మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: భారత హైకమిషనర్ ఎదుట మలేసియా నిరసన
మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మలేసియా ఖండించింది.
లైవ్ కవరేజీ
ముఖ్యాంశాలు
ఉత్తర కొరియా అణ్వాయుధాన్ని పరీక్షించే అవకాశముందన్న భయాల మధ్య.. ఆ దేశానికి అమెరికా కఠిన హెచ్చరికను జారీచేసింది. అణ్వాస్త్రాన్ని పరీక్షించినట్లయితే తక్షణమే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని అమెరికా ఉప విదేశాంగ మంత్రి వెండీ షెర్మాన్ ఉత్తర కొరియాను హెచ్చరించారు.
తెలంగాణలో ఇకపై కొత్తగా నియమితులయ్యే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని, ఏపీలో అభివృద్ధి లేదు, పెట్టుబడులు రావడం లేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మలేసియా ఖండించింది.
నైజీరియాలోని ఒక కేథలిక్ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో సుమారు 50 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
డొమినికన్ రిపబ్లిక్ పర్యావరణశాఖ మంత్రి ఒర్లాండ్ జార్జ్ మెరాను ఆయన ఆఫీసులోనే కాల్చి చంపారు. కాల్పులు జరిపింది మంత్రి మిత్రుడే అని అధికారులు చెబుతున్నారు.
మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: భారత హైకమిషనర్ ఎదుట మలేసియా నిరసన

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, మలేసియా ప్రధాని సబ్రి యాకుబ్ మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మలేసియా ఖండించింది.
ఈ విషయంపై నిరసన తెలిపేందుకు భారత హైకమిషనర్‌కు మలేసియా విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
నూపుర్ శర్మతోపాటు ఈ వివాదానికి కేంద్ర బిందువైన నవీన్ జిందాల్‌లపై చర్యలు తీసుకోవడాన్ని మలేసియా స్వాగతించింది.
ఇస్లామోఫోబియాకు కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా మలేసియా సూచించింది.
ఇప్పటికే ఖతర్, కువైట్, సౌదీ అరేబియా, అఫ్గానిస్తాన్, ఇరాన్ కూడా మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ఖండించాయి.
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్: సాయంత్రం 6.15 నుంచి 7.30 మధ్య ఏం జరిగిందంటే
ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది: జేపీ నడ్డా
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని, ఏపీలో అభివృద్ధి లేదు, పెట్టుబడులు రావడం లేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటుచేసిన బీజేపీ ‘గోదావరి గర్జన’ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమనిపిస్తోందన్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏమేం చేసిందో నడ్డా ఈ సభలో వివరించారు.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అంటే ఇసుక మాఫియా, భూ మాఫియా, లిక్కర్ మాఫియా అన్నట్లుగా ఉందని... ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం, ఎమ్మెల్సీ అనంత బాబుపై హత్య కేసు వంటి అనేక అంశాలను నడ్డా తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, bjp
ఏంజలినా జోలీ నాకు హాని చేయాలని చూసింది – బ్రాడ్ పిట్
శాస్త్రవేత్తలు కరవును ముందుగానే ఎలా అంచనా వేస్తారు
తెలంగాణలో కొత్తగా నియమితులయ్యే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ఇకపై కొత్తగా నియమితులయ్యే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేఖ రాయగా.. ప్రభుత్వం అందుకు అంగీకరించింది.
గోవాలో బ్రిటిష్ మహిళపై మసాజ్ సాకుతో అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images
గోవాలో ఒక బ్రిటిష్ మహిళ మీద ఆమె జీవిత భాగస్వామి సమక్షంలోనే అత్యాచారం చేసిన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. స్థానికుడైన నిందితుడు విన్సెంట్ డిసౌజా (32) మసాజ్ చేస్తాననే నెపంతో సదరు బ్రిటిష్ మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తర గోవాలోని అరాంబోల్ బీచ్‌లో అక్రమంగా మసాజ్ సేవలు అందించే ఒక బృందం సభ్యుడు విన్సెంట్ డిసౌజా. ఇక్కడికి వచ్చే విదేశీ యాత్రికులు మసాజ్‌ను చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
బాధితురాలైన బ్రిటిష్ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తాను, తన భాగస్వామితో కలిసి అరాంబోల్ బీచ్ దగ్గర స్వీట్ వాటర్ లేక్ వద్ద పడుకుని ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో మసాజ్ చేస్తాననే సాకుతో నిందితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.
ఈ ఘటన జూన్ 2వ తేదీన జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ మహిళ బ్రిటన్‌లోని తన కుటుంబంతో సంప్రదించిన అనంతరం సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన గంట లోపే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు, నిందితుడి ఇరువురికీ సోమవారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు.
‘అణ్వస్త్రాన్ని పరీక్షిస్తే.. తక్షణమే తీవ్ర పర్యవసనాలు’: ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక

ఫొటో సోర్స్, ANI
ఉత్తర కొరియా అణ్వాయుధాన్ని పరీక్షించే అవకాశముందన్న భయాల మధ్య.. ఆ దేశానికి అమెరికా కఠిన హెచ్చరికను జారీచేసింది. అణ్వాస్త్రాన్ని పరీక్షించినట్లయితే తక్షణమే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని అమెరికా ఉప విదేశాంగ మంత్రి వెండీ షెర్మాన్ ఉత్తర కొరియాను హెచ్చరించారు.
అటువంటి పరిస్థితి తలెత్తితే ప్రపంచం మొత్తం ప్రతిస్పందిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
దక్షిణ కొరియా విదేశాంగ మంత్రితో సోల్‌లో భేటీ అయిన అనంతరం వెండీ షెర్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర కొరియా 2017 తర్వాత తన తొలి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించటానికి సంసిద్ధమవుతోందని కొంత కాలంగా సూచనలు వస్తున్నాయి.
ఉత్తర కొరియా తన ప్రధాన అణు కేంద్రం దగ్గర కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అధిపతి సోమవారం నాడు హెచ్చరించారు.
నూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి దిల్లీ పోలీసుల భద్రత

ఫొటో సోర్స్, NUPURSHARMABJP
బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి దిల్లీ పోలీసులు భద్రత కల్పించారు.
మహమ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత తనకు, తన కుటుంబానికి హత్యా బెదిరింపులు వచ్చాయని నూపుర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ ఒక అధికారిని ఉటంకిస్తూ తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. నూపుర్ శర్మ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆమెకు, ఆమె కుటుంబానికి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
బీజేపీ నేతలు నూపుర్ శర్మ, జిందాల్‌లు మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం పట్ల పలు ముస్లిం దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఆదివారం నాడు నూపర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ, జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చైనా జనాభా ఎందుకు తగ్గిపోతోంది? ప్రభుత్వం పన్ను రాయితీలు, ప్రోత్సాహాలు ఇస్తున్నా ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు కనట్లేదు?
నైజీరియా చర్చి కాల్పుల్లో సుమారు 50 మంది మృతి!

ఫొటో సోర్స్, BBC/Olbumide Owaduge
నైజీరియాలోని ఒక కేథలిక్ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో సుమారు 50 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
ఆదివారం ప్రార్థనల కోసం చర్చికి వచ్చిన వారి మీద మోటార్ సైకిళ్లు వేసుకుని వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
అయితే ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు అనే విషయాల మీద స్పష్టమైన సమాచారం లేదు. ఆ కేథలిక్ చర్చిలో 1,200 మంది వరకు ప్రార్థనలు చేసుకోవచ్చని, దాడి జరిగిన సమయంలో చర్చి పూర్తిగా నిండి పోయి ఉందని స్థానిక బిషప్ తెలిపారు.
నైజీరియాలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ బొకొ హరాం తరచుగా చర్చిల మీద దాడులు చేస్తూ ఉంటుంది.

ఫొటో సోర్స్, BBC/Olbumide Owaduge
డొమినికన్ రిపబ్లిక్ మంత్రి కాల్చివేత

ఫొటో సోర్స్, THE PRESIDENCY OF THE DOMINICAN REPUBLIC
ఫొటో క్యాప్షన్, ఒర్లాండ్ జార్జ్ మెరా డొమినికన్ రిపబ్లిక్ పర్యావరణశాఖ మంత్రి ఒర్లాండ్ జార్జ్ మెరాను ఆయన ఆఫీసులోనే కాల్చి చంపారు. కాల్పులు జరిపింది మంత్రి మిత్రుడే అని అధికారులు చెబుతున్నారు.
55 ఏళ్ల ఒర్లాండ్ మీద సుమారు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.
ఒర్లాండ్ జార్జ్ మెరా తండ్రి సాల్వడర్ జార్జ్ బ్లాంకో గతంలో డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షునిగా పని చేశారు.
పొలాల్లో సోలార్ ప్యానెళ్లు.. ప్రభుత్వానికి కూడా కరెంటు అమ్ముతున్న రైతులు
వంట గ్యాసును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా?
పుణెకు చెందిన ప్రియదర్శన్ బయో గ్యాస్ ఉత్పత్తి చేసే ఒక పరికరాన్ని తయారు చేశారు. ప్రస్తుతం వీటిని 300 ఇళ్లలో వాడుతున్నారు.
ఈ మోడల్ పరికరంతో మూడు రకాల ప్రయోజనాలున్నాయంటున్న ప్రియదర్శన్ దీంతో గ్యాస్ ఎలా ఉత్పత్తి చేస్తున్నారు?
పోస్ట్ YouTube స్కిప్ చేయండిGoogle YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
రఘునందన్ రావు మీద తెలంగాణ పోలీసుల కేసు

ఫొటో సోర్స్, Facebook/Raghunandan Rao Madhavaneni
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో బాధితురాలి ఫోటోలు, వీడియోలను బయటకు విడుదల చేశారనేది పోలీసులు రఘునందన్ రావు మీద మోపిన అభియోగం.
లైంగిక నేరాల బాధితులను సమాజం నుంచి వెలివేయడం, సామాజికంగా న్యూనతకు గురి చేయడం లేదా, సమాజంలో ఆమెను ఒక బాధితురాలిగా చూపేలా చేసే చర్యలను ఐపీసీ సెక్షన్-228ఎ కింద నేరంగా పరిగణిస్తారు.
ఇప్పుడు రఘునందన రావు మీద సెక్షన్-228ఎ కింది అబిద్స్ స్టేషన్లో కేసు పెట్టారు.
రఘునందన్ రావు శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు.
‘సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ అనుసరించి తాను బాధితురాలి వివరాలు బయటకు తెలియకుండా ఆమె ముఖం కనిపించకుండా ఎడిట్ చేసిన వీడియోలను విడుదల చేస్తున్నాను.’ అని నాడు ఆయన మీడియాకు చెప్పారు. ఆ ఫోటోలు తప్ప బాధితురాలి పేరు, ఇతర వివరాలు ఆయన బయటపెట్టలేదు.
అయితే ఆ తరువాత పెద్ద సంఖ్యలో ఆ వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో న్యాయ సలహా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు రఘునందన్ మీద కేసు పెట్టారు.
అవిశ్వాస తీర్మానం నెగ్గిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Reuters
పార్టీ ఎంపీలు తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నెగ్గారు. కన్జర్వేటివ్ పార్టీ లీడర్ అయిన బోరిస్‌కు అనుకూలంగా 211 మంది ఎంపీలు ఓటు వేయగా 148 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి పార్టీలకు హాజరయ్యారనే ఆరోపణలు బోరిస్ జాన్సన్ మీద ఉన్నాయి.
అలాగే ప్రజల జీవన వ్యయం పెరగడంతో పాటు ప్రభుత్వం పన్నులు పెంచడం మీద కూడా కొందరు టోరీ ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ మీద పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానం ఓడిపోయి ఉంటే బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉండేది.
అవినీతి ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన గుప్తా సోదరుల అరెస్ట్.. వెనక్కి తీసుకొచ్చి బోనులో నిలబెడతామన్న ప్రధాని
ఎలాన్ మస్క్: ‘అడిగిన డేటాను ట్విటర్ ఇవ్వడం లేదు’

ఫొటో సోర్స్, Reuters
ఫేక్ ఖాతాలకు సంబంధించి తనకు సరైన సమాచారం ఇవ్వకుంటే ట్విటర్‌ను కొనేందుకు కుదుర్చుకున్న డీల్‌ను రద్దు చేసుకుంటానని ఎలాన్ మస్క్ హెచ్చరించారు.
సుమారు రూ.3 లక్షల కోట్లకు ట్విటర్‌ను కొనేందుకు కొద్ది నెలల కిందట ఆయన ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ట్విటర్ యూజర్ల గురించి తెలుసుకునేందుకు కావాల్సిన సమాచారాన్ని తనకు కంపెనీ ఇవ్వడం లేదంటూ నియంత్రణ సంస్థలకు రాసిన లేఖలో మస్క్ పేర్కొన్నారు.
స్పామ్, ఫేక్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా తెలిసేంత వరకు ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తన వైఖరిని ట్విటర్ సమర్థించుకుంది. మొత్తం యూజర్లలో స్పామ్, ఫేక్ అకౌంట్ల వాటా సుమారు 5శాతం ఉండొచ్చని కంపెనీ చెబుతోంది. కానీ దీన్ని మస్క్ నమ్మడం లేదు. అవి అంతకంటే ఎక్కువ ఉంటాయని ఆయన భావిస్తున్నారు.
