లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
బన్ను కంటోన్మెంట్‌లోని ఒక కౌంటర్ టెర్రరిజం కేంద్రాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తీసుకుని అక్కడి సిబ్బందిని బంధీలుగా పట్టుకుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
భారతదేశానికి చెందిన 16 ఫార్మా కంపెనీలను నేపాల్ ఔషధ నియంత్రణ సంస్థ బ్లాక్ లిస్టులో పెట్టింది.
బాబా రామ్‌దేవ్‌కు చెందిన దివ్య ఫార్మసీతోపాటు రేడియంట్ పేరెంటరల్స్, మెర్క్యూరీ లేబోరేటరీస్, అలయన్స్ బయోటెక్, క్యాప్‌టాబ్ బయోటెక్, అగ్లోమడ్ లిమిటెడ్, జీ లేబోరేటరీస్, డఫోడిల్స్ ఫార్మా, జీఎల్‌ఎస్ ఫార్మా, యూనీజులస్ లైఫ్ సైన్స్, కాన్సెప్ట్ ఫార్మా, శ్రీ ఆనంద్ లైఫ్ సైన్సెస్, ఇప్కా లేబోరేటరీస్, క్యాడిలా హెల్త్‌కేర్, డెయిల్ ఫార్మా, మాకర్ ల్యాబ్స్ ఉన్నాయి.
బ్లాక్ లిస్టులో పెట్టిన ఈ కంపెనీల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోకూడదని స్థానిక ఏజెంట్లకు నేపాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచఆరోగ్యసంస్థ ప్రమాణాలను చేరుకోవడంలో ఈ కంపెనీలు విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నేపాల్ తెలిపిందని వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, ANI
మతాంతర వివాహాల మీద తమకు వ్యతిరేకత లేదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.
‘మతాంతర వివాహాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకతా లేదు. లవ్ జిహాద్ మీద కొన్ని ఇతర రాష్ట్రాల్లో చట్టాలు చేశారు.
ఆ చట్టాలను అధ్యయనం చేసిన తరువాత, అవసరం అనుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
తద్వారా మహిళలు నష్టపోకుండా చూస్తుంది’ అని దేవేండ్ర ఫడణవీస్ మహారాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు.
‘లవ్ జిహాద్’ అనేది మహారాష్ట్రలో పెద్దయెత్తున జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జపాన్, చైనా, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో భారత్ అప్రమత్తమైంది.
ప్రతిరోజూ వచ్చే అన్ని పాజిటివ్ శాంపిల్స్‌ను జీనోమిక్స్ కన్షార్షియం జీనోమ్ సీక్వెన్సింగ్ లేబోరేటరీస్‌కు పంపాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కోరారు.
తద్వారా కరోనావైరస్ వేరియంట్స్‌ను ట్రాక్ చేయడం సులభం అవుతుందని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వాలో తాలిబాన్ల చెర నుంచి పోలీసులను విడిపించినట్లు ఆ దేశ హోంశాఖ మంత్రి తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో 33మంది తాలిబాన్ ఫైటర్లు, ఇద్దరు సైనికులు చనిపోయినట్లు వెల్లడించారు. మరొక 15మందికి గాయాలు అయ్యాయి.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఆపరేషన్ ప్రారంభించగా 2.30 గంటల కల్లా ముగిసినట్లు మంత్రి వెల్లడించారు.
బన్ను కంటోన్మెంట్‌లోని ఒక కౌంటర్ టెర్రరిజం కేంద్రాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తీసుకుని అక్కడి సిబ్బందిని బంధీలుగా పట్టుకుంది.
వారిని విడిపించేందుకు తాలిబాన్లతో పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో మిలిటరీ ఆపరేషన్ చేపట్టారు.

ఫొటో సోర్స్, THAI NAVY/TWITTER
థాయిలాండ్ యుద్ధనౌక మునిగి పోయిన ఘటనలో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి.
అలాగే ప్రాణాలతో ఉన్న మరొక వ్యక్తిని కూడా కాపాడారు.
వరద వల్ల నియంత్రణ కోల్పోయిన యుద్ధనౌక నీటిలో తిరగబడింది. ఆ సమయంలో మొత్తం 105 మంది సిబ్బంది అందులో ఉన్నారు.
వారిలో ఇప్పటి వరకు 76 మంది రక్షించారు. ఇంకా 24 మంది కోసం వెతుకుతున్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను బైజూస్ కొనుగోలు చేస్తోందనే విషయం తమ దృష్టికి వచ్చిందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్‌పర్సన్ ప్రియాంక్ అన్నారు.
‘విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను బైజూస్ కొనుగోలు చేస్తున్నట్లు మాకు తెలిసింది. వారిని నిరంతరం ఫాలో చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తామంటూ బెదిరిస్తున్నారు. కుటుంబంలో చదువుకునే తొలి తరాన్ని వారు టార్గెట్ చేస్తున్నారు.
దీని మీద మేం చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి లేఖ రాస్తాం’ అని ప్రియాంక్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, CMO
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలను కలిసేందుకు భగవంత్ మాన్ వచ్చారు.
ఈ సందర్భంగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లోని నాంపల్లిలో కూల్ డ్రింక్ బాటిల్ దొంగతనం చేశాడంటూ బాలుని మీద కిరాణా కొట్టు యజమాని దాడి చేశారు.
అబ్రహీం కిరాణా కొట్టు యజమాని కృష్ణ, బాలుడి బట్టలూడదీసి, కాళ్లూ చేతులు కట్టేసి హింసించాడు. బాలుడి మర్మంగాల మీద కారం జల్లాడు.
బాలున్ని హింసిస్తున్న దృశ్యాలను రికార్డు చేసి వాటిని కృష్ణ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

ఫొటో సోర్స్, FARHATULLAH
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వాలో తాలిబాన్ల చెర నుంచి పోలీసులను విడిపించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
ఈ ఆపరేషన్‌లో చాలా మంది చనిపోయినట్లు వెల్లడించింది. ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని కొందరు పోలీసులు ఇంకా తాలిబాన్ల చేతిలో బంధీలుగా ఉన్నట్లు పేర్కొంది.
అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ఆపరేషన్‌ను ధ్రువీకరించలేదు.
బన్ను కంటోన్మెంట్‌లోని ఒక కౌంటర్ టెర్రరిజం కేంద్రాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. సుమారు 24మంది పోలీసులు వారి అదుపులో ఉన్నారు.
బంధీలను విడిపించేందుకు తాలిబాన్ ఫైటర్లతో పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఆదివారం అర్ధంతరంగా ముగిశాయి.
కర్నాటకలో హలాల్ మాంసం కేంద్రంగా వివాదం జరుగుతోంది.
రాష్ట్రంలో హలాల్ మాంసాన్ని నిషేధించేలా ప్రైవేటు మెంబర్ బిల్లును బీజేపీ ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
‘బీజేపీ బాధ్యత లేకుండా వ్యవహరించడం దురదృష్టకరం. ప్రైవేటు మెంబరు బిల్లు అనేది ప్రతిసభ్యుని హక్కు. సామాన్యుల కష్టాలను తొలగించేందుకు అలాంటి బిల్లును తీసుకొస్తే అందరూ మెచ్చుకునేవారు’ అని కర్నాటక కాంగ్రెస్ నేత బీకే హరి ప్రసాద్ అన్నారు.
ఆ బిల్లు సభలో వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై పని చేస్తున్న కార్మికుల మీదకు గూడ్స్ లారీ దూసుకెళ్లింది.
నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది.
ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు జరగ్గా మూడింటిలో పాకిస్తాన్ ఓడిపోయింది.
చివరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ మీద ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి టెస్టులో 74 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది.
సొంతగడ్డ మీద పాకిస్తాన్ ఇలా అన్ని టెస్టులు ఓడిపోవడం ఇదే తొలిసారి. సుమారు 17ఏళ్ల తరువాత తొలిసారి విదేశీ జట్టు పాకిస్తాన్‌లో టెస్ట్ సిరీస్ కోసం వచ్చింది.
ఒక ప్లేటు భోజనం తక్కువలో తక్కువ ఎంత ఉంటుంది. కనీసం ఓ వంద రూపాయలైనా ఖర్చు పెట్టాలి.
కానీ విజయవాడలో ‘మన భోజనశాల’లో 20 రూపాయలకే భోజనం పెడుతున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది