You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 1,62,070.. భారత్‌లో 519 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 23 లక్షలు దాటింది. లక్షా 60వేల మందికి పైగా దీని బారినపడి మరణించారు. 5.92 లక్షలమంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయితే అమెరికాలో మాత్రం వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకూ 7.32 లక్షలమందికి ఈ వైరస్ సోకగా 38వేలకు పైగా ప్రజలు ప్రాణాలు విడిచారు.

లైవ్ కవరేజీ

  1. అదే నిజమైతే తీవ్ర పరిణామాలు: చైనాకు ట్రంప్ హెచ్చరిక

    అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చైనాను మరోసారి హెచ్చరించారు. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచమంతటికీ విస్తరించడానికి వాళ్లదే బాధ్యత అని తెలిస్తే అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోకక తప్పదన్నారు.

    శనివారం శ్వేత సౌధంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వైరస్ విషయంలో బీజింగ్ సరిగ్గా వ్యవహరింలేదని మరో సారి ఆరోపించారు. చైనా నిర్లక్ష్యం వల్ల యావత్ ప్రపంచం బాధపడుతోందని అన్నారు.

    వైరస్ వూహాన్లో పుట్టినందున ఈ పరిణామాలకు చైనాయే బాధ్యత వహించాలా అన్న ప్రశ్నకు ఆయన "ఒక వాళ్లు కావాలనే ఏదైనా చేస్తే అందుకు కచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సిందే."అని సమాధానం ఇచ్చారు.

    వైరస్‌ను వ్యాప్తి కాకుండా అడ్డుకోవడంలో విఫలం కావడానికి, ఉద్ధేశపూర్వకంగా చెయ్యడానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ప్రస్తుతానికి మొత్తం పరిణామాలపై వాళ్లు విచారణ జరుపుతున్నారని, ఒక వేళ అటువంటి పరిస్థితే వస్తే అమెరికా తరపు నుంచి కూడా విచారణ జరుపుతామని ట్రంప్ స్పష్టం చేశారు.

  2. ఆగ్రాలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు

    ఆగ్రాలో కొత్తగా 45 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. తాజా కేసులతో ఆగ్రాలో బాధితుల సంఖ్య 241కి చేరింది.

  3. 44 రోజుల తర్వాత బాహ్య ప్రపంచాన్ని చూడనున్న స్పెయిన్ చిన్నారులు

    కరోనావైరస్ దెబ్బకు మార్చి 14 నుంచి స్పెయిన్‌లో గది నాలుగు గోడలకే పరిమితమైన చిన్నారులకు ఆ దేశ ప్రధాని పెడ్రో శాంచెజ్ చల్లని వార్త చెప్పారు. ఈ నెల 27న ఒక్క రోజు ఆ నిబంధలను సడలిస్తున్నామని చిన్నారులు బయటకు రావచ్చని ప్రకటించారు.

    మార్చి 14 తర్వాత చిన్నారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గదుల్లోంచి బయటకు తీసుకురావద్దంటూ స్పెయిన్ కఠినమైన ఆంక్షల్ని విధించింది. దీంతో వారు గడచిన 6 వారాలుగా పూర్తిగా గదులకే పరిమితమైపోయారు. ఇటీవల బార్సిలోనా మేయర్ ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అడ కలౌ స్వయంగా పిల్లలకు కాస్త తాజా గాలి పీల్చుకునే అవకాశమైనా ఇవ్వాలని కోరారు.

    మరోవైపు స్పెయిన్‌లో మే9 వరకు అత్యవసర పరిస్థితిని పొడిగించమని పార్లమెంట్‌ను కోరనున్నట్టు శాంచెజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఆ దేశంలో 2 లక్షలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 20 వేల మందికిపై గా ప్రాణాలు కోల్పోయారు. ఇక పిల్లలకు సడలింపులు ఇచ్చినా వారు బయటకు వచ్చేందుకు వీలు లేదు. కేవలం ఇంటి పరిసరాలలో మాత్రమే ఉండాలి.

  4. 24 గంటల్లో 1891 అమెరికన్లు మృతి

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో 1891 మంది మృతి చెందారని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

  5. కొన్ని రాష్ట్రాల్లో తొలి విడత ఆంక్షల సడలింపు మొదలుకానుంది-ట్రంప్

    అమెరికాలో అత్యంత సురక్షిత పరిస్థితుల నడుమ తొలి విడత లాక్ డౌన్ సడలింపులను మొదలుపెట్టేందుకు రాష్ట్రాలు సిద్ధమయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు రెండు పార్టీలు అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారని ఆయన తెలిపారు.

    టెక్సాస్, రొమాంట్‌లలో ఏప్రిల్ 20 నుంచి కొన్ని రకాల వ్యాపారాలు మొదలవుతాయని, ఏప్రిల్ 24 నుంచి మోంటనాలో ఆంక్షల సడలింపు మొదలవుతుందని అన్నారు.

    అలాగే ఒహియో, నార్త్ డకొట, ఐడో ప్రాంతాల్లో మే1 నుంచి సాధారణ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ట్రంప్ సూచించారు.

  6. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన సమాచారం..

    ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 23 లక్షలు దాటింది. 1,59,500 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 6 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

    అమెరికాలో ప్రాణనష్టం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ 38,664 మంది మరణించారు. కేసుల సంఖ్య 7,32,197.

    స్పెయిన్‌లో మృతుల సంఖ్య 20 వేలు దాటింది. ఇటలీలో 23 వేల మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 19వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

    భారత్‌లో 14,792 కేసులు నమోదయ్యాయి. 488 మంది మృతి చెందారు.

    తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 809 కాగా 18 మంది మరణించారు.

    ఏపీలో మొత్తం 603 కేసులు నమోదు కాగా 16 మంది మరణించారు.