నేటి ముఖ్యాంశాలు
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుమారుడు కేటీఆర్‌ను ఎలా ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఎలాంటి చింత లేదని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.
- తెలంగాణ రాష్ట్ర వికాసం, బీజేపీకి ప్రాధాన్యాల్లో మొదటిది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే మంత్రంతో తెలంగాణ వికాసంపై నిరంతరం కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
- ఖాల్సా ఎయిడ్ వ్యవస్థాపకుడు రవి సింగ్ ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిషేధించారు. ఈ విషయాన్ని రవిసింగ్ ఫేస్బుక్ ద్వారా తెలిపారు.
- జమ్మూ-కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు సాయుధ తీవ్రవాదులను గ్రామస్థులు ఆదివారం పోలీసులకు అప్పగించారు.
- మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వెకర్ ఎన్నికయ్యారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.















