నందమూరి తారకరత్న: మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలింపు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Tarakarathna
నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్రంగా అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.
శనివారం తెల్లవారుజామున కుప్పం నుంచి ఆంబులెన్స్‌లో బెంగళూరుకు తీసుకెళ్లారు.
తొలుత ఐసీయూ నుంచి బయటకి తీసుకురావడం శ్రేయస్కరం కాదని బెంగళూరు డాక్టర్లు చెప్పినప్పటికీ చివరకు మెరుగైన చికిత్స కోసం తరలించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డితో చర్చించిన తర్వాత బెంగళూరు తరలించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం బెంగళూరులో వైద్యం అందిస్తున్నారు.
కూతురు నిషికతో కలిసి తొలుత కుప్పం ఆసుపత్రికి చేరుకున్న అలేఖ్య, అక్కడి నుంచి అంబులెన్స్ వెంట బెంగళూరు వెళ్ళారు.
