You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెస్ట్ వర్జీనియా: టీకా వేసుకునే యువతకు నగదు బాండ్ల బహుమతి
యువత కోవిడ్ టీకా వేసుకుంటే 100 డాలర్ల(సుమారు రూ. 7,500) విలువైన సేవింగ్స్ బాండ్ ఇస్తామని అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రం ప్రకటించింది.
16 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులకు ఇలా సేవింగ్స్ బాండ్ ఇస్తామనడం వల్ల వారు టీకా వేయించుకునే అవకాశాలు పెరుగుతాయని అక్కడి పాలకులు చెబుతున్నారు.
'ఈ మహమ్మారికి ముగింపు పలకడంలో యువతే కీలకం, వారు ఆ విషయం తెలుసుకోవడం లేదు' అని ఆ రాష్ట్ర గవర్నర్ జిమ్ జస్టిస్ అన్నారు.
నిజానికి వ్యాక్సినేషన్ అధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో వెస్ట్ వర్జీనియా ఒకటి. కానీ, గత కొద్ది వారాలుగా అక్కడ వ్యాక్సిన్ వేయించుకుంటున్నవారి సంఖ్య తగ్గింది.
ముఖ్యంగా యువతలో ఈ వ్యాక్సీన్లపై పలు సంశయాలు ఉండడంతో వారంతా ముందుకు రావడం లేదు.
100 డాలర్లకు ఎవరు అర్హులంటే..
16 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు వ్యాక్సీన్ వేయించుకుంటే ఈ 100 డాలర్ల సేవింగ్స్ బాండ్ పొందొచ్చు. ఈ వయోవిభాగంలో ఇప్పటికే టీకా తీసుకున్న వారు కూడా దీనికి అర్హులే.
టీకా వేయించుకోవడానికి అర్హత ఉన్న జనాభాలో ఇప్పటికే 52 శాతం మందికి టీకా అందింది. మిగతా వారిలో చాలామంది సంశయిస్తున్నారని గవర్నర్ చెప్పారు.
అమెరికాలో 16 ఏళ్లు దాటినవారికి కోవిడ్ టీకా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?
- గాంధీ హాస్పిటల్కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కారణాలేంటి... ఏ పార్టీ ఏమంటోంది?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)