యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక

‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. ఒడిశాలో మెడికల్ పీజీ ప్రశ్న పత్రం లీకైందా, ఆరోపణలపై అధికారులు ఏమన్నారు?

  2. 'స్ట్రా' నాకిన ఇన్‌స్టా వీడియో వైరల్: ఫ్రెంచ్ విద్యార్థికి జరిమానా విధించిన కోర్టు

  3. ఆంధ్రప్రదేశ్: ‘వరిసాగు వద్దు’ అని ముఖ్యమంత్రి ఎందుకన్నారు, ఎల్ నినో ప్రభావమే కారణమా?

  4. ఇరాన్‌తో యుద్ధం: అమెరికా దగ్గర ఆయుధాలు ఖాళీ అవుతున్నాయా?

  5. రిమాండ్‌లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి: అకాడమీలో ఏం జరిగింది?

  6. డెలులూ - క్లాక్డ్ ఇట్ - వాస్తెగుణహూయా: పార్లమెంటులో ఎంపీలు కూడా ఈ జెన్ జెడ్ భాష ఎందుకు మాట్లాడుతున్నారు?

  7. కొండవెలగాడ: నాన్న 2010లో.. కొడుకు 2026లో.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం, రజతం

  8. 'నన్ను వాళ్లు చంపినా చంపొచ్చు.. అయినా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాను' అని షేక్ హసీనా ఎందుకు అన్నారు?

  9. ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

  10. సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...

  11. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  12. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    నరేంద్ర మోదీ, వీడియో తొలగింపు, మెటా

    ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  13. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

  14. రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

  15. అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

  16. ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

  17. ఫ్రాన్స్‌లో ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు

    ఫ్రాన్స్, కార్చిచ్చు, యూరప్

    ఫొటో సోర్స్, Kenzo TRIBOUILLARD / POOL / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, బోర్డో నగరానికి 15కిలోమీటర్ల దూరానికి కార్చిచ్చు వ్యాపించింది.

    ఫ్రాన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు నైరుతి నగరమైన బోర్డోకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బోర్డో మేయర్ థామస్ కాజెనావ్ చెప్పారు.

    "మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలొస్తే, అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో ప్రజలకు తాత్కాలిక వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మేయర్ థామస్ కాజెనవే అన్నారు.

    కార్చిచ్చుతో ప్రభావితమైన గిరోండ్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ పరిశీలించారు. దేశం ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని స్థాయిలో కార్చిచ్చు ప్రభావం ఉందని ఆయన చెప్పారు.

    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇది అత్యంత ఘోరమైన కార్చిచ్చు అని మేక్రాన్ తెలిపారు.

    కార్చిచ్చు ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్‌లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి.

    గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

  18. ‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’

  19. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్‌కు బంగారు పతకం.. మను భాకర్‌కు కాంస్యం

    భారత యువ షూటర్ ఈశా సింగ్, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్

    ఫొటో సోర్స్, Sanket Wankhade/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత యువ షూటర్ ఈశా సింగ్

    ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

    21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్‌కే పరిమితమైంది.

    కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్‌లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.

    ఈశా సింగ్‌కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

    మరోవైపు, మ్యూనిచ్‌లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.

  20. నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...