ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. తెలంగాణ: 'ఆర్టీసీ సమ్మె విరమణ, శనివారం నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు'

  2. రాఘవ్ చడ్డా: సామాన్యుల కోసమంటూ ఇటీవల రాజ్యసభలో అనేక ప్రశ్నలు లేవనెత్తిన ఈ నేత బీజేపీలో చేరుతూ ఏం చెప్పారు?

  3. ‘ఫ్యాట్‌ జైల్’: ఊబకాయాన్ని తగ్గిస్తామని చెప్పే ఈ కేంద్రాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి? నిపుణుల ఆందోళన ఏంటి?

  4. బల్లులంటే మనుషులకు ఎందుకు భయం, అవి లేకపోతే ఏమవుతుంది?

  5. అనంతపురంలో దళితుడిని ఎస్సై కొడుతున్నట్లుగా వీడియో వైరల్.. అక్కడ అసలు ఏం జరిగింది?

  6. వాలా-2 మూవీ రివ్యూ: ‘నవ్వుతూ చూస్తాం.. బరువుగా బయటకొస్తాం’

  7. భారత్‌కు మద్దతుగా ఇరాన్, ట్రంప్ వివాదాస్పద పోస్ట్‌పై తీవ్ర ప్రతిస్పందన

  8. మటన్ లివర్ తింటే మన లివర్‌కు మంచిదా? ఎవరు తినకూడదు?

  9. బెంగళూరు: ప్రియుడిని BDSM సెక్స్ కోసమని పిలిచి ప్రియురాలు చంపేసిందా?

  10. 'భూతల నరకకూపం': భారత్‌ గురించి వివాదాస్పద పోస్ట్ షేర్ చేసిన ట్రంప్, ఇండియా ఏమందంటే..

  11. తమిళనాడులో 84.60, పశ్చిమ బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

    తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌లో భాగంగా 152 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది.

    ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో 84.60 శాతం, బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్ నమోదైంది.

    పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.

    ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

  12. టిక్‌టాక్ స్టార్, సింగర్ డేవిడ్ కారు డిక్కీలో 14 ఏళ్ల బాలిక శవం, అసలేం జరిగిందంటే..

  13. మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుల విడుదల - దర్యాప్తు సంస్థలు భిన్నమైన రిపోర్టులు ఇవ్వడంపై బాంబే హైకోర్టు ఏమన్నది?

  14. పిఠాపురం: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏంటి?

  15. ఒంటిగంట సమయానికి తమిళనాడులో 56.81, పశ్చిమ బెంగాల్‌లో 62.18 శాతం ఓటింగ్

    ఎన్నికలు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, చెన్నైలో ఓట్లు వేసేందుకు వచ్చిన నూతన వధూవరుల జంట

    పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు, తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.

    ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట వరకు బెంగాల్‌లో 62.18 శాతం, తమిళనాడులో 56.81 శాతం ఓటింగ్ నమోదైంది.

    బెంగాల్‌లో కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా, తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా డోమ్‌కల్‌లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఝర్‌గ్రామ్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలోకి అడవి ఏనుగు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

  16. టీ20 ప్రపంచ కప్ సమయంలో ‘‘డ్రగ్స్ తీసుకున్న పాకిస్తానీ క్రికెటర్’’ - ఐసీసీ నివేదికపై పీసీబీ ఏం చెబుతోంది?

  17. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలు నిజం కాదు: కేంద్రం స్పష్టత

    పెట్రోల్, డీజిల్ ధరలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.

    పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 25-28 మేర పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఈ సందర్భంగా కొట్టి పారేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది.

    అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.

  18. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ బూత్ సమీపంలో బాంబు పేలుడు వార్తలు

    పశ్చిమ బెంగాల్‌

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    ముర్షిదాబాద్ జిల్లాలోని డోంకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. దీంతో స్థానికులు బూత్ నంబర్ 217 వద్ద ఓటు వేయడానికి వెళ్లలేకపోయారు.

    బీబీసీ బంగ్లా కథనం ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ముర్షిదాబాద్ పోలీసులు.. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    ముర్షిదాబాద్ జిల్లాలో నౌదా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివనగర్‌లో ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    మరోవైపు, మాల్దా జిల్లాలోని మోతాబారిలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకోగా, వారు ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

  19. కవల పిల్లలకు వేరు వేరు తండ్రులు.. ఇదెలా సాధ్యమైంది? ఈ కేసు గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

  20. చెన్నైలో ఓటేసిన రజనీ, విజయ్, అజిత్

    రజనీకాంత్, తమిళనాడు ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    అలాగే, నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.

    టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలో ఓటు వేశారు.

    అజిత్ కుమార్

    ఫొటో సోర్స్, ANI