అమెరికా చేరుకున్న ఒలేనా జెలెన్‌స్కా.. మరింత సాయం కావాలని అభ్యర్థన

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్‌స్కా అమెరికా సాయం కోరారు. రష్యాపై యుద్ధం చేయడానికి మరింత సహాయం అందించాలని బుధవారం ఆమె అమెరికా కాంగ్రెస్‌ను కోరారు.
ఈ మేరకు, వాషింగ్టన్‌లో ఉద్వేగభరితమైన ప్రసంగం ఇచ్చారామె.
"నేను ఆయుధాలు అడుగుతున్నాను. వేరొకరి భూమిపై యుద్ధం ప్రకటించడానికి కాదు. సొంత ఇంటికి రక్షించుకోవడానికి ఆయుధాలు ఇమ్మని కోరుతున్నాను" అంటూ ఆమె ప్రసంగించారు.
అంతకుముందు, మంగళవారం ఒలేనా జెలెన్‌స్కా అమెరికా అధ్యజ్షుడు జో బైడెన్‌తో, సోమవారం విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమై దాదాపు అయిదు నెలలు కావొస్తోంది. అమెరికా నుంచి మరింత సైనిక సహాయం, రాజకీయ మద్దతు కోరేందుకు ఒలేనా ఆ దేశానికి వెళ్లారు.
యుక్రెయిన్‌కు 40 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. సెప్టెంబర్ చివరి నాటికి దీన్ని పూర్తిగా అందిస్తారు.
ఈ పర్యటనలో ఒలేనా, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ హెడ్ సమంతా పవర్‌ను కూడా కలిశారు. యుక్రేనియన్ ప్రభుత్వానికి మద్దతుగా, మానవతా అవసరాల కోసం ఈ ఏజెన్సీ బిలియన్ డాలర్ల సహాయం అందించింది.




