రామభక్తి, రహీం భక్తి కాదు దేశభక్తి కావాలి: ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్య అంశంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు చేశారు.
"దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్యపై తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పువప ఎవరూ గెలుపు-ఓటమిలుగా చూడకూడదు. రామభక్తి ఉన్నా, రహీమ్ భక్తి ఉన్నా ఇప్పుడు మనందరం దేశభక్తి అనే భావనను బలోపేతం చేయాలి. శాంతి, సామరస్యం, ఐక్యతను కాపాడాలని దేశ ప్రజలకు నా విన్నపం"
"సుప్రీంకోర్టు ఈ తీర్పు చాలా రకాలుగా ముఖ్యమైనది. సమస్యను పరిష్కరించడానికి న్యాయ ప్రక్రియను అనుసరించడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. ప్రతి పక్షం తమ తమ వాదనలు వినిపించడానికి తగినంత సమయం, అవకాశం ఇచ్చారు. న్యాయ దేవాలయంలో దశాబ్దాల నాటి ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించారు".
"ఈ తీర్పు న్యాయ ప్రక్రియపై సామాన్యులకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది".
"మన దేశంలో వేల సంవత్సరాల సౌభ్రాతృత్వానికి అనుగుణంగా మన 130 కోట్ల భారతీయులకు శాంతి, సంయమనాన్ని పరిచయం చేయాలి. భారత శాంతిపూర్వక సహజీవనం అంతర్లీన భావనను పరిచయం చేయాలి.