కరోనా మృతుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.ఏయే దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే:
కరోనా కేసుల సంఖ్య భారతదేశంలో 5,000 దాటింది. 150 మందికి పైగా కోవిడ్ వ్యాధితో చనిపోయారు. నాలుగు వందలకు పైగా కోవిడ్ బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు.
అమెరికాలో 14 వేలు దాటిన మరణాలు
కరోనావైరస్ సోకినవారు ఇప్పుడు అత్యధికంగా అమెరికాలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ దేశంలో 4,30,376 మందికి కోవిడ్ వ్యాధి సోకింది. 14,768 మంది చనిపోయారు. 23,865 మంది కోలుకున్నారు.
బ్రిటన్‌లో ఒకే రోజు 900 మరణాలు
బుధవారం బ్రిటన్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఒకే రోజులో 938 మంది కోవిడ్ వ్యాధితో చనిపోయారు. దాంతో, మృతుల సంఖ్య 7,097కు చేరింది.
ఇటలీ పరిస్థితి దయనీయంగా మారింది. 1.39 లక్షల కరోనాకేసులు ఈ దేశంలో నమోదయ్యాయి. 17,669 మంది చనిపోయారు.
కరోనావైరస్ కేసుల సంఖ్యలో స్పెయిన్, ఇటలీని దాటేసింది. 1.5 లక్షల వైరస్ బాధితులున్న స్పెయిన్‌లో 14,792 మంది మృత్యువాత పడ్డారు.
ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్ కొనసాగింపు
ఈ దేశంలో రెండోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అంటే, ఏప్రిల్ 15 తరువాత ముగియాల్సిన లాక్‌డౌన్ మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.
గత 24 గంటల్లో టర్కీలో 4,117 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 87 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కేసులు 38,226కు చేరుకోగా, మృతుల సంఖ్య 800 దాటింది.