రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీళ్లే..

పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రాల శాసనసభల సభ్యులు, దిల్లీ, పుదుచ్చేరి శాసనసభల సభ్యులు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను జూలై 21వ తేదీ గురువారం ప్రకటిస్తారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. యుక్రెయిన్ యుద్ధం: సెక్యూరిటీ చీఫ్, ప్రాసిక్యూటర్ జనరల్‌ను తొలగించిన జెలియెన్‌స్కీ

    ఇవాన్ బకనోవ్‌, ఐరీనా వెనెడిక్టోవా

    ఫొటో సోర్స్, FUTURE PUBLISHING VIA GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, ఇవాన్ బకనోవ్‌ (ఎడమ), ఐరీనా వెనెడిక్టోవా (కుడివైపు)

    యుక్రెయిన్‌ భద్రతా సంస్థ (ఎస్‌బీయూ) అధిపతి ఇవాన్ బకనోవ్‌ను, దేశ ప్రాసిక్యూటర్ జనరల్‌ ఐరీనా వెనెడిక్టోవాను.. దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ పదవుల నుంచి తొలగించారు. వారిద్దరి సారథ్యంలోని సంస్థల్లో దేశద్రోహ ఉదంతాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

    రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో 60 మందికి పైగా మాజీ ఉద్యోగులు ఇప్పుడు యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జెలియెన్‌స్కీ చెప్పారు.

    చట్టాన్ని అమలు చేసే అధికారులకు వ్యతిరేకంగా కుమ్మక్కు, దేశద్రోహం ఆరోపణలతో మొత్తం 651 కేసులు నమోదైనట్లు తెలిపారు.

    ఈ పరిణామంపై ఇవాన్, ఐరీనాలు స్పందించలేదు.

    ఆదివారం పొద్దుపోయాక జెలియెన్‌స్కీ పోస్ట్ చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ.. ‘‘దేశ జాతీయ భద్రత పునాదులను దెబ్బతీసేలా ఇలాంటి నేరాల పరంపర.. సంబంధిత (సంస్థల) అధిపతుల మీద తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

    ఉద్వాసనకు గురైన ఎస్‌బీయూ చీఫ్ ఇవాన్ బకనోవ్ జెలియెన్‌స్కీకి చిన్ననాటి స్నేహితుడు.

    రష్యా 2014లో తమ దేశంలో కలుపుకున్న క్రైమియాలో.. ఎస్‌బీయూ విభాగానికి ప్రాంతీయ అధిపతిగా పనిచేసిన ఓలే కులినిచ్‌ను దేశద్రోహం అనుమానంతో కొద్ది రోజుల కిందట అరెస్ట్ చేశారు. తదనంతర పరిణామాల్లో ఇవాన్ బకనోవ్‌ను, ఐరీనా వెనెడిక్టోవాలను పదవుల నుంచి తొలగించారు.

  2. పాకిస్తాన్: పంజాబ్ ఉపఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఘన విజయం

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ.. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించింది.

    మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ 15 సీట్లు గెలుచుకుంది.

    పంజాబ్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ నాలుగు సీట్లు గెలుచుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర్య అభ్యర్థి గెలిచారు.

    ఈ ఏడాది ఏప్రిల్‌లో.. పీఎంఎల్-ఎన్ నేత హమ్జా షాబాజ్ షరీఫ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే సందర్భంగా.. 20 మంది ఎమ్మెల్యేలపై పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది.

    ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే.. ఆ 20 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కనీసం 14 సీట్లు గెలవాల్సి ఉండగా.. 15 సీట్లు గెలుచుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారతో పాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.

    ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ పేజీని ఫాలో అవండి.