదీ లైవ్ అప్‌డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

  2. ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్, 26 లక్షలకు చేరువగా కరోనా కేసుల సంఖ్య

    ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26 లక్షలకు చేరుతోంది.

    జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25,93,129 కరోనా పాజిటివ్ కేసులు ధ్రువీకరించారు. ఇప్పటివరకూ 1,79,725 మంది చనిపోయారు.

    • అమెరికాలో అత్యధికంగా 8,26,184 మంది కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారికి 45 వేల మందికి పైగా మృతి చెందారు.
    • స్పెయిన్‌లో కరోనా కేసుల సంఖ్య 2,08,389కు చేరింది. మృతుల సంఖ్య 21,717కు చేరుకుంది.
    • మూడో స్థానంలో ఉన్న ఇటలీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 1,83,957కు చేరింది. ఇప్పటివరకూ 24,648 మంది చనిపోయారు.
    • కరోనా మహమ్మారి బయటపడ్డ చైనాలో ఈ కేసుల సంఖ్య 83,868 కేసులకు చేరింది. దేశంలో 4636 మంది చనిపోయారు.
    • భారత్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 15869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 3959 చికిత్స పూర్తై డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ 652 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య
    • తెలంగాణలో బుధవారం నమోదైన 15 పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 725కు చేరుకుంది. ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరింది.
    • ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నమోదైన 56 కొత్త పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 669కి చేరింది. గుంటూరు జిల్లాలో ఇద్దరి మృతితో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరింది.
    కరోనావైరస్
  3. దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ ఉల్లంఘించిన మంత్రికి జరిమానా

    దక్షిణాఫ్రికా మంత్రికి జరిమానా

    ఫొటో సోర్స్, Getty Images

    దక్షిణాఫ్రికా సమాచార శాఖ మంత్రి స్టెలా ఎందాబెనీ తను లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించినట్లు అంగీకరించారు.

    దీంతో, ఒక కోర్టు ఆమెకు 1000 ర్యాండ్స్ అంటే 4 వేల రూపాయల జరిమానా విధించింది.

    అంతకు ముందు దేశ అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా మంత్రికి సమన్లు జారీ చేశారు. రెండు నెలలు ఆమెను సెలవుపై పంపారు.

    లాక్‌డౌన్ సమయంలో తన మాజీ సహచరుడితో లంచ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో రావడంతో సమాచార శాఖ మంత్రి చిక్కుల్లో పడ్డారు.

    తర్వాత లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించినందుకు మంత్రి బహిరంగ క్షమాపణలు కోరారు.

  4. కర్ణాటకలో అర్థరాత్రి నుంచి పరిమితంగా లాక్‌డౌన్‌ సడలింపు

    ఇమ్రాన్ ఖురేషీ

    బీబీసీ కోసం

    కర్ణాటక ప్రభుత్వం ఈరోజు(బుధవారం) అర్థరాత్రి నుంచి హాట్‌స్పాట్, సీలింగ్ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ, మత్స్య, పశుపోషణ, నిర్మాణ, ఈ-కామర్స్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.

    నిత్యావసర వస్తువుల సరఫరా కొనసాగించడానికి వాహనాల రాకపోకలకు కూడా అనుమతి ఇచ్చింది.

    ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు సాధారణంగా నడుస్తాయి.

    కానీ బస్సులు, మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు ఉండవు.

    ఐటీ కంపెనీలు కూడా అవసరమైన ఉద్యోగులతో పని చేసుకోడానికి అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వం వారిని వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని సూచించింది.

    కర్ణాటకలో ఇప్పటివరకూ కరోనాతో 17 మంది మృతిచెందారు. బుధవారం మరో 9 కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ రోగుల సంఖ్య 427కు చేరింది.

  5. తెలంగాణలో ఈరోజు 15 కొత్త కరోనా కేసులు నమోదు

    తెలంగాణలో ఈరోజు 15 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 725కు చేరుకుంది.

    ఈరోజు కోవిడ్-19 రోగి ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరింది.

    ఈరోజు ఆస్పత్రుల నుంచి ఎవరూ డిశ్చార్జ్ కాలేదు.

    ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 10 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో 3, గద్వాల జిల్లాలో 2 కేసులు బయటపడ్డాయి.

    ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన 194 మందితో కలిపి రాష్ట్రంలో మొత్తం 943 కరోనా కేసులు నమోదయ్యాయి.

    తెలంగాణ కేసులు

    ఫొటో సోర్స్, TS I&PR

  6. తిరుపతిలో 10 మంది కరోనా రోగుల డిశ్చార్జ్

    తిరుపతి కేసులు డిశ్చార్జ్

    ఫొటో సోర్స్, I&PR Tirupati

    తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్యశాల(స్టేట్ కోవిడ్ ఆస్పత్రి)లో బుధవారం 10 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

    వీరిలో తిరుపతి(4), రేణిగుంట(2),కడప(3),నగరి(1) రోగులు ఉన్నారు.

    వీరికి మరో 28 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

    ప్రస్తుతం మరో 20 మంది కరోనా పాజిటివ్ రోగులు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    డిశ్చార్జ్ అయిన రోగులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

  7. 3 జిల్లాల్లో ఐసీయూ పడకలు పెంచాలని సీఎం జగన్ ఆదేశం

    జగన్ సమీక్ష

    ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

    అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐసీయూ పడకల సంఖ్యను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

    రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణకు చేపడుతున్నచర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

    ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు నిర్వహించామని, మంగళవారం ఒక్క రోజే 5,757 పరీక్షలు చేశామని, ట్రూనాట్ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిందని అధికారులు సీఎంకు చెప్పారు.

    కొరియా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని తెలిపారు.

    వీలైనన్ని పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

    రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించిన నిబంధనలను పాటించాలని, గ్రీన్ క్లస్టర్లలో మాత్రం నిబంధనల మేరకు కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని ఆదేశించారు.

    జగన్ క్యాంప్ కార్యాలయం

    ఫొటో సోర్స్, bbc

    కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌, గ్రీన్‌ ఓసియన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌ ఇన్‌ఫ్రారెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌ లు తయారు చేసింది.

    ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించారు.

  8. రష్యా సరిహద్దుల్లోని చైనా నగరంలో లాక్‌డౌన్

    చైనా లాక్ డౌన్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా సరిహద్దుల్లో ఉన్న చైనా నగరం హర్బిన్‌లోని అన్ని నివాస ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల్లో లాక్‌డౌన్ విధించారని నేషనల్ గ్లోబల్ టైమ్స్ పత్రిక చెప్పింది.

    కోవిడ్-19 బయటపడిన సమయంలో వుహాన్ నగరంలోలాగే కోటి జనాభా ఉన్న హర్బిన్ నగరంలో ఈరోజు కఠిన ఆంక్షలు అమలు చేశారు.

    స్థానికేతరులను, స్థానిక నంబర్ ప్లేట్స్ లేని వాహనాలను నగరంలో ప్రవేశించకుండా అధికారులు అడ్డుకున్నారని స్థానిక మీడియా చెప్పింది.

    ఇక్కడ బయటికి వెళ్లేవారికి మాస్క్ తప్పనిసరి చేశారు. వైద్య పరీక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు.

    హర్బిన్‌లో ఇప్పటివరకూ 52 కరోనా కేసులు బయటపడ్డాయి.

  9. భారత్‌లో 20 వేలు దాటిన కరోనా కేసులు, మృతుల సంఖ్య 652

    భారత్‌లో 20 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, మొత్తం 652 మంది మృతి

    భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471కి చేరింది.

    కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి సంఖ్య 652కు చేరింది.

    వీరిలో 3959 మంది ఇప్పటివరకూ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.

    తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5221కి చేరింది. రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా 251 మంది చనిపోయారు.

    భారత్ కేసులు పెరిగాయి.

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీని దాటిన గుజరాత్

    అటు పాజిటివ్ కేసుల సంఖ్య గుజరాత్ దిల్లీని దాటిపోయింది. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2272కు చేరింది. దిల్లీలో 2156 మంది కోవిడ్ పాజిటివ్ రోగులు ఉన్నారు.

    మృతుల గణాంకాల్లో కూడా గుజరాత్ దిల్లీని మించిపోయింది. గుజరాత్‌లో కోవిడ్-19 వల్ల మొత్తం 95 మంది చనిపోగా, దిల్లీలో మృతుల సంఖ్య 47.

    మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 1592కు చేరగా, ఇప్పటివరకూ ఇక్కడ 80 మంది చనిపోయారు.

  10. అమెరికాలో కరోనా ‘సెకండ్ వేవ్’ మరింత తీవ్రంగా ఉంటుంది

    అమెరికా సెకండ్ వేవ్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలో కరోనా వైరస్ మరోసారి ప్రభావం చూపవచ్చని, ప్రస్తుతం ఉన్న దానితో పోలిస్తే అది మరింత తీవ్రంగా ఉంటుందని ఆ దేశ ఉన్నత స్థాయి అధికారి హెచ్చరించారు.

    ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని. ఫ్లూ వాతావరణం ఉన్న సమయంలో కరోనా రెండోసారి విరుచుకుపడవచ్చని 'సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్'(సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్స్ చెప్పారు.

    అమెరికా ఆరోగ్య సేవలపై దానివల్ల ఎంత ఒత్తిడి పడుతుందో, దానిని ఊహించడం కూడా కష్టమేనని ఆయన చెప్పారు.

    జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా వల్ల ఇప్పటివరకూ 45 వేల మందికి పైగా మృతి చెందారు.

  11. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు దాటిన కరోనా కేసులు

    పెరిగిన కేసులు

    జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకరించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. ఇప్పటివరకూ 1,77,000 మందికి పైగా మృతిచెందారు.

    • కోవిడ్-19తో పోరాడుతాయని భావిస్తున్న టీకాలపై జర్మనీ, బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
    • కరోనా మహమ్మారి వ్యాపిస్తుండండతో నైజీరియా అంతటా ఉన్న కోరానిక్ స్కూళ్లలోని 90 లక్షల మంది విద్యార్థులను వారి ఇళ్లకు పంపించేశారు.
    • మొరాకోలో గత 24 గంటల్లో కరోనా లాక్‌డౌన్ ఉల్లంఘించిన 3 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారని స్థానిక మీడియా చెప్పింది.
    • స్పెయిన్‌లోని వాలెన్షియా ప్రావిన్సులోని బునోల్ పట్టణంలో టమాటాలు విసురుకునే పండగను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 1957 నుంచీ జరుగుతున్న ఈ సంబరాలను కరోనా వల్ల ఈ ఏడాది మొట్టమొదటిసారి వాయిదా వేశారు.
  12. ఈ మధ్య ఎంత బాగుందో కదా?

    ఎర్త్ డే
  13. ఈరోజు రానున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోవిడ్-19 పరీక్ష ఫలితాలు

    ఇమ్రాన్ కరోనా పరీక్షలు

    ఫొటో సోర్స్, Reuters

    పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన కోవిడ్-19 టెస్ట్ ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.

    అవి ఈరోజు(బుధవారం) వస్తాయని స్థానిక మీడియా చెబుతోంది.

    ఇమ్రాన్ ఖాన్ గత వారం ఒక చారిటీ సంస్థ అధ్యక్షుడు ఫైజల్ ఎధీని కలిశారు. తర్వాత ఫైజల్‌కు కరోనా ఉన్నట్టు పరీక్షల్లో బయటపడింది.

    ఫైజల్ ఎధీ ప్రధానమంత్రి సహాయ నిధి కోసం విరాళాలు ఇవ్వడానికి వచ్చిన సమయంలో ఆయనగానీ, ఇమ్రాన్ ఖాన్ గానీ మాస్క్ ధరించలేదు.

    ఫైజల్‌కు కరోనా పాజిటివ్ రావడంతో, మంగళవారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కూడా కరోనా టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చారు.

    ఇమ్రాన్ ఖాన్ గత కొన్నిరోజులుగా మంగళవారం తన క్యాబినెట్ సమావేశంతోపాటూ ఎన్నో సమావేశాల్లో పొల్గొన్నారు.

    పాకిస్తాన్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 10 వేలకు పైగానే ఉంది. ఇక్కడ కోవిడ్-19తో మొత్తం 212 మంది మృతి చెందారు.

  14. వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష: కేంద్రం

    కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలని చూస్తున్న వైద్య సిబ్బందిపై దాడులకు, హింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది.

    దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తెచ్చామని, రాష్ట్రపతి ఆమోదం తర్వాత దానిని అమలు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు.

    క్యాబినెట్ సమావేశం తర్వాత ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆయన మీడియాకు చెప్పారు.

    వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం దోషులుగా తేలినవారికి ఆరు నెలల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు అని చెప్పారు.

    "వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడితే నిందితులకు 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. వారికి లక్ష నుంచి 5 లక్షల జరిమానా విధిస్తారు" అని మంత్రి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    'ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్, 1897'కు సవరణలు చేసి, చట్టం తీసుకొస్తామని ఆయన చెప్పారు.

    "అలాంటి నేరం చేసినవారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, నిందితులకు 3 నెలల నుంచి 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష, 50 వేల నుంచి 2 లక్షల వరకూ జరిమానా విధిస్తాం" అని ప్రకాశ్ జావదేకర్ చెప్పారు.

    వైద్య సిబ్బంది వాహనాలు, క్లినిక్, ఆస్తులకు ఏదైనా నష్టం కలిగిస్తే, ధ్వంసమైన ఆస్తులకు పరిహారంగా మార్కెట్ విలువకు రెట్టింపు మొత్తాన్ని నిందితుల నుంచి వసూలు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  15. నేపాల్‌కు 23 టన్నుల మందులు పంపిన భారత్

    కరోనా సంక్షోభంలో భారత్ నేపాల్‌కు 23 టన్నుల మందులు పంపిందని ఏఎన్ఐ చెప్పింది.

    కరోనా కష్టకాలంలో తమకు సాయం అందించినందుకునేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

    భారత్ కరోనా మహమ్మారితో పోరాడేందుకు మాకు 23 టన్నుల అత్యవసర మందులను పంపింది అని ట్వీట్ చేశారు.

    ఈ మందులను నేపాల్‌లోని భారత రాయబారి ఈరోజు ఆ దేశ ఆరోగ్య శాఖకు అప్పగించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్న మిల్కా సింగ్ కుమార్తె

    భారత ఒలింపిక్ క్రీడాకారుడు మిల్కాసింగ్ అమెరికాలో కోవిడ్ పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తన కుమార్తె మోనా మిల్కా సింగ్ గురించి ట్వీట్ చేశారని ఏఎన్ఐ చెప్పింది.

    అమెరికాలోని ఒక ఆస్పత్రిలో తన కుమార్తె విధులు నిర్వహిస్తోందని ఆయన అందులో చెప్పారు.

    తమకు ఆమె గురించి ఆందోళనగా ఉందని, కానీ ఆమె మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాకు చెబుతోందని ట్వీట్ చేశారు.

    తన కుమార్తెను చూసి తాము గర్వపడుతున్నామని తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. స్పెయిన్‌లో మే వరకూ కొనసాగనున్న లాక్‌డౌన్

    స్పెయిన్ లాక్‌డౌన్

    ఫొటో సోర్స్, Getty Images

    స్పెయిన్‌లో మే ద్వితీయార్థంలో లాక్‌డౌన్ ఎత్తివేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ చెప్పారు.

    పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడిన ప్రధాని ఆంక్షలను మెల్లమెల్లగా తొలగిస్తామని చెప్పారు.

    దేశంలో అమలు అవుతున్న అత్యవసర స్థితిని ప్రధానమంత్రి మే 9 వరకూ పొడిగించే ప్రకటన కూడా చేస్తారని భావిస్తున్నారు.

    స్పెయిన్ మార్చి 14న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుచేసింది. అత్యధిక కరోనా పాజిటివ్ కేసుల్లో స్పెయిన్ అమెరికా తర్వాత స్థానంలో ఉంది.

  18. డాక్టర్ల భద్రతపై కేంద్రం భరోసా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ భారత మెడికల్ అసోసియేషన్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో వైద్యుల భద్రతపై వారికి పూర్తి భరోసా ఇచ్చారు.

    ప్రతీకాత్మక నిరసనలు కూడా చేయవద్దని ఇద్దరు మంత్రులూ వైద్యులను కోరారు. కరోనాతో చేస్తున్న ఈ యుద్ధంలో ప్రభుత్వం వారి వెన్నంటి ఉంటుందని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    నిరసనల ప్రస్తావన వెనక్కు తీసుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్

    ఏప్రిల్ 22న వైద్యులతో నిరసన ప్రదర్శనలకు దిగాలనుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

    హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడంతో వారు ఈ నిర్ణయంతీసుకున్నారు.

    కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో వైద్య సిబ్బంది భద్రతపై హోంమంత్రి పూర్తి భరోసా ఇచ్చినట్లు ఐఎంఏ చెబుతోంది.

  19. కరోనావైరస్: #EarthDay2020 ప్రధాని మోదీ ఏం చెప్పారు?

    #EarthDay2020 సందర్భంగా ప్రధానమంత్రి భూమికి కృతజ్ఞతలు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. కరోనావైరస్ – చైనా, జపాన్ అప్‌డేట్

    చైనాలో కొత్త కేసులు

    ఫొటో సోర్స్, Getty Images

    చైనాలో బయట నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మంగళవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 23 కేసులు బయట నుంచి తిరిగి వచ్చినవారు కాగా,. మిగతా 7 కేసులు స్థానికులవి. సోమవారం బయట నుంచి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు.

    న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వివరాల ప్రకారం జపాన్ నాగసాకి ప్రాంతంలో ఇటలీకి చెందిన ఒక క్రూయిజ్ నౌకలో 33 కరోనా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ షిప్ రిపేర్ల కోసం నాగసాకి తీరానికి వచ్చింది. అటు స్థానిక మీడియా కోస్టా అట్లాంటిక్ షిప్‌లో 623 క్రూ ఉన్నారని, వీరిలో పర్యాటకులు ఎవరూ లేరని చెప్పింది.