ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Empics
1. 'కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు, నీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటావు?'' - ఏమిటీ కల్ట్స్, ప్రజలు వీటిలో ఎందుకు చేరుతున్నారు?
''ఎప్పుడు చెబుతావు.. నాకు సమాధానం ఎప్పుడు పంపుతావు?''
''కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు? నీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటావు?''
ఈ ప్రశ్నలు ఎక్కడో చూసినట్లు కనిపిస్తున్నాయా? 'అనుకోకుండా ఒకరోజు' సినిమాలో కొందరు వీటిని చీటీల్లో రాసుకొని జేబుల్లో పెట్టుకుని తిరుగుతుంటారు. నవయుగ స్పిరిట్యువల్ సెంటర్ కోసం పనిచేస్తున్నామని వారు చెబుతారు.
''మేం సూర్యస్వామిని అనుసరిస్తాం. మమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్లడానికి ఆయన జన్మించారు. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి లాంటి ప్రశ్నలను ఆయన చిట్టీల రూపంలో దేవుడిని అడిగేవారు. వీటికి సమాధానాల కోసం ఆయన సమాధి అవ్వడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి ఆయన సజీవ సమాధి అయ్యేముందు అందరూ ధ్యానం చేస్తుండగా సహస్ర(చార్మీ) వచ్చి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. దీంతో శాంతి చేయడానికి ఆమెను బలి ఇవ్వాలని గురూజీ నిర్ణయించారు''అని ఆ సినిమాలో ఒక పాత్ర చెబుతుంది.
అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామని ఆలోచిస్తున్నారా? తాజాగా ఇలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

2. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి... ముగ్గురూ మోదీకే జై కొడుతున్నారా?
'ఆంధ్రప్రదేశ్ లో మేమే ప్రత్యామ్నాయం. వైసీపీ, టీడీపీ విధానాలతో జనం విసుగెత్తిపోయారు. వచ్చే ప్రభుత్వం మాదే.' ఇది ఏప్రిల్ 24న గుంటూరు వేదికగా జరిగిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటన.
కానీ, మరునాడే మోదీ డెవలప్ మెంట్ విజన్ కి చంద్రబాబు జై కొట్టారు. తన మద్దతు కూడా ప్రకటించారు.
వాస్తవానికి రాష్ట్రంలో రెండు పార్టీలకు తాము సమానదూరం పాటిస్తున్నామని బీజేపీ అంటోంది. కానీ బీజేపీ కి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు సన్నిహితంగానే ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నాయి. జనసేన నేరుగా బీజేపీ తో మితృత్వం నడుపుతోంది. తమ అనుబంధం రాజకీయాలకి అతీతమైనది అంటూ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేరుగా మోదీ సమక్షంలోనే ప్రకటించారు. తాజాగా చంద్రబాబు కూడా మోదీ విధానాలను కొనియాడారు. తాను మద్దతుగా నిలుస్తానని కూడా ప్రకటించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
3. చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ''చార్ ధామ్ యాత్ర'' ఒకటి. ఈ యాత్రలో హిందువులు నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటారు.అసలు చార్ ధామ్ యాత్ర అంటే ఏంటి? ఈ యాత్రలో ఏయే క్షేత్రాలను చూడొచ్చు? ఎలా వెళ్లాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. హిమాలయ పర్వతాల్లో ఉండే నాలుగు దేవాలయాలను దర్శించే యాత్రను చార్ ధామ్ అంటే.. నాలుగు క్షేత్రాలు అంటారు. ఇవన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, KEAN COLLECTION
4. భర్త చితి మీదే భార్యను ఆహుతి చేసే ‘సతి’ దురాచారంపై భారత్ ఎలా గెలిచింది?
హిందువుల్లో చనిపోయిన భర్తతోపాటు భార్యను కూడా చితిపై సజీవ దహనంచేసే దురాచారం ''సతి''ని 1829 డిసెంబరులో బ్రిటిష్ ఇండియా తొలి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రద్దుచేశారు.
అప్పట్లో ఆయన బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉండేవారు. సతిపై 49 మంది సీనియర్ సైన్యాధికారులు, ఐదుగురు జడ్జిల అభిప్రాయాలను ఆయన సేకరించారు. ఆ తర్వాత 'బ్రిటిష్ పాలనపై మచ్చ'లా కనిపిస్తున్న దీన్ని రద్దుచేసేందుకు సమయం ఆసన్నమైందని ఆయన భావించారు.
''మానవత్వానికి చెంపపెట్టులా మారిన సతి చాలా మంది హిందువులనూ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది, ఇది చట్టవిరుద్ధమైనది కూడా..''అని విలియం బెంటింక్ తన ఆదేశంలో పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Thinkstock
5. ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
ప్రేమ విఫలమైనప్పుడు మీ గుండె బద్దలైనట్లు అనిపించిందా? ఆపుకోలేనంత ఏడుపు వచ్చిందా? కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు తల తిరిగిందా?
మీలో ఏదో జరిగిపోతోందని అనిపిస్తోందా? అయితే, ఒక్క నిమిషం ఆగండి.
అసలు మీ శరీరంలో ఇప్పుడు జరుగుతోందో మీరు తెలుసుకోవాలి.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- గుండెపోటు- చిన్న అబ్బాయికి స్టంట్ వేయాలంటే వైద్యులే చలించిపోయారు
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా-?
- నరేంద్ర మోదీపై చంద్రబాబు స్వరం ఎలా మారుతూ వస్తోంది- ఎప్పుడు పొగిడారు, ఎప్పుడు విమర్శించారు-?
- ఆంధ్రప్రదేశ్- 'అమ్మా నాన్నలను చంపేస్తానని బెదిరించి కిడ్నీ తీసుకున్నాడు' - బీబీసీతో విశాఖ బాధితుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























