గత 24 గంటల్లో 16,299 కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 19,431 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 1,25,076 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.58శాతంగా ఉంది.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘ఈ ప్రభుత్వ డబ్బుతో తమ స్నేహితుల రుణాలు మాఫీ చేస్తున్నారు. వాళ్లు తమ బిలియనీర్ స్నేహితులకు పన్నులు కూడా మాఫీ చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ విమర్శించారు.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 19,431 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 1,25,076 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.58శాతంగా ఉంది.
ఆ ఊరిలో కుక్కలు మాములువి కావు. వాటికి కోట్ల రూపాయల ఆస్తులుంటాయి.
ఎకరాల కొద్దీ పొలాలుంటాయి. వాటికి ఆ ఊర్లో ప్రజలు ప్రతి రోజూ కడుపునిండా తిండి పెడతారు.
అంతటి రిచ్ డాగ్స్ ఉన్న ఆ ఊరి కథేంటో మీరూ చూడండి.
మహారాష్ట్రలో ఉక్కు, వస్త్ర, స్థిరాస్తి వ్యాపారుల ఇళ్ల మీద ఆదాయపు పన్ను విభాగం చేసిన దాడుల్లో సుమారు రూ.56 కోట్ల నగదు, 32 కేజీల బంగారం, వజ్రాలు, ముత్యాలు లభించాయి.
జల్నాలో ఈ నెల ఒకటి నుంచి 8 మధ్య ఈ దాడులు జరిగాయి.
రూ.100 కోట్ల బినామీ ప్రాపర్టీని కూడా సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పట్టుబడిన నగదును లెక్కించడానికి 13 గంటలు పట్టినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
రజౌరీ జిల్లాలోని దరహాల్ ప్రాంతంలో ఉండే భారత సైనిక శిబిరం మీద మిలిటెంట్లు దాడి చేశారు.
ఈ ఘటనలో సైనికులు, మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మిలిటెంట్లను చంపివేయగా ముగ్గురు సైనికులు కూడా మరణించినట్లు సైనిక అధికారులు తెలిపారు.
మిలిటెంట్లు చనిపోయినట్లు జమ్మూ అడిషనల్ డీజీపీ ముకేశ్ సింగ్ కూడా ధ్రువీకరించారు.
దరహాల్ పోలీసు స్టేషన్‌కు 6 కిలోమీటర్ల దూరంలో సైనిక శిబిరం ఉంది.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనంగా భద్రతా దళాలను మోహరించారు. చుట్టుపక్కల పరిసరాల్లో శోధాలు జరుపుతున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.