అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ఊళ్లోకి వచ్చిన ఎలుగుబంటి, తరిమిన కుక్క

  2. ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

  3. ఒక దేశాధ్యక్షుడి భార్య డెడ్ బాడీని పాలకులే దొంగిలించి, 16 ఏళ్ల పాటు రహస్యంగా తిప్పారు...ఏమిటా కథ?

  4. ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?

  5. కామన్‌వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? గ్లాస్గోలో జరుగుతున్న ఈ గేమ్స్ ఎంత ప్రత్యేకం?

  6. సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...

  7. అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?

  8. జపాన్ భూకంపం: షాపింగ్ మాల్‌లో పేలుడు, కూలిన వంతెన, ఎంతటి విధ్వంసం జరిగిందంటే...

  9. 'సినిమాలో సీన్ కోసం షూట్ చేస్తుంటే హెలికాప్టర్ అగ్నిపర్వతం బిలంలో కూలిపోయింది.. కింద లావా, పైన తుపాను..'

  10. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  11. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  12. వరదలో కొట్టుకుపోతున్న కారులోంచి అమాంతం దూకేశారు

  13. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    నరేంద్ర మోదీ, వీడియో తొలగింపు, మెటా

    ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  14. జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం, విధ్వంసాన్ని చూపే 9 ఫోటోలు...

  15. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

  16. రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

  17. జపాన్‌లో భూకంపం, షాపింగ్ మాల్‌లో చిక్కుకున్న జనం

    జపాన్ భూకంపం

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, జపాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత కుమామోటోలోని 'అయాన్ మాల్' లో పేలుడు సంభవించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

    దక్షిణ జపాన్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ప్రజలను ఆందోళనలో పడేసింది. అధికారుల సమాచారం ప్రకారం, భూకంపం ధాటికి కుమామోటోలోని ఒక షాపింగ్ మాల్‌లో పలువురు ప్రజలు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

    స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించిన తర్వాత కుమామోటోలోని 'అయాన్ మాల్' లో పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    కుమామోటో ప్రిఫెక్చర్‌లో క్యుషు ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతింది, ప్రాంతంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి.

    స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:27 గంటలకు జపాన్‌లోని క్యుషు ద్వీపకల్ప అంతర్భాగంలో ఈ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దాదాపు గంట వ్యవధిలోనే వాటిని ఉపసంహరించుకున్నారు.

    జపాన్ భూకంపం

    ఫొటో సోర్స్, JIJI Press/AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, భూకంపం ధాటికి కుమామోటో నగరంలో కూలిన దుకాణం గోడ

    ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని 1.5 లక్షల మందికి పైగా ప్రజలకు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

    ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా సగటున దాదాపు 1,500 వరకు భూకంపాలు నమోదవుతుంటాయి.

  18. జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?

  19. 'మా నాన్న కల నెరవేర్చడానికి.. కార్ల మీదే సముద్రాన్ని దాటేశాం' అంటున్న యువకుల కథ

  20. నా మీద కేసులన్నీ భూకబ్జాదారులు వేసినవే: హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

    రంగనాథ్

    ఫొటో సోర్స్, BBC/HYDRAA

    హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ప్రభుత్వప్రధాన కార్యదర్శిని ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

    తాను రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను గత రెండేళ్లుగా రక్షిస్తున్నానని రంగనాథ్ ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు.

    ‘ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాం.మరో 20 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల ను హైడ్రా ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీ గా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా , భూ కబ్జా దారులు తప్పుడు సమాచారం తో కోర్ట్ లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి.. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బ‌తుక‌మ్మ‌ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమి ని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న మరొకరు.. వేల సంఖ్య‌లో ఉన్న‌ సింగరేణి కార్మికుల ప్లాట్స్‌ను కొట్టేయాలని చూసినవారు, ప్రభుత్వ భూములను ఆక్రమించినవారికి హైడ్రా కమిషనర్‌గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్లంతా వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగా నే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం’ అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.