You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. కేరళలో ఎల్డీఎఫ్ ఓటమికి పినరయి విజయన్‌పై వ్యతిరేకతే కారణమా?

  2. ఉమ్మెత్త ఆకులతో పప్పు వండుకుని తిన్నారు, తర్వాత ఏమైందంటే..

  3. ‘సీఎం పదవికి రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు’ - మమతా బెనర్జీ

  4. జనసేన, టీవీకే: పవన్ కల్యాణ్ సాధించలేనిది విజయ్ సాధించగలిగారా?

  5. హంటావైరస్: ఎలుకల విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలి పీల్చేవారికి సోకే వైరస్.. క్రూయిజ్ షిప్‌లో మరణాలకు కారణం ఇదేనా?

  6. ‘అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు’ అని 1996లో రజినీకాంత్ ఎందుకన్నారు?

  7. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎస్ఐఆర్ ప్రభావితం చేసిందా?

  8. విజయ్‌ పొత్తు ఎవరితో?

  9. తమిళనాడు: హంగ్ అసెంబ్లీ అయితే.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తారు?

  10. తప్పిపోయిన గున్న ఏనుగును తరిమేస్తున్న ఏనుగు మందలు, ఆందోళన వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు, అసలేం జరిగింది?

  11. పశ్చిమ బెంగాల్: మమత ఓటమికి 5 కారణాలు

  12. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయానికి 4 ప్రధాన కారణాలు ఇవే..

  13. విజయ్-టీవీకే: డీఎంకే, అన్నా డీఎంకేలను దాటి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం ఎలా సాధించారు?

  14. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  15. ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?, (మే 4 రాత్రి 10 గంటలకు)

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం,

    అస్సాంలో భారతీయ జనతా పార్టీ 126 స్థానాలకు గాను 81 స్థానాల్లో ఘనవిజయం సాధించి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాలు గెల్చుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. బి.ఓ.పి.ఎఫ్, ఏ.జి.పి చెరో 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

    కేరళలో కాంగ్రెస్ 63 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష పార్టీలైన సి.పి.ఐ(ఎం) 26 స్థానాల్లో, సి.పి.ఐ 8 స్థానాల్లో గెలుపొందాయి. ఐ.యు.ఎం.ఎల్ కూడా 22 స్థానాలతో తన బలాన్ని నిరూపించుకుంది. కేఈసీ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచింది.

    తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ 96 స్థానాల్లో గెలిచి, మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డి.ఎం.కె 54 స్థానాల్లో గెలిచి 6 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఏ.డి.ఎం.కె 44 స్థానాల్లో విజయం సాధించి, మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో ఇప్పటికే 184స్థానాలను గెలుచుకుని, మరో 23 చోట్ల ముందంజలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి, 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలిచింది.

    కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏ.ఐ.ఎన్.ఆర్.సి 30 స్థానాలకు గాను11 స్థానాల్లో గెలిచి, మరో చోట ఆధిక్యంలో ఉంది. డీఎంకే 5, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల, టీవీకే అభ్యర్థులు 2 చోట్ల గెలిచారు.

  16. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 176 సీట్లలో విజయం 32 స్థానాల్లో ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రాత్రి 9.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించిన ఫలితాల ప్రకారం.. 176 సీట్లలో విజయం సాధించి మరో 32 చోట్ల ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 59 సీట్లలో విజయం సాధించి మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉంది.

    కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచింది. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ 2 సీట్లు గెలిచింది. సీపీఎం ఒక సీటు గెలిచింది. ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ ఒక స్థానం గెలిచింది.

  17. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

    తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

    స్టాలిన్ 2011 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన తమిళనాడు నాలుగో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. 1996లో జయలలిత ఓటమి తర్వాత, పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తన సీటును కోల్పోవడం ఇదే మొదటిసారి.

    తమిళనాడు రాజకీయ చరిత్రలో గతంలోనూ కొందరు ముఖ్యమంత్రులు ఇలాగే ఓడిపోయారు:

    • 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎస్. కుమారస్వామి రాజా శ్రీవిల్లిపుత్తూరు సీటు నుంచి ఓడిపోయారు.
    • 1967లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం. భక్తవత్సలం శ్రీపెరంబుదూర్‌లో పరాజయం పాలయ్యారు.
    • 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-తమిళ మానిలా కాంగ్రెస్ కూటమి విజయం సాధించినప్పుడు, అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ముఖ్యమంత్రి జయలలిత బర్గూర్ స్థానంలో ఓటమి పాలయ్యారు.

    దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, అధికారంలో ఉండి తన నియోజకవర్గంలో ఓడిపోయిన నాలుగో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు. డీఎంకే పార్టీలో ఈ విధంగా ఓడిపోయిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే.

  18. పోటీ చేసిన రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ ముందంజ

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే పార్టీ సాయంత్రం 4.30 గంటలకు 8 స్థానాల్లో విజయం సాధించగా, మరో 101 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

    మరోవైపు, విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

    ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పెరంబూర్‌లో 13 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి విజయ్ 31,766 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, తిరుచ్చి ఈస్ట్‌లో 12 రౌండ్లు ముగిసేసరికి 15,707 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

    ఇదే సమయంలో ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 7,731 ఓట్లకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు.

    ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచారు. విజయ్ పార్టీ ముందంజలో ఉండటంపై నాని, నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు వెంకట్ ప్రభు వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

  19. అస్సాం : కాంగ్రెస్ అభ్యర్థి గొగోయ్ ఓటమి

    అస్సాం ప్రతిపక్ష ముఖచిత్రంగా పేరుగాంచిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఓటమి చెందినట్టు ఈసీఐ ప్రకటించింది.

    జోర్హాట్ నియోజకవర్గంలో గొగోయ్‌పై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి 69,439 ఓట్లు సాధించగా, గొగోయ్‌కు 46,257 ఓట్లు మాత్రమే వచ్చాయి.

  20. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?

    కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలలోని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపునుబట్టి చూస్తే పశ్చిమబెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే సగానికి పైగా స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో సాగుతుండగా, నాలుగోసారి అధికారంలోకి రావాలనుకున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ చతికిలపడింది.

    ఇక తమిళనాడులోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయనాయకుడిగా మారిన సినీనటుడు విజయ్, తమిళనాడులో పాతుకుపోయిన పార్టీలను పక్కకు నెట్టి, విజయం వైపు దూసుకుపోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని విజయ్ టీవీకే పార్టీ సాధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ లో ఆయన పార్టీ వందకు పైగా స్థానాలతో ముందంజలో ఉంది.

    కేరళలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతున్నట్టు ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపును బట్టి తెలుస్తోంది. దీంతో భారత్‌లో వామపక్షాలకు మిగిలిన ఏకైక రాష్ట్రం కూడా వారి చేతుల నుంచి జారిపోనుంది.

    అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా సాగుతోంది.

    పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి స్వల్పమొగ్గు కనిపిస్తోంది. ఇక్కడి ఫలితాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

    మొత్తంగా ఫలితాలను చూస్తే రాజకీయ పరిస్థితులలో ఓ ముఖ్యమైన మార్పుకు అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తన సంప్రదాయ బలమైన ప్రాంతాలను దాటి, ఆధిక్యంతో ముందుకు సాగుతుండగా, దక్షిణ భారత్‌లో కొత్త ప్రాంతీయ పార్టీలు పోటీల రూపాన్ని మార్చుతున్నాయి.