కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన సమాచారం..
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మృతుల సంఖ్య లక్షా 34వేలు దాటింది. 5 లక్షలకు పైగా రోగులు కోవిడ్-19 బారినుంచి కోలుకున్నారు.
అమెరికాలో ఇప్పటివరకూ 6.37 లక్షల మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. 28,300 మంది మృతి చెందారు. 52వేల మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఇటలీ, స్పెయిన్‌లలో కూడా వ్యాధి విజృంభిస్తోంది. ఇటలీలో 21వేలమంది చనిపోగా, స్పెయిన్‌లో 18వేలమంది మరణించారు.
భారత్‌లో కేసుల సంఖ్య 12వేలకు దగ్గరలో ఉంది. ఇప్పటివరకూ 382మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 525 కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం 491 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 644కు చేరింది. ఏపీలో కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి. దాంతో, రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 525కు పెరిగింది.