You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కారు వాషింగ్ సెంటర్‌లో మటన్ అమ్మినందుకు 10 నెలల జైలు శిక్ష
మురికిగా ఉన్న కార్లు తుడిచే షెడ్డులో మాంసాన్ని విక్రయించినందుకు ఓ వ్యక్తికి 10 నెలల జైలు శిక్ష విధించారు.
బ్రిటన్‌లోని విల్ట్‌షైర్ డివైజెస్ పట్టణంలోని న్యూ పార్క్ స్ట్రీట్‌కు చెందిన జెంట్ జకుపిపై ఆహార పరిశుభ్రతకు సంబంధించిన 39 అభియోగాలు మోపారు.
కోర్టులో తన నేరాలను జకుపి అంగీకరించారు.
జకుపి చట్టవిరుద్ధంగా మాంసం అమ్ముతున్న ప్రదేశాన్ని చూసి "దిగ్భ్రాంతికి గురయ్యామని" స్థానిక ఆహార పరిశుభ్రత బృందం తెలిపింది.
ఆ షెడ్డులో గొడ్డు మాంసం, మటన్ జాయింట్లు కోసి పడి ఉన్నాయి. ఆ చుట్టుపక్కలంతా కుక్కల వ్యర్థాలు, చమురుతో నిండి ఉంది.
విల్ట్‌షైర్ కౌన్సిల్ ఫుడ్ అండ్ సేఫ్టీ టీమ్‌కు చెందిన పర్యావరణ ఆరోగ్య అధికారులు దర్యాప్తు జరిపిన అనంతరం జకుపి తన నేరాలను అంగీకరించారు.
2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో డివైజెస్‌లోని న్యూ పార్క్ స్ట్రీట్, లుడ్జర్‌షాల్‌లోని ఆండోవర్ రోడ్‌లో కార్ వాషింగ్ షెడ్డులపై ఈ బృందం సోదా చేసింది.
మాంసం అమ్మే ప్రాంతం అత్యంత అపరిశుభ్రంగా ఉందని గ్రహించిన వెంటేనే అధికారులు ఆ ప్రాంతాలను అత్యవసరంగా మూసివేశారు.
అక్కడ విక్రయించిన మాంసం వినియోగానికి పనికిరాదని హెచ్చరిస్తూ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ద్వారా జాతీయ ఆహార హెచ్చరిక (నేషనల్ ఫుడ్ అలర్ట్) కూడా జారీ చేశారు.
ఆ కారు వాషింగ్ షెడ్డు నుంచి సుమారు 2.7 టన్నుల గొడ్డు మాంసం, గొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత దాన్ని పారవేశారు.
2020 జనవరి నుంచి నవంబర్ వరకు మాంసం విక్రయం ద్వారా జకుపికి £150,000 (సుమారు రూ.1,49,53,230) లాభం వచ్చి ఉంటుందని అంచనా వేసినట్లు కోర్టులో తెలిపారు.
"మురికిగా ఉన్న ఆ ప్రాంతం, చట్టవిరుద్ధంగా అమ్ముతున్న మాంసం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఇంత అపరిశుభ్రమైన ప్రదేశాన్ని ఎప్పుడూ చూడలేదు" అని దర్యాప్తు అధికారులు వెల్లడించినట్లు విల్ట్‌షైర్ కౌన్సిల్ తెలిపింది.
"ఆ రెండు వీధుల్లో మాంసాన్ని విక్రయిస్తున్న ప్రదేశాలు చూసి మా అధికారులు షాక్‌కు గురయ్యారు. అక్కడి నుంచి మాంసం కొనుక్కున్నవారికి ఇది చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఇక్కడినుంచి దేశవ్యాప్తంగా మాంసాన్ని సరఫరా చేస్తున్నారు" అని పబ్లిక్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ మంత్రి యాష్లే ఓ నీల్ తెలిపారు.
"ఇలా చట్టవిరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం అమ్మడాన్ని ఉపేక్షించబోమని అందరికీ తెలియాలి. జకుపికి వేసిన శిక్ష అందరికీ ఓ హెచ్చరికలా పనిచేస్తుందని ఆశిస్తున్నాం" అని ఓ నీల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తదుపరి మహమ్మారి కోవిడ్ కంటే ప్రాణాంతకంగా ఉంటుందా
- బీబీసీ 100 మంది మహిళలు 2021
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- కరోనావైరస్: mRNA వ్యాక్సీన్ తీసుకుంటే సూపర్ హ్యూమన్ అయిపోతారా?
- వసీం రిజ్వీ ఇప్పుడు జితేంద్ర త్యాగి అయ్యారు.. ఇస్లాం విడిచిపెట్టి హిందువుగా మారారు
- కోవిడ్-19 వ్యాక్సినేషన్: వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతుందా?
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు
- నాగాలాండ్ హింస: 70 ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ ఉద్యమ చరిత్ర ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)