You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. పతనం అంచున కమ్యూనిస్టుల చివరి కోట

    కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మెజార్టీ స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో కేరళలో కమ్యూనిస్టుల కోట పతనం అంచున నిలబడింది. ఇది కమ్యూనిస్టు పార్టీకి చివరి కోట.

    పశ్చిమ బెంగాల్లో 2011 అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓటమి తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్కిస్ట్) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ వామపక్ష ఉద్యమానికి ఊపిరిపోసింది.

    కేరళ ప్రజలు దశాబ్దాలుగా ఒకసారి సీపీఎం మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటములను ఎన్నుకుంటూ వచ్చారు. కానీ 2021లో ఈ సంప్రదాయానికి తెరదించుతూ వరుసగా రెండోసారి ఎల్‌డీఎఫ్‌ని ఎన్నుకున్నారు.

    తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సందడిగా ఉన్నారు. వామపక్ష నేతలు వెనుకబడ్డారనే వార్తలు వచ్చినప్పుడల్లా వారు సంబరాలు చేసుకుంటున్నారు.

    ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెనుకంజలో ఉన్నారనే వార్త అక్కడి అతిపెద్ద టెలివిజన్ తెరపై కనిపించగానే కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. 80 ఏళ్ల ఈ వృద్దనేత పరిపాలనాదక్షుడిగానూ, రాజకీయ చాణక్యుడిగానూ పేరుగాంచారు.

    ‘‘ముఖ్యమంత్రి 3,4వేల ఓట్ల తేడాతో వెనుకబడటమంటే ఎల్‌డిఎఫ్ కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో తెలుపుతోంది’’ అని బీబీసీతో కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) సభ్యుడు అలోకవరియవల్లీ అన్నారు.

    కాంగ్రెస్ సీనియర్ నేతలు వీఎస్ సతీశన్, రమేష్ చెన్నితాల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నేతలు రాజీవ్ చంద్రశేఖర్, కె.సురేంద్రన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.

  2. భవానీపుర్‌లో మమత ఆధిక్యమెంత?

    పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారిపై దాదాపు 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా వార్తలలో నిలిచిన స్థానాలలో మమత పోటీ చేస్తున్న భవానీపుర్ కూడా ఉంది. ఈ నియోజకవర్గాన్ని మమతకు కంచుకోటగా పరిగణిస్తుంటారు.

    అయితే ఈసారి మమతకు గట్టిపోటీ ఇచ్చేందుకు విపక్షనేత సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దింపింది. కిందటిసారి ఎన్నికలలో మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అప్పుడు సువేందు అధికారి 2వేల ఓట్ల మెజారిటీతో మమతను ఓడించారు.

    కానీ ఈసారి మమతకు గట్టిపట్టున్న భవానీపుర్‌లోనే సువేందు ఆమెపై పోటీకి దిగారు. దీంతోపాటు సువేందు తనకు బాగా పట్టున్న నందిగ్రామ్‌ నుంచి కూడా పోటీలో ఉన్నారు.

  3. అసెంబ్లీ ఎన్నికలు 2026 ట్రెండ్స్: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యం ?

    తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ అధికార డీఎంకే 63, ఏఐడీఎంకే 67 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, టీవీకే 104 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ సాధనకు కావాల్సినవి 118 స్థానాలు.

    ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పశ్చిమబెంగాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. టీఎంసీ 124 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 149 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 4 స్థానాలు, వామపక్షాలు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో అధికారం దక్కాలంటే 148 స్థానాల్లో విజయం సాధించాలి.

    అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య మెజార్టీ విషయంలో చాలా అంతరం కనిపిస్తోంది.ఇక్కడ బీజేపీ 96 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 27 స్థానాలలోనూ, ఏఐయూడీఎఫ్ 2 స్థానాలలోనూ, ఇతరులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు.

    వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో ఈసారి ఆ పార్టీలు వెనకబడినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి 48 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, యూడీఎఫ్ కూటమి 91, ఎన్డీయే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

    కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 22 స్థానాలలో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 4 స్థానాలలో, ఇతరులు 4 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.

  4. 'బ్రిజ్ భూషణ్ ఇలాకాలో పోటీలా? ఆరుగురు బాధితుల్లో నేనూ ఒకరిని' : రెజ్లర్ వినేశ్ ఫొగాట్

  5. అక్రమ మద్యం దుకాణంపై దాడి చేసి, ధ్వంసం చేసిన మహిళలు

  6. వేసవిలో ఏసీలు పేలిపోవడానికి కారణాలేంటి, పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  7. ప్రేమ, అబద్ధాలు, దెయ్యాలు: భారతీయులు విపరీతంగా చూస్తోన్న ఈ 2 నిమిషాల 'మైక్రో డ్రామా'ల కథేంటి?

  8. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఎలా మారుస్తాయి? - 7 కీలకాంశాలు

  9. ఎండాకాలంలో వండిన ఎంతసేపటికి ఆహారం పాడవుతుంది? ఫుడ్ పాయిజన్‌గా ఎప్పుడు మారుతుంది?

  10. ఏపీ: జీతాలు పెంచాలంటూ కార్మికుల సమ్మె, ఆంధ్ర పేపర్‌ మిల్లును మూసేసిన యాజమాన్యం

  11. అది పాత పెంకుటిల్లు కాదు.. పెంపుడు జంతువులకు ఆధునిక వైద్యశాల

  12. పశ్చిమ బెంగాల్: పోలింగ్ తర్వాత కూడా రాజకీయాలు ఎందుకు ఉద్రిక్తంగా ఉన్నాయి?

  13. పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?

  14. దాదాపు అందరి ఫోన్లలో ఒకేసారి 'అలర్ట్' మెసేజ్ ఎందుకొచ్చింది? అసలు విషయమేంటి?

  15. ‘ఏఐ’తో ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ, ఈ మోసం ఎలా బయటపడింది?

  16. ఈవీఎంలో ఏం ఉంది? పార్టీలకు, ప్రజలకు అంతుచిక్కని పశ్చిమబెంగాల్ ఎన్నికలు

  17. అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?

  18. తమిళనాడు: 'విజయ్ పార్టీ అధికారంలోకి రావచ్చన్న ఒక ఎగ్జిట్ పోల్ అంచనా'పై అక్కడి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

  19. తెలంగాణ: కవిత పార్టీ పేరు వారంలోపే ఎందుకు మారింది?

  20. జెట్లీ: జేమ్స్‌‌ బాండ్ హీరోగా సత్య ప్రయత్నం అలరించిందా?