ఆంధ్రప్రదేశ్: కాపులకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రానిదే అన్న కేంద్రం

కాపుల రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తేల్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానమిచ్చారు.

లైవ్ కవరేజీ

  1. తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’

  2. ఎలాన్ మస్క్: ‘‘ట్విటర్ సీఈవోగా తగిన మూర్ఖుడు దొరకగానే నేను ఆ పదవికి రాజీనామా చేస్తా’’

    ఎలాన్ మస్క్

    ఫొటో సోర్స్, REUTERS

    ట్విటర్ సీఈవో పదవికి తగిన మూర్ఖుడు దొరకగానే తాను ఆ పదవికి రాజీనామా చేస్తానని ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ చెప్పారు.

    ‘‘ఈ పదవిలో చేరే మూర్ఖుడు ఎవరైనా దొరికగానే వీలైనంత త్వరగా నేను ఆ పదవికి రాజీనామా చేస్తా. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్, సర్వర్ బృందంతో మాత్రమే నేను పనిచేస్తాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    అంతకుముందు తాను ట్విటర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా? వద్దా? అని ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ ఒక పోల్ నిర్వహించారు. అందులోఎలాంటి ఫలితాలు వచ్చినా తాను స్వీకరిస్తానని కూడా రాశారు.

    ఈ పోల్‌లో, 57.5 శాతం మంది ఎలాన్ మస్క్, ట్విటర్ సీఈవోగా తప్పుకోవాలంటూ అభిప్రాయపడ్డారు. 42.5 శాతం మంది మాత్రం ట్విటర్ సీఈవోగా ఎలాన్ మస్క్ కొనసాగాలను కోరుకున్నారు.

    ట్విటర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ మార్పులు అనేక విమర్శలకు దారి తీశాయి.

  3. అఫ్గానిస్తాన్: యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాలను నిలిపివేస్తామని ప్రకటించిన తాలిబాన్లు

    అఫ్గానిస్తాన్

    ఫొటో సోర్స్, Getty Images

    అఫ్గానిస్తాన్‌యూనివర్సిటీల్లో మహిళలకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నామని తాలిబాన్లు ప్రకటించినట్లు ఉన్నత విద్యా మంత్రి లేఖ ద్వారా తెలిసింది.

    వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన భావిస్తున్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు.

    తాలిబాన్లు తీసుకున్న తాజా నిర్ణయం మహిళలకు ఉన్నత విద్యను దూరం చేస్తుంది. అఫ్గాన్‌లో ఇప్పటికే అనేక సెకండరీ పాఠశాలల్లో విద్యకు బాలికలు దూరమయ్యారు.

    ఈ వార్త విన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నానని బీబీసీకి కాబూల్ యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు చెప్పారు.

    మూడు నెలల క్రితమే వేలాది మంది విద్యార్థినిలు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు రాశారు.

    అక్కడ విద్యార్థినులు చదివే సబ్జెక్టులపై కూడా ఆంక్షలు విధించారు. వెటర్నరీ సైన్స్, ఇంజినీరింగ్, ఎకనమిక్స్, అగ్రికల్చర్ సబ్జెక్టులపై పరిమితులు విధించిన తాలిబాన్లు, జర్నలిజం సబ్జెక్టుపై తీవ్ర ఆంక్షలు విధించారు.