You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన హంపి, హారికల బృందం

2012లో ఇస్తాంబుల్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో.. భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి ఒక స్థానం పెరిగి కాంస్య పతకం గెలుచుకోవటానికి దశాబ్దం పట్టింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ నేటి అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  2. కరోనావైరస్: కోవిడ్ నిరోధానికి కోర్బివ్యాక్స్ బూస్టర్ డోసు తీసుకోవచ్చు - కేంద్రం అనుమతి

    కోవిడ్ మహమ్మారి మీద పోరాడటానికి కోర్బివ్యాక్స్ వ్యాక్సీన్‌ను బూస్టర్ డోసుగా ఉపయోగించవ్చునని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    బయోలాజికల్ ఇ సంస్థ తయారు చేసే ఈ వ్యాక్సీన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చునని పేర్కొంది.

    దేశంలో 18 సంవత్సరాల పైబడిన వారు.. కోవ్యాక్సీన్ కానీ, కోవిషీల్డ్ కానీ రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత లేదా 26 వారాల తర్వాత కోర్బివ్యాక్స్ బూస్టర్ డోసు తీసుకోవచ్చు.

    ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

  3. బాంబు పేలుడులో గాయపడి బోనులో బతికిన ఏనుగు మళ్లీ స్వేచ్ఛగా అడవిలోకి ఎలా వెళ్లిందంటే...

  4. ఆ ఊళ్లో కుక్కలు చాలా రిచ్

  5. అఫ్గానిస్తాన్‌లో ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్న గర్భవతులు, నవజాత శిశువులు...

  6. నిన్నటి దాకా తుపాకులు పట్టుకుని తిరిగాడు. ఇవాళ అర్బన్ డెవలప్‌మెంట్ వ్యవహారాలు చూస్తున్నాడు

  7. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆగస్టు 27ను జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు

    భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌ను రాష్ట్రపతి నియమించారని, ఆయన ఈ నెల 27న బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. 2014 నుంచి ఉదయ్ ఉమేశ్ లలిత్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారని, బార్ నుంచి నేరుగా ప్రధాన న్యాయమూర్తి అయిన వారిలో ఆయన రెండో వారని కూడా ఆ ప్రకటనలో తెలిపింది.

  8. భార్యాభర్తలు గొడవపడితే అమ్మాయినే సర్దుకుపొమ్మంటారు, అబ్బాయిని ‘ఏం జరిగింది’ అని కూడా అడగలేరు, ఎందుకు

  9. వరవరరావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు.. ముంబయి విడిచి వెళ్లరాదంటూ షరతు

  10. చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టుకు కాంస్య పతకం.. చరిత్ర సృష్టించిన హంపి, హారికల బృందం

    ఈసారి చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం భారత మహిళల చెస్ జట్టుదేనని ఖాయంగా అనుకున్నారు. కానీ ఒకటిన్నర రోజులో పరిస్థితి తారుమారైంది. భారత బృందం కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    అయినాసరే. భారత మహిళల బృందం చరిత్ర సృష్టించింది. ఎందుకంటే చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు ఒక పతకం గెలవటం ఇదే తొలిసారి.

    గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో పాటు.. తానియా సచ్‌దేవ్, ఆర్.వైశాలి, భక్తి కులకర్ణి వంటి హేమాహేమీలు, యువ క్రీడాకారిణిలతో కూడి బృందం ఈ ఘనతను సాధించింది.

    తమిళనాడులోని మామళ్లపురంలో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో.. రష్యా కానీ, చైనా కానీ ఈ ఒలింపియాడ్‌లో పాల్గొనకపోవటం కూడా భారత జట్టుకు కలిసివచ్చింది. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న భారత క్రీడాకారిణిలదే బంగారు పతకమని అందరూ అంచనా వేశారు.

    అయితే ఫైనల్ రౌండ్‌కు ముందు భారత జట్టు అమెరికా చేతిలో 1-3 పాయింట్లతో ఓడిపోయింది. హంపి, వైశాలి తమ గేమ్‌లను డ్రా చేసుకుంటే.. తానియా, భక్తిలు ఓటమి పాలయ్యారు.

    ఫైనల్ రౌండ్ ముగిశాక.. యుక్రెయిన్‌కు గోల్డ్ మెడల్, జార్జియాకు సిల్వర్ మెడల్ లభించాయి. అప్పుడు కాంస్య పతకం భారత్‌కు దక్కాలా, అమెరికాకు ఇవ్వాలా అనే సందిగ్ధత తలెత్తింది.

    చివరికి పాయింట్లు ఇండియాకు ఫేవర్‌గా ఉండటంతో భారత్‌కు కాంస్య పతకం లభించింది. అమెరికా నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

    2012లో ఇస్తాంబుల్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో.. భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి ఒక స్థానం పెరిగి కాంస్య పతకం గెలుచుకోవటానికి దశాబ్దం పట్టింది.

  11. అబ్బాయిలు నెయిల్ పాలిష్ వేసుకున్నా, నగలు ధరించినా ‘గే’ అని అనుకోవాలా?

  12. బ్రేకింగ్ న్యూస్, బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం

    బిహార్ ముఖ్యమంత్రిగా 8వసారి నితీశ్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు.

    బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆయన మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు.

    నేడు లాలూ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

    ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ బిహార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  13. ఉజ్వల పథకం: వంట గ్యాస్‌ వాడకం ఆపేసి, మళ్లీ కట్టెల పొయ్యికి మొగ్గు చూపుతున్న నిరుపేద కుటుంబాలు

  14. వరవరరావు బెయిల్: ముంబయి విడిచి వెళ్లొద్దన్న సుప్రీం కోర్టు

    భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న విప్లవ రచయిత వరవరావు బెయిల్ పొడిగిస్తూనే ముంబయి దాటి పోకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది.

    అయితే వరవరరావుకు బెయిల్ ఇవ్వడాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వ్యతిరేకించారు.

    వరవరరావు చర్యలు దేశానికి హాని చేసేలా ఉన్నాయని, దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసే కేసుల్లో వయసును చూడకూడదని ఎస్‌వీ రాజు సుప్రీం కోర్టుకు తెలిపారు.

    అయితే వరవరరావు వల్ల ఎంత మంది చనిపోయారని అడిషనల్ సొలిసిటర్ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. ఒకరు చనిపోయారని ఎస్‌వీ రాజు బదులిచ్చారు.

    ‘అది భీమా కోరేగావ్‌కు సంబంధించింది. మరి గడ్చిరోలి సంగతి ఏంటి? ఆంధ్రా ప్రాంతంలో జరిగే ఘటనల పరిస్థితి ఏంటి? అక్కడ చోటు చేసుకునే మరణాలన్నింటికీ వరవరరావునే కారణమా?’ అని కోర్టు ప్రశ్నించింది.

  15. భీమా కోరేగావ్ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?

    భీమా కోరేగావ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగి కొన్ని ఏళ్లు గడుస్తోంది.

    ఈ కేసులో అరెస్టు అయిన విప్లవ రచయిత వరవరావుకు నేడు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    ఈ కేసులో ఇప్పటివరకూ 16మంది ఉద్యమకారులు, కవులు, లాయర్లను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

    అరెస్ట్ అయిన వారిలో ఆనంద్ తెల్తుంబ్డే, గౌతమ్ నవలఖా, వరవరరావు, స్టాన్ స్వామి, సుధా భరద్వాజ్, వెర్నన్ గోంజాల్వెజ్ తదితరులు ఉన్నారు.

    భీమా కోరేగావ్ కేసులో ఎప్పుడు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  16. బ్రేకింగ్ న్యూస్, భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ పొడిగింపు

    భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్ పొడిగింపు ఇచ్చింది.

    82 ఏళ్ల వరవరరావు అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

    జస్టిస్ ఉదయ్ ఉమేవ్ లలిత్‌ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.

  17. హైదరాబాద్ కంపెనీ తయారు చేసిన కోవిడ్ టీకాకు ఆమోదం

    హైదరాబాద్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘బయోలాజికల్-ఇ’ రూపొందించిన ‘కార్బివ్యాక్స్’ కోవిడ్-19 టీకాను 18 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.

    కార్బివ్యాక్స్ అనేది బూస్టర్ డోస్. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు తీసుకున్న 6 నెలలకు కార్బివ్యాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

    దేశీయంగా తయారైన కార్బివ్యాక్స్‌కు ఆమోదం లభించడం ద్వారా మన సామర్థ్యం మరొకసారి తెలిసిందని బయోలాజికల్-ఇ ఎండీ మహిమ దాట్ల అన్నారు.

  18. ఆంధ్రప్రదేశ్: ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధులు

    ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆదివాసీ తెగలు కూడా బ్రిటిష్‌ వారిపై తిరుగుబాట్లు చేశాయి. చెంచుల్లోని కొందరు పోరాట యోధులకు ఇటీవల అధికారిక గుర్తింపు దక్కింది.

    నల్లమల అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యాలను ఎదిరించిన ఇద్దరు చెంచు జాతి వీరుల విగ్రహాలను ఇటీవలే ఏర్పాటు చేశారు.

    పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చూడండి.

  19. పాకిస్తాన్ టీవీ చానెల్ నిలిపివేత... సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ అరెస్ట్

    పాకిస్తాన్ టీవీ చానెల్ ఏఆర్‌వై న్యూస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమ్మద్ యూసఫ్‌ను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు.

    ప్రభుత్వాన్ని విమర్శించే ఏఆర్‌వై న్యూస్‌ను మంగళవారం అధికారులు నిలిపివేశారు.

    పాకిస్తాన్ సైన్యం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ దేశభద్రతకు ముప్పు తెచ్చేలా ఆ న్యూస్ చానెల్ ప్రవర్తిస్తోందంటూ అధికారులు ఆరోపిస్తున్నారు.

  20. గోదావరికి పెరుగుతున్న వరద, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, శబరి నదులు ఏకకాలంలో పొంగుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి భారీగా వరదప్రవాహం గోదావరికి చేరుతోంది.

    ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వానల వల్ల శబరి పొంగుతోంది. వరద నీరు వచ్చి చేరడంతో పోలవరం విలీన మండలాల్లో ఇప్పటికే వందల గ్రామాలకు నీరు చేరుతోంది. ఈ ముప్పు మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

    భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి బుధవారం ఉదయం 7గం.ల ప్రాంతంలో 50 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇది 55 అడుగుల వరకూ చేరుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

    మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి భద్రాచలం వద్ద వరద చేరుకుంటుందని అధికారికంగా అంచనా వేస్తున్న తరుణంలో దిగువన శబరి నదీ ప్రవాహం కూడా చేరడంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుకునూరు, పోలవరం, దేవీపట్నం మండలాల్లోని వందల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.

    జులైలో వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోని గ్రామాలకు మరోసారి వరద ముప్పు మూలంగా తల్లడిల్లిపోతున్నారు.

    ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం 10లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దాంతో ఎగువన అల్లూరి జిల్లా, ఏలూరు జిల్లా వాసులతో పాటుగా తూర్పు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా కలవరం మొదలయ్యింది. లంక గ్రామాలను మరోసారి ఖాళీ చేయించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

    జులై వరదల నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనుంది.