లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
నందమూరి తారకరత్నను బెంగళూరు తరలించే యోచనను వైద్యులు విరమించుకున్నారు. కుప్పంలోని పీఈసీ ఆస్పత్రిలోనే ఆయనకు వైద్యం అందించాలని నిర్ణయం.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/Facebook
నందమూరి తారకరత్నను బెంగళూరు తరలించే యోచనను వైద్యులు విరమించుకున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఇంతకుముందే బెంగళూరు నుంచి వైద్య బృందం తరలివచ్చింది.
కుప్పంలోని పీఈసీ ఆస్పత్రిలోనే ఆయనకు వైద్యం అందించాలని బెంగుళూరు వైద్య బృందం నిర్ణయించుకుంది.

ఫొటో సోర్స్, JanaSena Party/Facebook
నందమూరి తారకరత్న అస్వస్థతకు గురి కావడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
‘మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/Facebook
నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నారా లోకేశ్ చేరుకున్నారు.
నేటి పాదయాత్ర పూర్తి చేసుకుని పీఈఎస్ ఆసుపత్రికి ఆయన వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
ఇక తారకరత్న ఆరోగ్యపరిస్థితి పరిశీలించుందకు బెంగుళూరు నారాయణ హృదయాలయ నుంచి ప్రత్యేక వైద్యులు బృందం కుప్పం చేరుకుంది.
దిల్లీ యూనివర్సిటీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
నరేంద్ర మోదీ మీద బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దిల్లీ యూనివర్సిటీలోని ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ బయట బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ఎన్‌ఎస్‌యూఐ-కేఎస్‌యూ ప్రకటించింది. అయితే దీనికి అనుమతి లేదంటూ దిల్లీ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు యూనివర్సిటీలో మోహరించారు. డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించిన సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/Facebook
తారకరత్న ఆరోగ్యపరిస్థితిని పరిశీలించేందుకు నారాయణ హృదయాలయ నుంచి వైద్యులు వస్తున్నట్లు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు తెలిపారు.
కాస్త రికవరీ అయినప్పటికీ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ మీదనే తారకరత్న ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర నేడు కుప్పం నుంచి మొదలైంది. ఆ యాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో చేరారు.
ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
గిరిధర్ గమాంగ్‌తోపాటు ఇతర నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
గిరిధర్ గమాంగ్ గతంలో కాంగ్రెస్ తరపున కొంత కాలం ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
భారతదేశ భవిష్యత్తు కోసం బీఆర్‌ఎస్ ప్రస్థానం మొదలైందని అన్న కేసీఆర్, బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా నేతలకు అభినందనలు తెలిపారు.

ఫొటో సోర్స్, Facebook/KCR

ఫొటో సోర్స్, ANI
అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి.
అదానీ గ్రూప్‌లోని 10 స్టాకుల్లో 8 లోవర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. గ్రూప్‌లోని ఏడు కంపెనీల మార్కెట్ విలువకు 48 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.3.85 లక్షల కోట్లు నష్టం వచ్చింది.
దీంతో ఆ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద సైతం భారీగా తగ్గి పోయింది. దాంతో ఆయన ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడు నుంచి ఏడవ స్థానానికి పడిపోయారు.
ఫోర్బ్స్ ప్రకారం గౌతమ్ అదానీ సంపద 22 బిలియన్ డాలర్లు(రూ.1.76 లక్షల కోట్లు) తగ్గి 96.6 బిలియన్ డాలర్లకు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో 107 పరుగులు చేయగా 15 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
శ్వేత శెరావత్ 61 పరుగులు చేయగా సౌమ్య తివారీ 22 పరుగులు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Rahul Gandhi/Facebook
జమ్మూకశ్మీర్‌లో ‘భారత్ జోడో యాత్ర’ను శుక్రవారం రద్దు చేశారు.
పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
అయితే యాత్ర రద్దు గురించి ముందుగా తమతో మాట్లాడలేదని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలు లేవని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/Facebook
తారకరత్న కోలుకుంటున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ప్రస్తుతం తారకరత్న బీపీ సాధారణంగా ఉందని తెలిపారు. ఆయన గుండెలోని ఎడమ వైపు రక్తనాళాల్లో 90శాతం మూసుకుపోయినట్లు బాలకృష్ణ వెల్లడించారు.
‘బెంగళూరుకు తారకరత్నను తరలించాలని అనుకుంటున్నాం. హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లాలా లేక అంబులెన్సులో తీసుకెళ్లాలా అనేది ఆలోచిస్తున్నాం.
హెలికాప్టర్‌లో వెంటిలేటర్లు అవి ఉండవు కాబట్టి అంబులెన్స్ మంచిదని అనుకుంటున్నాం’ అని బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
నేడు కుప్పం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర మొదలైంది. ఈ యాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు వచ్చిందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
రిపబ్లిక్ డే సందర్భంగా అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో ఒక విద్యార్థి ‘అల్లాహూ అక్బర్’ అని నినాదాలు చేసినట్లు యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఆ విద్యార్థిని వెంటనే సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న విద్యార్థులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
భారతసంతతికి చెందిన రాజా చారిని అమెరికా ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.
దీన్ని అమెరికా సెనేట్ ఆమోదించాల్సి ఉందని ఆ దేశ రక్షణశాఖ తెలిపింది.
ఎయిర్‌ఫోర్స్‌లో ప్రస్తుతం రాజా చారి కల్నల్ హోదాలో ఉన్నారు. ఆయన నాసాలో ఆస్ట్రోనాట్‌గా కూడా ఉన్నారు.
స్సేస్ ఎక్స్ క్రూ-3 మిషన్‌తోపాటు క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు రాజా చారి కమాండర్‌గా వ్యవహరించారు.
నేడు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక నేపథ్యంలో ఆ గ్రూప్ కంపెనీ షేర్లు నేడు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అదానీ ట్రాన్స్‌మిషన్ 20శాతం, అదానీ పోర్ట్స్ 17.22శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 17.31శాతం, అదానీ గ్రీన్ 20శాతం, అదానీ పవర్ 5శాతం, అదానీ విల్‌మార్ 5శాతం చొప్పున నష్టపోయాయి.
అదానీ గ్రూప్‌లోని 10 స్టాకుల్లో 8 లోవర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి.
ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 1118 పాయింట్లు కోల్పోయి 59086 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 365 పాయింట్లు నష్టపోయి 17526 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Tarakarathna
నారా లోకేశ్ పాదయాత్రలో అస్వస్థతకు లోనైన నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
ఉదయం 11 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు.
ఈ క్రమంలో లక్ష్మీపురం వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది దూరం నడిచాక మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. మసీదు నుంచి బయటకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు.
తారకరత్నను తొలుత కేసీ ఆసుపత్రికి తరలించగా.. ఆ సమయంలో ఆయన స్పృహలో లేరని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు తెలిపారు.
'ఆసుపత్రికి తీసుకురాగానే చికిత్స చేశాం. పల్స్ తక్కువగా ఉంది. ఏకోలో హార్ట్ రేట్ కనిపించింది. లోబీపీ ఉంది. మెరుగైన చికిత్స కోసం పీఈఎస్ఆసుపత్రికి పంపించాం’ అని కేసీఆస్పత్రి వైద్యులు తెలిపారు.
పీఈఎస్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారని చెబుతున్నారు. తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అయిందని టీడీపీ నేతలు చెబుతుండగా ఆసుపత్రి వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు.
మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.