పేద కుటుంబాలకు రూ.1000 సహాయం పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో 1.3 కోట్ల పేద కుటుంబాలకు రూ.1000 చొప్పున సహాయం పంపిణీ చేస్తున్నారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఈ మొత్తం అందజేస్తున్నారు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 11 లక్షలు దాటిన వైరస్ బాధితులు. 58 వేలు దాటిన మృతులు. అమెరికాలో 3 లక్షలకు చేరుకుంటున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య, మాస్క్ పెట్టుకోనంటున్న ట్రంప్.
ఆంధ్రప్రదేశ్‌లో 1.3 కోట్ల పేద కుటుంబాలకు రూ.1000 చొప్పున సహాయం పంపిణీ చేస్తున్నారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఈ మొత్తం అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 16 కొత్తకేసులతో కలిపి కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 180కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు వెల్లడించిన సమాచారం ప్రకారం 229 మందికి కోవిడ్ సోకింది.
తాజాగా కృష్ణా జిల్లాలో 4, కడప 4, గుంటూరు 3, కర్నూలు 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదు
జిల్లాల వారీగా కరోనా బాధితులు:
అనంతపురం-2
కర్నూలు -4
చిత్తూరు- 10
తూర్పు గోదావరి -11
విశాఖ -15
పశ్చిమ గోదావరి 15
ప్రకాశం - 18
గుంటూరు -23
కడప- 23
కృష్ణా- 27
నెల్లూరు -32
విజయవాడలో ఒకరు మృతి చెందగా.. నెల్లూరు, విశాఖ, కాకినాడ, ఒంగోలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు నలుగురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో మొత్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 175
ఇక తెలంగాణ విషయానికొస్తేఆ రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 32 మంది కోలుకోగా...11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 186.
ఇల్లు విడిచి బయటకు వచ్చే అమెరికన్లంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆ దేశ వైద్య మార్గదర్శకాలు సూచించినప్పటికీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు.
ఆఫీసులో ఉంటూ ముఖానికి మాస్కు ధరించి ఇతర దేశాల అధ్యక్షుల్ని, ప్రధానమంత్రుల్ని, రాజుల్ని, రాణుల్ని పలకరించలేనని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, శుక్రవారం నాడు విడుదలైన ఆరోగ్య మార్గదర్శకాలలో మాస్క్ వాడడం 'స్వచ్చందం' అనే అన్నారుగా అని తన వాదనను సమర్థించుకున్నారు. “మీరు పాటించాల్సిన అవసరం లేదు. నేను కూడా పాటిస్తానని అనుకోవడం లేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో తాజాగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,473కి చేరింది. సుమారు 7వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన వ్యక్తులు, అలాగే వారికి సేవలు చేస్తున్న వారు మాత్రమే మాస్కులు ధరించాలని వైద్య వర్గాలు సూచిస్తూ వచ్చాయి. కానీ ప్రతి ఒక్కరు ముఖానికి మాస్కు ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా నిరోధించడంలో వైరస్ సోకని వారి పాత్రే కీలకమని ఇటీవలి పరిశోధనల్లో స్పష్టమైనట్లు ట్రంపే అన్నారు. అదే సమయంలో తాను మాత్రం ఆరోగ్య వర్గాల సూచనలను పాటించలేనని తేల్చి చెప్పారు.