మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: ‘‘పక్క దేశాల్లో ఇలా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు’’ – నసీరుద్దీన్ షా

‘‘ఇలాంటి వ్యాఖ్యలను పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో చేస్తే మరణ శిక్ష విధిస్తారు. ఇవి దైవదూషణగా పరిగణిస్తారు’’అని నసీరుద్దీన్ షా అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. అల్‌ఖైదా హెచ్చరిక: ‘మొహమ్మద్‌‌ ప్రవక్తను అవమానించే వారిని చంపేస్తాం.. ఆత్మాహుతి దాడులు చేస్తాం’

  2. రెపో రేటును 4.90 శాతానికి పెంచిన ఆర్‌బీఐ.. పెరగనున్న ఈఎంఐ భారం

    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

    ఫొటో సోర్స్, ANI

    భారతీయ రిజర్వు బ్యాంకు రెపో రేటును మరోసారి పెంచింది. ఇది ఈఎంఐ చెల్లించే వారిపై భారాన్ని పెంచనుంది.

    ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నాడు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచటంతో ఇది 4.90 శాతానికి పెరిగింది.

    ఈ పెంపును ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

    దీనికి ముందు మే 4వ తేదీన ఆర్‌బీఐ అకస్మాత్తుగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది.

    పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్ రేటు)ను 4.65 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్ రేటు)ను, బ్యాంకు రేటును 5.15 శాతానికి సవరించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు.

    2022^23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 6.7 శాతం వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    ప్రాధమిక అంచనాల ప్రకారం 2021-22 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉందన్నారు. ఆ సంవత్సరపు వాస్తవ జీడీపీ స్థాయి కరోనా మహమ్మారి ముందు 2019-20 ఆర్థిక సంవత్సరపు జీడీపీ స్థాయిని మించిపోయిందన్నారు.

  3. దేశంలో కొత్తగా 5,233 కోవిడ్ కేసులు నమోదు

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,233 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

    ప్రభుత్వ సమాచారం ప్రకారం గడచిన ఒక్క రోజులో మరో ఏడుగురు కోవిడ్ వల్ల చనిపోయారు.

    ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 28,857కి పెరిగింది.

    కోవిడ్ పరీక్షల్లో రోజు వారీ పాజిటివిటీ రేటు గత 24 గంటల్లో 1.62 శాతంగా ఉండగా.. వారం వారీ పాజిటివిటీ రేటు 0.91 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. నయనతార, నేను రేపు మహాబలిపురంలో పెళ్లి చేసుకుంటున్నాం: విగ్నేష్ శివన్

    నయనతార, విగ్నేష్ శివన్

    ఫొటో సోర్స్, wikkiofficial

    సినీ నటి నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్‌లు ఈ నెల 9వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. విగ్నేష్ ఈ విషయాన్ని మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ధృవీకరించారని ఇండియన్ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో తెలిపింది.

    ఆ కథనం ప్రకారం.. నయనతార, విగ్నేష్ శివన్‌లు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

    ‘‘నేను ఒక రచయిత/దర్శకుడిగా నా కెరీర్ మొదలుపెట్టాను’’ అంటూ తన కెరీర్ గురించి, సినీ పరిశ్రమలో ప్రస్థానం గురించి విగ్నేష్ శివన్ మంగళవవారం నాడు మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘ప్రొఫెషనల్‌గా నాకు మీరు ఇచ్చిన ఆశీర్వాదాల తరహాలోనే నా వ్యక్తిగత జీవితంలోనూ మీ ఆశీర్వాదాలు కావాలి. నేను నా వ్యక్తిగత జీవితంలో తర్వాతి దశకు వెళుతున్నాను. లవ్ ఆఫ్ మై లైఫ్ నయనతారతో జూన్ 9వ తేదీన నాకు పెళ్లి జరుగబోతోంది’’ అని వెల్లడించారు.

    ‘‘కుటుంబ సభ్యులు, సన్నిహితులైన స్నేహితుల మధ్య మహాబలిపురంలో ఈ వివాహం జరుగుతుంది. తొలుత తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకుందామని మేం ప్లాన్ చేశాం. కానీ ఏర్పాట్ల సమస్యల వల్ల అది జరగలేదు’’ అని చెప్పారు.

    పెళ్లయిన తర్వాత మధ్యాహ్నం తమ పెళ్లి ఫొటోలను మీడియాకు షేర్ చేస్తామన్నారు.

    పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
    Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of Instagram ముగిసింది

  5. అల్లా, మొహమ్మద్‌‌ ప్రవక్తల ఫొటోలు ఎందుకు కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా?

  6. ఇస్లామిక్ స్టేట్ మహిళా దళానికి శిక్షణనిచ్చినట్లు నేరం అంగీకరించిన అమెరికన్ మహిళ

    అలిసన్ ఫ్లూక్-ఇక్రెన్

    ఫొటో సోర్స్, ALEXANDRIA SHERIFF'S OFFICE

    ఇస్లామిక్ స్టేట్ ఇన్ సిరియాకు చెందిన మహిళా తీవ్రవాదుల పటాలానికి తాను సారథ్యం వహించానని, 100 మందికి పైగా మహిళలు, బాలికలకు శిక్షణనిచ్చానని అమెరికా మహిళ అలిసన్ ఫ్లూక్-ఇక్రెన్ నేరాన్ని అంగీకరించారు.

    అమెరికా భూభాగం మీద దాడులకు కుట్ర పన్నానని కూడా ఆమె నేరాన్ని అంగీకరించారు.

    అమెరికాలోని కాన్సస్ రాష్రానికి చెందిన మాజీ బయాలజీ విద్యార్థిని అయిన అలిసన్ (ఇప్పుడు ఆమె వయసు 42 ఏళ్లు) ఆ తర్వాత స్కూలు టీచరుగా పనిచేశారు. ఆమెకు సంతానం కూడా ఉన్నారు. ఆమె 2011లో అమెరికా వదిలి వెళ్లారు. సిరియా కన్నా ముందు లిబియాలో ఒక ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేశారు. సిరియా వెళ్లటానికి ముందు ఈజిప్టు, టర్కీల్లో నివసించారు.

    అలిసన్ కేసులో అక్టోబర్‌లో కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆమెకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది.

    ఇస్లామిక్ స్టేట్‌తో పనిచేస్తున్నపుడు.. సిరియా రాజధాని రక్కా కేంద్రంగా ఐసిస్ మహిళా దళం ఖతిబా నుసేబాకు అలిసన్ నేతృత్వం వహించారు.

    ఈ మహిళా దళానికి తాను శిక్షణిచ్చానని ఆమె మంగళవారం నాడు వర్జీనియా కోర్టులో అంగీకరించారు. అయితే ఈ దళంలోకి పిల్లలను చేర్చుకోవటం కోసం తాను ప్రయత్నించలేదన్నారు.

    అమెరికా భూభాగం మీద ఒక యూనివర్సిటీ మీద, షాపింగ్ మాల్ మీద దాడులు చేసే అంశం గురించి తాము చర్చించినట్లు కూడా ఆమె అంగీకరించారు.

    ఆమె రెండో భర్త.. 2012లో లిబియా రాజధాని బెంఘాజిలో అమెరికా దౌత్యకార్యాలయం మీద దాడిచేసిన తీవ్రవాద సంస్థ అన్సార్ అల్-షరియా సభ్యుడని కొన్ని పత్రాలు చెప్తున్నాయి.

  7. అవని లేఖరా సరికొత్త ప్రపంచ రికార్డు.. పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో స్వర్ణం

    అవని లేఖరా

    భారత షూటర్, టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ అవని లేఖరా.. పారా షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించారు.

    ఫ్రాన్స్‌లోని చతోహులో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో అవని 250.6 స్కోరు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో.. ఆమె తన పాత ప్రపంచ రికార్డు 249.6 స్కోరును తానే బద్దలు కొట్టారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ గెలుపుతో 2024 పారిస్ పారాలింపిక్స్ పోటీల్లో పాల్గొనటానికి తన స్థానాన్ని సంపాదించుకున్నారు.

    పారా షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో పోలండర్ క్రీడాకారిణి ఎమిలా బాబ్స్కా 247.6 పాయింట్లతో రజత పతకం గెలుచుకోగా, స్వీడన్‌కు చెందిన అన్నా నార్మన్ 225.6 స్కోరుతో కాంస్య పతకం గెలుపొందారు.

    ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. మూడు రోజుల కిందట అవని లేఖరా కోచ్‌కు, ఆమె సహాయకుడిగి తొలుత వీసాలు నిరాకరించటంతో ఆమె ఈ టోర్నమెంట్‌కు హాజరుకాలేని పరిస్థితి తలెత్తింది. అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, క్రీడా మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవటంతో ఈ సమస్య పరిష్కారమైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    దీంతో పారా షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న అవని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ స్వర్ణ పతకం సాధించారు.

    ‘‘చతోహు 2022లో ఆర్2 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం సాధించటం, పారిస్2024కు భారతదేశానికి తొలి కోటా సాధించటం గర్వంగా ఉంది. పారాలింపిక్స్ అనంతరం ఇవి నా తొలి అంతర్జాతీయ క్రీడా పోటీలు. నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు’’ అంటూ అవని లేఖరా ట్వీట్ చేశారు.

  8. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  9. మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: ‘‘పక్క దేశాల్లో ఇలా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు’’ – నసీరుద్దీన్ షా