ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఎంచుకున్నట్లు విపక్ష పార్టీల తరపున ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. దక్షిణ కర్ణాటకకు చెందిన మార్గరెట్ ఆల్వా న్యాయవాద వృత్తిని అభ్యసించారు. కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. నాలుగుసార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. గవర్నర్‌గా కూడా పనిచేశారు.
లైవ్ కవరేజీ
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీళ్లే..
నేటి ముఖ్యాంశాలు
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఎంచుకున్నట్లు విపక్ష పార్టీల తరపున ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు.
- షార్జా నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాకిస్తాన్‌లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
- భారత షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 విమెన్స్ సింగిల్స్ గెలుచుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ ఝి యీ ని సింధు ఓడించారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావరి పరిసరాలను సీఎం పరిశీలించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
ధన్యవాదాలు
పాండురంగ యాత్ర: రుతుస్రావంతో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం
భారత్‌లో 200 కోట్ల మార్కును దాటిన కరోనా వ్యాక్సిన్ డోసులు

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఆదివారం నాటికి కరోనా వ్యాక్సిన్ డోసుల అంశంలో 200 కోట్ల మార్కును దాటింది. 2021 జనవరి 6వ తేదీన వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, కేవలం 18 నెలల్లోనే భారత్ ఈ మార్కును చేరుకుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ, దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
‘‘భారత్‌కు అభినందనలు. అందరి కృషితో భారత్ ఈరోజు 200 కోట్ల కోవిడ్ డోసుల ఫీట్‌ను దాటింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ చరిత్ర సృష్టించింది. ఈ అసాధారణ విజయం చరిత్రలో నిలిచిపోతుంది’’ అని అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రపంచంలో భారత్ కంటే అధికంగా చైనా మాత్రమే కరోనా టీకాలను ప్రజలకు అందించింది. మిగతా దేశాలు భారత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి.
మాండవీయ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. ‘‘భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. 200 కోట్ల మార్కును దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. ఈ ఫీటును ఇంత వేగంగా అందుకునేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరి పట్ల మేం గర్వంగా భావిస్తున్నాం. కరోనాకు వ్యతిరేకంగా మన పోరాటాన్ని ఇది మరింత బలోపేతం చేసింది’’ అని అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా

ఫొటో సోర్స్, twitter/alva_margaret
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఎంచుకున్నట్లు విపక్ష పార్టీల తరపున ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు.
శరద్ పవార్ ఇంట్లో ఆదివారం విపక్ష పార్టీల నాయకులు భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేయడంపై చర్చించారు. అనంతరం శరద్ పవార్ స్వయంగా ప్రకటన చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, శివసేన నుంచి సంజయ్ రౌత్ తదితరులు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, twitter/alva_margaret
ఫొటో క్యాప్షన్, సోనియా గాంధీతో మార్గరెట్ ఆల్వా మార్గరెట్ ఆల్వా ఎవరు?
దక్షిణకర్ణాటకకు చెందిన మార్గరెట్ ఆల్వా న్యాయవాద వృత్తిని అభ్యసించారు.
కాంగ్రెస్‌లో చేరి పలు దశల్లో పార్టీ పదవులను చేపట్టారు.
1974 నుంచి 1998 వరకు నాలుగుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.
1999లో కర్ణాటకలోని కనారా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
2009 నుంచి 2012 వరకు ఉత్తరాఖండ్ గవర్నర్‌గా, 2012 నుంచి 2014 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. అదే సమయంలో గుజరాత్, గోవా రాష్ట్రాలకు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
‘విదేశాలు కావాలనే కుట్రలు చేస్తున్నాయి...క్లౌడ్ బరస్ట్‌లు చేస్తా ఉన్నరు’
హైదరాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానం కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో షార్జా నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాకిస్తాన్‌లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
కరాచీ విమానాశ్రయంలో ఆ విమానాన్ని పరీక్షిస్తున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
కరాచీకి మరో విమానాన్ని పంపించేందుకు ఇండిగో సంస్థ ప్రయత్నిస్తోంది. సాంకేతిక లోపం కారణంగా కరాచీలో భారత విమానయాన సంస్థకు చెందిన విమానం ల్యాండ్ కావడం గత రెండు వారాల్లో ఇది రెండోసారి.
జూలై 5న దిల్లీ నుంచి దుబయ్‌కు వెళ్తోన్న స్పైస్‌జెట్ విమానాన్ని కూడా కరాచీలో అత్యవసరంగా దించారు.
అంతేకాకుండా విమానం ఇంజిన్‌లో వైబ్రేషన్‌కు సంబంధించిన ఫిర్యాదుతో జూలై 14న, ఇండిగో విమానాన్ని జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
డెంగీ ఫీవర్: వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం

ఫొటో సోర్స్, Getty Images
చినుకుల కాలం మొదలవగానే చెట్టూచేమతో పాటు మనమూ ఎండల గుండంలోంచి బయటపడ్డామని కాస్త ఊపిరి పీల్చుకుంటాము. వానలు తెచ్చే వరదా బురద సంగతి ఎలా ఉన్నా "వానల్లు కురవాలి వరిచేలు నిండాలి" అని సంతోషంగా పాడుకుంటాం.
ఒక పక్క పచ్చదనం కొత్త ప్రాణం పోసుకుంటున్నా, పొంచి ఉండి మనల్ని ముంచే రోగాల కాలమూ ఇదే. ఎంత కాపాడుకున్నా బడికెళ్లే పిల్లల్లో రొంప, ఫ్లూ జ్వరాలు వచ్చే తీరతాయి. ప్రాణాంతకం కాకపోయినా ఓ వారం పది రోజులు పిల్లల్ని అతలాకుతలం చేస్తాయి.
కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
నుస్రత్ మీర్జా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఎలా కలిశారు, బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
సింగపూర్ ఓపెన్ 2022 విమెన్స్ సింగిల్స్ విజేత పీవీ సింధు
భారత షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 విమెన్స్ సింగిల్స్ గెలుచుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ ఝి యీ ని సింధు ఓడించారు.
ఈ మ్యాచ్ లో 21-9, 11-21, 21-15 స్కోరుతో సింధు విజయం సాధించారు.
ఈ విజయంతో ఈ ఏడాది ఆమె మూడు టైటిళ్లు గెలిచినట్లయింది. ఇంతకు ముందు ఆమె కొరియన్, స్విస్ టైటిళ్లు కూడా గెలుచుకున్నారు.
పీవి సింధు సింగపూర్ ఓపెన్ 2022 సింగిల్స్ ఫైనల్ గెలవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు తెలుపుతూ, ఆమె ఇదే ఆట తీరును కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, పీవీ సింధు పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఏం కేసీఆర్

ఫొటో సోర్స్, CMO Telangana
ఫొటో క్యాప్షన్, వరద బాధితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావరి పరిసరాలను సీఎం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించారు. ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, CMO Telangana
ఫొటో క్యాప్షన్, వరద బాధితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం: సహాయ కార్యక్రమాలు అందడం లేదని వరద బాధితుల నిరసన

ఫొటో క్యాప్షన్, భద్రాచలంలో ఆందోళనకు దిగిన వరద బాధితులు వరదల సమయంలో ప్రభుత్వ సరైన సహాయక చర్యలు చేపట్టలేదంటూ భద్రాచలంలో అయ్యప్ప కాలనీకి చెందిన పలువురు రోడ్డు పై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
నిన్న సుభాష్ కాలనీకి చెందిన ప్రజలు నిరసన వ్యక్తం చేయగా, ఇవాళ అయ్యప్ప కాలనీ ప్రజలు ఆందోళన చేశారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లిన తర్వాత వారు రోడ్డు మీద నిరసనకు దిగారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని, కనీసం తహశీల్‌దారుతో నైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
పోలీసులు నిరసనకారులను అదుపులోకి అక్కడి నుంచి పంపించివేశారు.
వరద తగ్గుతున్నా, ఇంకా భయం భయం... ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?

ఫొటో క్యాప్షన్, భద్రాచలం ఆలయం తెలుగు రాష్ట్రాలలోని గోదావరి నది పరిసర ప్రాంతాలు వరద ప్రభావం నుంచి పూర్తిగా బయటపడ లేదు.
తెలంగాణలో వరద తగ్గినచోట ప్రజలు ఇళ్లకు చేరుకుని బురదను ఎత్తివేసే పనుల్లో ఉండగా, ఏపీలో ఏటి గట్లకు ఇంకా ప్రమాదం ఉండటంతో ప్రజలు , అధికారులు వాటిని రక్షించే పనిలో ఉన్నారు.
బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.
ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా
