సాక్షి సింగ్ ధోనీ: ‘రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కారణమేంటి?’
జార్ఖండ్‌లో విద్యుత్ కోతల మీద మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘చాలా సంవత్సరాల నుంచి జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? ఒక ట్యాక్స్ పేయర్‌గా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. విద్యుత్‌ను పొదుపు చేసేందుకు మా వంతు మేం కృషి చేస్తున్నాం.’ అంటూ సాక్షి సింగ్ ట్వీట్ చేశారు.
డిమాండ్‌కు తగిట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దేశవ్యాప్తంగా పవర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు అందడం లేదనే వార్తలు వస్తున్నాయి. వేసవి కాలం కావడంతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది.
బొగ్గును మరింత వేగంగా పవర్ ప్లాంట్లకు తరలించేందుకు గల అవకాశాలను పరిశీలించడానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ సోమవారం సమావేశమయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


