హాకీ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో భారత్ మహిళల మ్యాచ్ డ్రా

ఈ టోర్నీలో భాగంగా నెదర్లాండ్స్‌లో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. నేటి ముఖ్యాంశాలు

    • తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుమారుడు కేటీఆర్‌ను ఎలా ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఎలాంటి చింత లేదని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.
    • తెలంగాణ రాష్ట్ర వికాసం, బీజేపీకి ప్రాధాన్యాల్లో మొదటిది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే మంత్రంతో తెలంగాణ వికాసంపై నిరంతరం కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
    • ఖాల్సా ఎయిడ్ వ్యవస్థాపకుడు రవి సింగ్ ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిషేధించారు. ఈ విషయాన్ని రవిసింగ్ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.
    • జమ్మూ-కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు సాయుధ తీవ్రవాదులను గ్రామస్థులు ఆదివారం పోలీసులకు అప్పగించారు.
    • మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వెకర్ ఎన్నికయ్యారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. హాకీ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో భారత్ మహిళల మ్యాచ్ డ్రా

    భారత హాకీ జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత జట్టు ‘డ్రా’తో మొదలు పెట్టింది.

    ఈ టోర్నీలో భాగంగా నెదర్లాండ్స్‌లో ఆదివారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తమ తొలి మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది.

    మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో ఇసాబెల్లె చేసిన గోల్‌తో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

    అయితే, రెండో క్వార్టర్‌లో వందన కటారియా గోల్‌ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    స్పెయిన్, నెదర్లాండ్స్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది.

    మొత్తం 16 జట్లను నాలుగు విభజించారు. జూలై 1న మొదలైన ఈ టోర్నీ 17న ఫైనల్‌తో ముగియనుంది.

    పూల్ ‘బి’లో ఉన్న భారత జట్టుకు సవిత పూనియా సారథ్యం వహిస్తోంది.

  3. హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...

  4. నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

    మోదీ

    ఫొటో సోర్స్, bjp telangana

    తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో వివరించారు.

    • తెలంగాణలో అభివృద్ధి మరింత వేగవంతం కావాలి. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ఇది సాధ్యం
    • స్వచ్ఛ్ భారత్ పథకంతో తెలంగాణలోని లక్షలాది మంది తల్లులు, మహిళలకు గౌరవపూర్వకమైన జీవితం దక్కింది.
    • ఉజ్వల యోజన, గర్భిణీల కోసం పౌష్టికాహార పథకాలతో మహిళల ఆరోగ్యం మెరుగుపడింది.
    • హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటు చేయడానికి భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
    • కొత్త జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చాం.
    • తెలంగాణలో నీటితో ముడిపడిన దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా విలువ చేసే అయిదు పెద్ద ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
    • గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి దాదాపు ఒక లక్ష కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈసారి ధాన్యం కనీస మద్దతు ధరను 80 రూపాయలు పెంచి క్వింటాలుకు రూ. 2000పైగా ఉండేలా చేశాం.
    • హైదరాబాద్‌లో 1500 కోట్లు వెచ్చించి నాలుగు, ఆరు లైన్ల ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లను కేంద్రం నిర్మిస్తోంది. హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 350 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనుంది.
    • మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. 2014లో తెలంగాణలో దాదాపు 2,500 కి.మీ నేషనల్ హైవే నెట్‌వర్క్ ఉండేది. ఇప్పుడు 5,000 కి.మీ వరకు పెరిగింది.
    • గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ. 31,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఆమోదించాం.
    • దేశంలో నిర్మించే 7 టెక్స్‌ టైల్స్ పార్క్‌ల్లో ఒకటి తెలంగాణలో నిర్మిస్తాం.
  5. ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం

  6. ‘నారీ శక్తిని దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం చేశాం’- నరేంద్ర మోదీ

    మోదీ

    ఫొటో సోర్స్, bjp telangana

    తెలంగాణ ప్రజల ప్రేమ, ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలనని, ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మోదీ అన్నారు.

    ఇంకా ఏమన్నారంటే...

    ‘‘మా సర్కారు మహిళలు, ఆడపిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చింది.

    ఉజ్వల యోజనతో తెలంగాణలోని లక్షలాది మంది పేద మహిళలకు లబ్ధి చేకూరింది.

    ముద్ర లోన్లు ఎందరో మహిళలకు ఉపయోగపడ్డాయి.

    మేం మహిళలను బ్యాంకింగ్‌లో భాగస్వాములను చేశాం.

    దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రాధాన్యాన్ని పెంచాం.

    రైతుల కోసం పంటల కనీస ధరను కూడా పెంచాం.

    గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ లక్ష కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

    హైదరాబాద్‌లో 1500 కోట్లు వెచ్చించి నాలుగు, ఆరు లైన్ల ఫ్లై ఓవర్లు, కారిడార్లను కేంద్రం నిర్మిస్తోంది.

    హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా 350 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు కూడా నిర్మించనున్నాం’’ అని అన్నారు.

  7. ‘తెలంగాణ వికాసమే మా మొదటి ప్రాధాన్యం’- నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, bjp telangana

    తెలంగాణ పవిత్ర భూమి అని, ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు బీజేపీ నిరంతరం పనిచేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    విజయ సంకల్ప సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

    తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతీ కార్యకర్తకు సోదర సోదరీమణులకు మాతృమూర్తులకు నమస్కారం అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు.

    ప్రసంగంలో ఆయన ఏం మాట్లాడారంటే...

    ‘‘తెలంగాణలో కళ, కౌశలం, నైపుణ్యం పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ పవిత్ర భూమి.

    ఇక్కడి సాహిత్యం, ఈ గడ్డ చరిత్ర భారత్‌కు ఎంతో గర్వకారణం.

    ఇలాంటి తెలంగాణ రాష్ట్ర వికాసం, బీజేపీకి ప్రాధాన్యాల్లో మొదటిది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే మంత్రంతో తెలంగాణ వికాసంపై నిరంతరం కృషి చేస్తున్నాం.

    గడిచిన 8 ఏళ్లలో ప్రతీ భారతీయుని జీవితంలో సాకారాత్మక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించాం.’’ అని అన్నారు.

  8. ‘మోదీ ఎందరికో ఆదర్శం, ఆయనపై కేసీఆర్ తప్పుడు భాష వాడుతున్నారు’- బండి సంజయ్

    బండి సంజయ్

    ఫొటో సోర్స్, bjp telangana

    ఎందరికో ఆదర్శవంతమైన భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు భాషను వాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కరోనా సమయంలో ప్రజలు తల్లడిల్లుతుంటే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించినందుకు ఆయనను తిడుతున్నారా? ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నారా? లేదా యుక్రెయిన్ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కాపాడినందుకు ఆయనను తిడుతున్నారా? అని ఆయన కేసీఆర్‌ను నిలదీశారు.

    మెదీపై విమర్శలు చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు.

    నరేంద్ర మోదీ సైన్యం తెలంగాణలో యుద్ధానికి సిద్ధమైంది.

    బీజేపీ సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

  9. ‘కుమారుడ్ని సీఎం చేయాలనే ఆలోచన తప్ప కేసీఆర్‌కు ఇంకో చింత లేదు’- అమిత్ షా

    అమిత్ షా

    ఫొటో సోర్స్, bjp telangana

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుమారుడు కేటీఆర్‌ను ఎలా ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఎలాంటి చింత లేదని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.

    ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర యువత కోసం ఏం చేశారని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు.

    తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

    కేసీఆర్ పూర్తి చేయని హామీలన్నీ బీజేపీ నెరవేరుస్తుందని చెప్పారు.

    తెరాస కారు స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని వ్యాఖ్యానించారు.

    కేసీఆర్ ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని, రాబోయే రోజుల్లో సచివాలయానికి వెళ్లేది తామేనని ఆయన అన్నారు.

  10. హైదరాబాద్‌ను 'భాగ్యనగరం' అన్న మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, narendramodi/twitter

    మరి కాసేపట్లో హైదరాబాద్ సభలో ప్రసంగించబోతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల రైతులు, మహిళలు, యువతీయువకులు, వెనుకబడిన వర్గాలు ప్రయోజనాలు అందుకుంటున్నాయని ఆయన ఆ ట్వీట్‌లో అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అంతకుముందు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, “బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ కొత్త రాజకీయాల గురించి మాట్లాడారు. సరికొత్త రాజకీయ వ్యవస్థ, రాజకీయ వాతావరణం గురించి చెప్పారు. హైదరాబాద్ భాగ్యనగరం అని, ఐక్య భారతానికి సర్దార్ పటేల్ పునాదులు వేశారని, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు” అని వివరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప సభ

    బీజేపీ విజయ సంకల్ప సభ

    ఫొటో సోర్స్, bjp telangana

    హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ ప్రారంభమైంది.

    బీజేపీ ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా సభ వద్దకు చేరుకుంటున్నారు.

    కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేదికపైకి వచ్చారు.

    కాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా వేదిక వద్దకు చేరుకోనున్నారు.

  12. ఈ హోటల్‌కు విద్యుత్ శాఖే ఎదురు డబ్బులు చెల్లిస్తుంది

  13. అమెరికా: ట్రక్కులో మృతదేహాల కేసులో డ్రైవర్ చేసిన చిన్న తప్పిదమే 53మంది ప్రాణాలను బలి తీసుకుందా

    అమెరికా

    ఫొటో సోర్స్, REUTERS

    అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ కంటైనర్ ట్రక్కు నుంచి 53 మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటన జూన్ 27న జరిగింది. ఈ ట్రక్కు టెక్సాస్ శివార్లలోని శాన్ ఆంటోనియాలో రోడ్డు పక్కన కనిపించింది.

    ట్రక్కులో సజీవంగా ఉన్న వ్యక్తులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల బాధితులకు వడదెబ్బ తగిలి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

    అయితే, ట్రక్కులో ఎయిర్ కండీషనర్ పనిచేయడం లేదన్న సంగతి ట్రక్కు డ్రైవర్‌కు తెలియలేదని కోర్టు పత్రాలు చెబుతున్నాయి.

  14. హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలకనందుకు తెలంగాణ సీఎంపై బీజేపీ అసంతృప్తి

    స్మృతి ఇరానీ

    ఫొటో సోర్స్, ANI

    హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ సీనియర్ నేతలందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

    మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎయిర్‌పోర్టుకు రాలేదని బీజేపీ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది.

    శనివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

    "ప్రధానమంత్రి గారు ఎనిమిదేళ్ల క్రితం పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ నాయకుడినైనా గౌరవ మర్యాదలతో స్వయంగా కలుస్తున్నారు. నేడు ఇక్కడ చూసిన దురదృష్టకర ప్రవర్తన రాజ్యాంగ గౌరవానికి భంగం కలిగించడమే కాక భారతదేశ సంస్కృతి, గౌరవానికి భంగం కలిగిస్తుంది. కేసీఆర్ గారు వ్యక్తిని మాత్రమే అవమానించలేదు, సంస్థను అవమానించారు" అంటూ విమర్శించారు.

  15. ఖాల్సా ఎయిడ్ వ్యవస్థాపకుడు రవి సింగ్ ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిషేధించారు

    రవి సింగ్

    ఫొటో సోర్స్, Ravi Singh-Khalsa Aid/Facebook

    ఫొటో క్యాప్షన్, రవి సింగ్

    ఖాల్సా ఎయిడ్ వ్యవస్థాపకుడు రవి సింగ్ ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిషేధించారు. ఈ విషయాన్ని రవిసింగ్ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.

    నిషేదిత ట్విట్టర్ ఖాతా స్క్రీన్‌షాట్ పెడుతూ, "బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం నిజస్వరూపం ఇది. సిక్కుల సోషల్ మీడియా ఖాతాలు నిషేధించి మా గొంతు నొక్కేయలేరు. మా గొంతు మరింత పెరుగుతుంది" అని రవి సింగ్ రాశారు.

    రవి సింగ్

    ఫొటో సోర్స్, Facebook/Ravi Singh-Khalsa Aid

    భారతదేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో 2020-2021లో ప్రారంభమై, ఒక సంవత్సరం పాటు సాగిన రైతు ఉద్యమానికి మద్దతునిచ్చిన కొన్ని పెద్ద సంస్థలలో ఖాల్సా ఎయిడ్ ఒకటి.

    రైతు ఉద్యమాన్ని భారతదేశం వెలుపల ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో ఈ సంస్థ ముఖ్య పాత్ర పోషించింది.

    1999లో బ్రిటన్‌లో స్థాపించిన ఖాల్సా ఎయిడ్ లాభాపేక్ష ఆశించని సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సేవలు అందిస్తుంది.

  16. గుజరాత్ అల్లర్లు: 20 ఏళ్లు గడిచిన తర్వాత ఆ నాటి కేసుల పరిస్థితి ఏమిటి, జైలు కెళ్లింది ఎందరు, బాధితులు ఏమంటున్నారు?

  17. జమ్మూకశ్మీర్‌లోని రియాసీలో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులు

    లష్కర్‌

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

    జమ్మూ-కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు సాయుధ తీవ్రవాదులను గ్రామస్థులు ఆదివారం పోలీసులకు అప్పగించారు.

    పట్టుబడిన తీవ్రవాదుల్లో ఒకరిని లష్కరే కమాండర్‌గా చెబుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    పీటీఐ సమాచారం ప్రకారం, రాజౌరీ నివాసి, లష్కరే తోయిబా కమాండర్ తాలిబ్ హుస్సేన్ ఇటీవల ఆ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు పేర్కొన్నారు.

    మరో తీవ్రవాది ఫైజల్ అహ్మద్ దార్ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామ్ జిల్లా నివాసి అని సమాచారం.

    ఇద్దరి దగ్గరి నుంచి రెండు ఏకే అసాల్ట్ రైఫిళ్లు, ఏడు గ్రెనేడ్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

    ధైర్యసాహసాలతో తీవ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులకు జమ్మూ-కశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్బాగ్ సింగ్ రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

  18. మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నార్వెకర్

    మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వెకర్ ఎన్నికయ్యారు.

    స్పీకర్ ఎన్నిక కోసం జరిగిన పోలింగ్ లో నార్వేకర్‌కు 164 ఓట్లు రాగా, ప్రతిపక్ష కూటమి అభ్యర్ధికి 107 ఓట్లు వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మరోవైపు ఇవాళ శాసన సభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం సీలు వేసి కనిపించింది.

    "శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని మూసివేయడమైంది" అని నోటీసు అంటించి ఉన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  19. మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం.. స్పీకర్ ఎన్నిక జరగనుంది

    మహారాష్ట్ర

    ఫొటో సోర్స్, Maharashtra Assembly/Yotube

    మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆదివారం నుంచి ప్రత్యేక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలోనే శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

    ప్రతి ఎమ్మెల్యే సభలో నిలబడి తనను తాను పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అసెంబ్లీ స్పీకర్‌ పదవికి పోటీ చేస్తున్న వ్యక్తుల్లో తమ ఓటు ఎవరికో తెలపాలి. సభలో ఉన్న 287 మంది ఎమ్మెల్యేలు ఇలాగే చేయాల్సి ఉంటుంది.

    స్పీకర్ పదవికి రాహుల్ నర్వేకర్, రాజన్ సాల్వీల మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వి పోటీలో ఉన్నారు.

    మహారాష్ట్రలోని 287 సీట్ల అసెంబ్లీలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే కూటమికి 162 సీట్లు ఉండగా, ప్రతిపక్షానికి 125 సీట్లు ఉన్నాయి.

    స్పీకర్ పదవికి పోటీని షిండే-ఫడణవీస్ ప్రభుత్వానికి ఎదురయ్యే తొలి పరీక్షగా భావిస్తున్నారు.

  20. మహారాష్ట్ర: నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకే అమరావతి వాసి ఉమేశ్ కొల్హే హత్యకు గురయ్యారా?

    ఉమేశ్ కొల్హే

    మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21న ఉమేశ్ కొల్హే అనే కెమిస్ట్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు సంబంధం ఉందని కొందరు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

    గత వారం ఉదయపూర్‌లో టైలర్ కన్నయ్యలాన్ హత్య కూడా ఇదే విషయానికి సంబంధించినదని పోలీసులు తెలిపారు.

    అమరావతి, ఉదయపూర్ కేసులకు ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా అని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు.